ఆ ఇద్దరు భారత క్రికెటర్లు నా ఫేవరేట్‌ : జాన్వీ కపూర్‌ | Janhvi Kapoor Reveals Her Favourite Cricketers Names - Sakshi
Sakshi News home page

ఆ ఇద్దరు భారత క్రికెటర్లు అంటే నాకు చాలా ఇష్టం: జాన్వీ కపూర్‌

Feb 25 2024 7:23 AM | Updated on Feb 25 2024 12:51 PM

Janhvi Kapoor Reveals Her Favourite Cricketers - Sakshi

 భూమి గుండ్రంగా ఉందన్న విషయం తెలిసిందే. మనుషుల జీవితాలు గుండ్రంగానే ఉంటాయని కొందరిని చూస్తుంటే అనిపిస్తోంది. ఉదాహరణకు నటి జాన్వీ కపూర్‌ నే తీసుకుంటే ఈమె తల్లి అందాల రాశి దివంగత నటి శ్రీదేవి తెలుగమ్మాయి. బాలనటిగా రంగప్రవేశం చేసి తెలుగు, తమిళం భాషల్లో పలు చిత్రాల్లో నటించి సత్తాచాటారు. ఆ తరువాత కథానాయకిగా దక్షిణాదిని ఏలేసీ హిందీ చిత్రాలతో ఉత్తరాది ప్రేక్షకులనూ మైమరపించి మిస్టర్‌ ఇండియా అయ్యారు. అలాంటి అపరంజి బొమ్మ కడుపును పుట్టిన జాన్వీ కపూర్‌ కూడా ఇప్పుడు ఇండియన్‌ సినిమాను చుట్టేస్తున్నారు. అయితే ఈ బ్యూటీ తల్లికి కాస్త భిన్నంగా పయనిస్తున్నారు. శ్రీదేవి దక్షిణాదిలో జయించి ఉత్తరాది వెళితే జాన్వీ కపూర్‌ ఉత్తరాదిలో పాపులర్‌ అయ్యి దక్షిణాదిలో ఎంట్రీ ఇచ్చారు.

హిందీలో దడక్‌ చిత్రంతో కథానాయికగా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ దక్షిణాదిలో దేవర చిత్రంతో దిగుమతి అయ్యారు. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఇందులో జూనియర్‌ ఎన్టీఆర్‌తో జాన్వీ కపూర్‌ జత కడుతున్నారు. ఈ చిత్రం భారీ అంచనాల మధ్య సెప్టెంబర్‌ నెలలో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. కాగా తదుపరి జాన్వీ మరో భారీ క్రేజీ ఆఫర్‌ వివరించిందని తెలిసింది. అదే నటుడు రామ్‌ చరణ్‌ తో రొమాన్స్‌ చేసే అవకాశం. ఇకపోతే కోలీవుడ్‌ స్టార్‌ హీరో సూర్యతోనూ జత కట్ట బోతున్నారన్నారు. అయితే ఇది పాన్‌ ఇండియా చిత్రం కావడం విశేషం. మహాభారతం ఇతివృత్తంతో తెరకెక్కనున్న ఈ చిత్రంలో కర్ణుడిగా నటించబోతున్న సూర్య సహ ధర్మచారిగా జాన్వీ కపూర్‌ నటించనున్నట్లు స్వయానా ఆమె తండ్రి బోనీకపూర్‌ ఇటీవల ఒక భేటీలో స్పష్టం చేశారు. ఇంకాపోతే తాను దక్షిణాది చిత్రాల్లో నటించడానికి గురించి నటి జాన్వీ కపూర్‌ ఒక భేటీలో పేర్కొంటూ దేవర వంటి భారీ చిత్రంలో తానూ భాగం కావడం సంతోషంగా ఉందన్నారు.

ఈ చిత్రంలో నటించడం ద్వారా ఇక్కడ తన మూలాలను చేరుకునే అవకాశం కలుగుతోందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మరో విషయం ఏమిటంటే తాను ఇప్పుడు తెలుగు భాషను నేర్చుకుంటున్నానని చెప్పారు. తనకు ఇండియన్‌ సినిమా, క్రికెట్‌ క్రీడ అంటే చాలా ఇష్టం అన్నారు. క్రికెట్‌ క్రీడాకారులు విరాట్‌ కోహ్లీ, దినేష్‌ కార్తీక్‌ అంటే చాలా ఇష్టం అని జాన్వీ కపూర్‌ పేర్కొన్నారు. తాను దక్షిణాది చిత్రాల్లో నటించడం ద్వారా జీవితం గుండ్రంగా సాగుతోందని అనిపిస్తోందని ఈ బ్యూటీ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement