భారత మాజీ వికెట్‌కీపర్ కమ్ బ్యాటర్ దినేశ్ కార్తీక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 2025 ఐపీఎల్ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా అక్షర్ పటేల్ వ్యవహరిస్తాడని జోస్యం చెప్పాడు. మెగా వేలంలో డీసీ యాజమాన్యం కేఎల్ రాహుల్‌ను రూ. 14 కోట్లకు సొంతం చేసుకున్నా, అక్షర్ పటేల్‌కే ఢిల్లీ కెప్టెన్‌గా ఎంపికయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయని అన్నాడు. క్రిక్‌బజ్‌లో జరిగిన ఓ కార్యక్రమం సందర్భంగా డీకే ఈ విషయాలను పంచుకున్నాడు.
ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో టీమిండియా వైస్ కెప్టెన్‌గా అక్షర్ పటేల్ ఎంపికయ్యాడు. హార్దిక్ పాండ్యాను కాదని అక్షర్‌ను టీమిండియా వైస్ కెప్టెన్‌గా నియమించడంపై డీకే స్పందిస్తూ.. హార్దిక్‌ను వైస్ కెప్టెన్సీ నుండి ఎందుకు తొలగించారో నాకు తెలియదు. హార్దిక్‌ను వైస్ కెప్టెన్సీ నుంచి తప్పించడానికి కారణం కూడా కనిపించడం లేదు. హార్దిక్ వైస్ కెప్టెన్‌గా ఉండగా టీమిండియా బాగా రాణించింది.
హార్దిక్, సూర్యకుమార్ ఆథ్వర్యంలో టీమిండియా ద్వైపాక్షిక సిరీస్‌లో (సౌతాఫ్రికా) గెలిచింది. అక్షర్ పటేల్ విషయానికొస్తే.. అతనికి ఇదో మంచి అవకాశం. మరి ముఖ్యంగా అతను ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా కూడా ఉండబోతున్నాడు. ఇంగ్లండ్‌తో సిరీస్ అక్షర్‌కు బాగా ఉపయోగపడుతుంది. గుజరాత్ కెప్టెన్‌గా కూడా అక్షర్‌కు అనుభవం ఉంది. అక్షర్‌కు నా శుభాకాంక్షలు అంటూ కార్తీక్ చెప్పుకొచ్చాడు.
డీకే ఏ ఆధారంగా అక్షర్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అన్నాడో తెలీదు కానీ, అక్షర్‌కు ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్ బాగా ఉపయోగపడుతుంది. అక్షర్ గత సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. రిషబ్ పంత్ గైర్హాజరీలో అక్షర్ ఓ మ్యాచ్‌లో డీసీ కెప్టెన్‌గా సేవలందించాడు.
మెగా వేలానికి ముందు డీసీ యాజమాన్యం అక్షర్‌ను రూ.18 కోట్లకు రీటైన్ చేసుకుంది. 30 ఏళ్ల స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అయిన అక్షర్.. 2019 నుంచి ఢిల్లీ క్యాపిటల్స్‌లో భాగమై ఉన్నాడు. కాగా, అక్షర్ ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అవుతాడని తేల్చి చెప్పిన దినేశ్ కార్తీక్ గతంలో ఆ ఫ్రాంచైజీకి కెప్టెన్‌గా వ్యవహరించాడు.
సాధారణ ఆటగాడిగా రాహుల్..?
అక్షర్ పటేల్ ఢిల్లీ కెప్టెన్‌గా ఎంపికైతే పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ మాజీ కెప్టెన్ కేఎల్ రాహుల్ 2020 సీజన్ తర్వాత తొలిసారి సాధారణ ఆటగాడిగా బరిలోకి దిగుతాడు. 2020, 2021 సీజన్లలో పంజాబ్ కెప్టెన్‌గా.. 2022-24 వరకు లక్నో కెప్టెన్‌గా వ్యవహరించిన రాహుల్‌ను ఇటీవల ముగిసిన మెగా వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ దక్కించుకుంది. రాహుల్ డీసీ తరఫున ఓపెనర్‌గా బరిలోకి దిగుతాడో లేక మిడిలార్డర్‌లో బ్యాటింగ్ చేస్తాడో అన్న అంశం ఆసక్తికరంగా మారింది.
ఇదిలా ఉంటే, గత సీజన్‌లో ఢిల్లీ కెప్టెన్‌గా వ్యవహరించిన రిషబ్ పంత్‌ను మెగా వేలంలో లక్నో సూపర్ జెయింట్స్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment