ఐపీఎల్-2024లో రాజస్తాన్ రాయల్స్ యువ ఆటగాడు రియాన్ పరాగ్ మరోసారి అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ఉప్పల్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో పరాగ్ విధ్వంసం సృష్టించాడు. 202 పరుగుల లక్ష్య చేధనలో ఎస్‌ఆర్‌హెచ్ బౌలర్లకు పరాగ్ చుక్కలు చూపించాడు.
ఒక్క పరుగుకే రెండు వికెట్లు కోల్పోయిన కష్టాల్లో పడిన రాజస్తాన్‌ను పరాగ్ తన ఇన్నింగ్స్‌తో మ్యాచ్‌లో నిలిపాడు. పరాగ్ ఓపెనర్ యశస్వీ జైశ్వాల్‌తో కలిసి రెండో వికెట్‌కు 135 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో 49 బంతులు ఎదుర్కొన్న పరాగ్.. 8 ఫోర్లు, 4 సిక్స్‌లతో 77 పరుగులు చేశాడు.
అతడి ఇన్నింగ్స్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు అతడిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. టీ20 వరల్డ్‌కప్‌కు సెలక్ట్ చేయలేదన్న కసి మొత్తం ఈ మ్యాచ్‌లో చూపించాడని కామెంట్లు చేస్తున్నారు.
కాగా ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌లో పరాగ్ అద్బుత ప్రదర్శన కనబరుస్తుండడంతో భారత వరల్డ్‌కప్ జట్టులో చోటు దక్కుతుందని భావించారు. కానీ సెలక్టర్లు అతడిని పరిగణలోకి తీసుకోలేదు. ఈ ఏడాది సీజన్‌లో ఇప్పటివరకు 10 మ్యాచ్‌లు ఆడిన పరాగ్ 409 పరుగులు చేశాడు.
ఎస్‌ఆర్‌హెచ్ చేతిలో ఒక్క పరుగు తేడాతో రాజస్తాన్ ఓటమి పాలైంది. 202 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 200 పరుగులు చేసింది. రాజస్తాన్ బ్యాటర్లలో యశస్వీ జైశ్వాల్(67), రియాన్ పరాగ్(77) హాఫ్ సెంచరీలతో పోరాట పటిమ కనబరిచారు.
ఎస్‌ఆర్‌హెచ్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ మూడు వికెట్లు పడగొట్టగా.. నటరాజన్, కమ్మిన్స్ తలా రెండు వికెట్లు సాధించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఎస్‌ఆర్‌హెచ్ ఎస్‌ఆర్‌హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 201 పరుగుల భారీ స్కోర్ సాధించింది.
If you are one of those who trolled Riyan Parag during his tough time then you need to say sorry to him.
He is slapping all of us with his exceptional performance.He is the finisher along with Rinku Singh who will bring the ICC trophy in future for Indiapic.twitter.com/Mk0IRvtfhJ— Sujeet Suman (@sujeetsuman1991) May 2, 2024
Comments
Please login to add a commentAdd a comment