
PC: IPL.com
ఐపీఎల్-2024లో భాగంగా వాంఖడే వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ నిరాశపరిచాడు. తన హోం గ్రౌండ్‌లో రోహిత్ శర్మ ఖాతా తెరవకుండానే ఔటయ్యాడు. ముంబై ఇన్నింగ్స్ తొలి ఓవర్ వేసిన ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌లో.. వికెట్ కీపర్ సంజూ శాంసన్‌కు క్యాచ్ ఇచ్చి హిట్‌మ్యాన్ పెవిలియన్‌కు చేరాడు.
ఈ మ్యాచ్‌లో డకౌట్ అయిన రోహిత్ శర్మ ఓ చెత్త రికార్డును నెలకొల్పాడు. ఐపీఎల్‌లో అత్యధికసార్లు డకౌట్లు అయిన దినేష్ కార్తీక్ చెత్త రికార్డును రోహిత్ సమం చేశాడు. కార్తీక్ ఇప్పటివరకు 17 సార్లు డకౌట్ కాగా.. రోహిత్ శర్మ సైతం 17 సార్లు ఖాతా తెరవకుండానే ఔటయ్యాడు. వీరి తర్వాతి స్ధానంలో ఆర్సీబీ స్టార్ ప్లేయర్ గ్లెన్ మాక్స్‌వెల్(15) ఉన్నాడు.
ఐపీఎల్‌లో అత్యధిక సార్లు డకౌట్లైన ఆటగాళ్లు వీరే..
రోహిత్ శర్మ(17)
దినేష్ కార్తీక్(17),
గ్లెన్ మాక్స్‌వెల్(15),
పీయూష్ చావ్లా(15)
మన్‌దీప్ సింగ్(15)
సునీల్ నరైన్(15)
Comments
Please login to add a commentAdd a comment