ఐపీఎల్-2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు దినేష్ కార్తీక్ మరోసారి విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో కార్తీక్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఐదో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చిన కార్తీక్.. ప్రత్యర్ధి బౌలర్లను ఊచకోత కోశాడు. కార్తీక్ తన ట్రేడ్ మార్క్ షాట్లతో అభిమానులను అలరించాడు.
ముఖ్యంగా ముంబై పేసర్ ఆకాష్ మధ్వాల్‌ను డీకే ఓ ఆట ఆడేసుకున్నాడు. ఆకాష్ మధ్వాల్ వేసిన తన ఆఖరి రెండు ఓవర్లలో కార్తీక్ ఏకంగా 38 పరుగులు రాబట్టాడు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో కేవలం 23 బంతులు మాత్రమే ఎదుర్కొన్న కార్తీక్.. 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో 53 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.
అతడు ఇన్నింగ్స్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో కార్తీక్‌పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నాడు. డీకే ది ఫినిషర్ అంటూ కామెంట్లు చేస్తున్నాడు.
అతడి విధ్వంసకర ఇన్నింగ్స్ ఫలితంగా ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. ఆర్సీబీ బ్యాటర్లలో కెప్టెన్ డుప్లెసిస్(61) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇక ముంబై బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా 5 వికెట్లతో చెలరేగాడు.
— Sitaraman (@Sitaraman112971) April 11, 2024
Comments
Please login to add a commentAdd a comment