
ఐపీఎల్-2024లో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా ఎస్‌ఆర్‌హెచ్‌తో జరిగిన హై స్కోరింగ్ మ్యాచ్‌లో 25 పరుగుల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ ఓటమి పాలైనప్పటికి ఆ జట్టు వికెట్ కీపర్ బ్యాటర్ దినేష్ కార్తీక్ మాత్రం అద్బుతమైన పోరాట పటిమతో అందరని ఆకట్టుకున్నాడు.
288 పరుగుల భారీ లక్ష్య చేధనలో కార్తీక్ ఒంటరి పోరాటం చేశాడు. ఆరో స్దానంలో బ్యాటింగ్‌కు వచ్చిన కార్తీక్.. ప్రత్యర్ధి బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. తన ట్రేడ్ మార్క్ షాట్లతో కార్తీక్ అలరించాడు. అతడికి బౌలింగ్‌లో ఎలా చేయాలో ఆర్ధం కాక ఎస్‌ఆర్‌హెచ్ బౌలర్లు తలలపట్టుకున్నారు. భువనేశ్వర్, ప్యాట్ కమ్మిన్స్ వంటి సీనియర్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. కేవలం 35 బంతుల్లోనే 5 ఫోర్లు, 7 సిక్స్‌లతో 83 పరుగులు చేశాడు.
అతడు విధ్వంసకర ఇన్నింగ్స్ ఫలితంగానే ఆర్సీబీ.. ఎస్‌ఆర్‌హెచ్‌కు గట్టిపోటీ ఇవ్వగల్గింది. డికే ఈ ఏడాది సీజన్‌లో అద్బుతంగా రాణిస్తున్నాడు. ఆఖరిలో బ్యాటింగ్ వచ్చి తన జట్టుకు ఫినిషింగ్ టచ్ ఇస్తున్నాడు. ఈ మ్యాచ్ కంటే ముందు ముంబైతో మ్యాచ్‌లోనూ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.
ఈ క్రమంలో దినేష్ కార్తీక్‌పై అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఎస్‌ఆర్‌హెచ్ మ్యాచ్ గెలిచి ఉండవచ్చు.. డీకే మాత్రం మా మనసులను గెలుచుకున్నాడంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరి కొంతమంది త్వరలో జరగనున్న టీ20 వరల్డ్‌కప్‌కు కార్తీక్‌ను ఎంపిక చేయాలంటూ అభిప్రాయపడుతున్నారు.
— Cricket Videos (@cricketvid123) April 15, 2024
Comments
Please login to add a commentAdd a comment