
హార్దిక్ పాండ్యా- రోహిత్ శర్మ
Rohit Sharma- Hardik Pandya: టీ20 ప్రపంచకప్ 2022 తర్వాత టీమిండియా ఆడిన పలు ద్వైపాక్షిక సిరీస్‌లకు ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా సారథ్యం వహించాడు. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ విశ్రాంతి పేరిట ఆయా మ్యాచ్‌లకు దూరమవుతూ ఉన్నాడు. తాజాగా స్వదేశంలో న్యూజిలాండ్ టీ20 సిరీస్ నేపథ్యంలోనూ ఇదే పరిస్థితి.
ఈ నేపథ్యంలో రోహిత్‌ను తప్పించి హార్దిక్‌ను పరిమిత ఓవర్ల క్రికెట్‌లో పూర్తి స్థాయి కెప్టెన్ చేస్తారంటూ గత కొన్ని రోజులుగా క్రీడా వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ దినేశ్ కార్తిక్ తాజాగా తన అభిప్రాయాలు పంచుకున్నాడు. క్రిక్‌బజ్‌తో మాట్లాడుతూ.. ‘‘అవును.. పాండ్యాకు పగ్గాలు అప్పగించే అవకాశాలు ఉన్నాయి.
అద్భుతంగా ఆడితే తప్ప
అయితే, ఇప్పుడే అది జరుగుతుందనుకోను. ఎందుకంటే.. వన్డే వరల్డ్‌కప్-2023 కంటే ముందు టీమిండియా మూడు టీ20 సిరీస్‌లు మాత్రమే ఆడనుంది. ఐపీఎల్ తర్వాత వెస్టిండీస్‌తో సిరీస్. నిజానికి ప్రపంచకప్ టోర్నీ ముగిసిన తర్వాతే కెప్టెన్సీ మార్పు అంశంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ రోహిత్ సేన ఈ ఐసీసీ ఈవెంట్‌లో అద్భుతం చేస్తే పర్లేదు.
అలా అయితే రానున్న వరల్డ్‌కప్‌లోనూ
లేదంటే కచ్చితంగా కెప్టెన్సీ రోహిత్ చేజారే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ప్రపంచకప్‌లో టీమిండియా అదరగొడితే.. రోహిత్ టీ20లలో కొనసాగాలనుకుంటే.. వరల్డ్‌కప్-2024లోనూ తనే కెప్టెన్‌గా ఉంటాడనటంలో అతిశయోక్తి లేదు’’ అని డీకే అభిప్రాయపడ్డాడు.
ఇక హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ గురించి చెబుతూ.. ‘‘ఇప్పటి వరకైతే హార్దిక్ నాయకత్వ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నాడు. శ్రీలకంతో ముంబైలో జరిగిన మ్యాచ్‌లో తన కెప్టెన్సీ ఎలా ఉంటుందో మనం చూశాం’’ అని దినేశ్ కార్తిక్ అతడిని ప్రశంసించాడు. కాగా ఇటీవల ముంబై మ్యాచ్‌లో టీమిండియా రెండు పరుగుల తేడాతో గెలుపొందిన సంగతి తెలిసిందే.
చదవండి: Rahul Tripathi: 'కోహ్లి స్థానాన్ని అప్పగించాం.. ఇలాగేనా ఔటయ్యేది'
Washington Sundar: 'బిర్యానీ నచ్చలేదని రెస్టారెంట్‌కు వెళ్లడం మానేస్తామా'