WTC Final: Dinesh Karthik Says Bumrah Is Set For International Comeback - Sakshi
Sakshi News home page

టీమిండియా ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్‌.. అతడొచ్చేస్తున్నాడు..!

Published Sat, Jun 10 2023 6:35 PM | Last Updated on Sat, Jun 10 2023 6:47 PM

WTC Final: Dinesh Karthik Says Bumrah Is Set For International Comeback - Sakshi

టీమిండియా అభిమానులకు వెటరన్‌ వికెట్‌కీపర్‌ దినేశ్‌ కార్తీక్‌ శుభవార్త చెప్పాడు. గాయం కారణంగా గతేడాది సెప్టెంబర్‌ నుంచి క్రికెట్‌కు దూరంగా ఉన్న జస్ప్రీత్‌ బుమ్రా.. ఆగస్ట్‌లో ఐర్లాండ్‌తో జరిగే టీ20 సిరీస్‌తో టీమిండియాలోకి రీఎంట్రీ ఇస్తాడని పరోక్షంగా కన్ఫర్మ్‌ చేశాడు. డబ్ల్యూటీసీ ఫైనల్‌ 2021-23 నాలుగో రోజు కామెంట్రీ ఇస్తూ డీకే ఈ విషయాన్ని బయటపెట్టాడు.

బుమ్రా ఎంట్రీతో టీమిండియా బౌలింగ్‌ విభాగం మరింత పటిష్టం కానుంది. ఈ ఏడాది చివర్లో స్వదేశంలో జరిగే వరల్డ్‌కప్‌ కంతా బుమ్రా సెట్‌ అయితే, అది టీమిండియాకు చాలా మేలు చేస్తుంది. కాగా, ఆగస్ట్‌ 18, 20, 23 తేదీల్లో టీమిండియా.. ఐర్లాండ్‌తో 3 టీ20లు ఆడనుంది. ఇందుకోసం భారత్‌.. ఐర్లాండ్‌లో పర్యటించనుంది. ఈ పర్యటన కోసం జట్లను ప్రకటించాల్సి ఉంది. 

ఇదిలా ఉంటే, వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో ఆస్ట్రేలియా ఆధిపత్యం కొనసాగిస్తుంది. నాలుగో రోజు రెండో సెషన్‌ సమయానికి ఆ జట్టు 425 పరుగుల లీడ్‌ను సాధించింది. మరో 30, 40 పరుగులు చేసి, ఆ జట్టు ఇన్నింగ్స్‌ను (ఆసీస్‌ రెండో ఇన్నింగ్స్‌ 252/6) డిక్లేర్‌ చేయవచ్చు. అలెక్స్‌ క్యారీ (64), స్టార్క్‌ (33) క్రీజ్‌లో ఉన్నారు.

స్కోర్‌ వివరాలు..

  • ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌: 469 ఆలౌట్‌ (హెడ్‌ 163, స్మిత్‌ 121, సిరాజ్‌ 4/108)
  • భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 296 ఆలౌట్‌ (రహానే 89, ఠాకూర్‌ 51, కమిన్స్‌ 3/83)
  • ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌: 252/6 (అలెక్స్‌ క్యారీ 64 బ్యాటింగ్‌, జడేజా 3 వికెట్లు)

ఆసీస్‌ 425 పరుగుల ఆధిక్యంలో ఉంది

చదవండి: WTC Final: టీమిండియా గెలుస్తుందా లేక చేతులెత్తేస్తుందా..?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement