Hardik Pandya Opened Up On His Long Break From The Indian Team - Sakshi
Sakshi News home page

Hardik Pandya: అది తప్పు! టీమిండియా నుంచి నన్ను తప్పించలేదు.. సెలక్షన్‌కు అందుబాటులో ఉంటే కదా!

Published Fri, Jun 3 2022 6:19 PM | Last Updated on Fri, Jun 3 2022 7:20 PM

IPL 2022: Hardik Pandya Clears Rumors Being Dropped From Team India - Sakshi

ఐపీఎల్‌-2022 ట్రోఫీతో గుజరాత్‌ కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా(PC: IPL/BCCI)

‘‘టీమిండియా నుంచి నన్ను తప్పించారంటూ చాలా మంది అపార్థం చేసుకుంటున్నారు. నిజానికి అది నా వ్యక్తిగత నిర్ణయం. నేను సెలవు తీసుకున్నాను అంతే! మనం అందుబాటులో ఉండి కూడా జట్టుకు ఎంపిక కాకపోతే తప్పుడు జట్టు నుంచి తప్పించినట్టు!

కానీ నా విషయంలో అలా జరుగలేదు. సుదీర్ఘకాలం పాటు విరామం తీసుకోవాలనుకుంటున్నానన్న నా అభ్యర్థనను మన్నించిన బీసీసీఐకి రుణపడి ఉంటాను. సెలక్షన్‌కు అందుబాటులో ఉండాలని వారు నన్ను బలవంతం చేయలేదు. 

అంతా బాగుంది కాబట్టే ఇప్పుడు పాత హార్దిక్‌ను మీరు చూడగలుగుతున్నారు’’ అంటూ టీమిండియా సీనియర్‌ ఆల్‌రౌండర్‌, గుజరాత్‌ టైటాన్స్‌ కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా అన్నాడు. కాగా ఐపీఎల్‌-2021లో ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహించిన హార్దిక్‌.. పూర్తిగా విఫలమయ్యాడు. 

అయినప్పటికీ టీ20 ప్రపంచకప్‌-2021 భారత జట్టులో చోటు దక్కించుకున్నాడు. అయితే, ఐసీసీ మెగా టోర్నీలో ఆకట్టుకోలేకపోయాడు. దీంతో తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. ఫిట్‌నెస్‌ సమస్యలతో సతమతమయ్యాడు. జాతీయ క్రికెట్‌ అకాడమీలో చేరి శిక్షణ తీసుకున్నాడు.

ఈ క్రమంలో దక్షిణాఫ్రికా పర్యటనకు టీమిండియా పయనమైన వేళ.. తాను సెలక్షన్‌కు అందుబాటులో ఉండలేనని ప్రకటించాడు. అయితే, ఫామ్‌లో లేని నిన్ను ఎందుకు సెలక్ట్‌ చేస్తారులే అంటూ హార్దిక్‌ను విపరీతంగా ట్రోల్‌ చేశారు. ఇదిలా ఉంటే.. ఐపీఎల్‌-2022 మెగా వేలానికి ముందు ముంబై ఇండియన్స్‌ హార్దిక్‌ పాండ్యాను రిలీజ్‌ చేయడం చర్చనీయాంశమైంది.

ఆది నుంచి ముంబైతో ఉన్న హార్దిక్‌ను ముంబై వదిలేయగా.. కొత్త ఫ్రాంఛైజీ గుజరాత్‌ అతడిని దక్కించుకుని కెప్టెన్‌గా నియమించింది. కానీ, ఫిట్‌నెస్‌ సమస్యలతో అతడు తుదిజట్టులో ఉంటాడో లేదోనన్న అనుమానాల నడుమ జట్టులోకి వచ్చిన హార్దిక్‌.. ఏకంగా గుజరాత్‌ను టైటిల్‌ విజేతగా నిలపడం విశేషం. తద్వారా గోడకు కొట్టిన బంతిలా తిరిగి వచ్చిన ఈ ఆల్‌రౌండర్‌ విమర్శకుల నోళ్లు మూయించాడు. అందరి చేత ప్రశంసలు అందుకుంటున్నాడు.

అంతేకాదు స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరుగనున్న టీ20 సిరీస్‌ నేపథ్యంలో టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు. ఈ నేపథ్యంలో హార్దిక్‌ పాండ్యా తన సంతోషాన్ని పంచుకున్నాడు. ఫ్రాంఛైజీ కోసం తాను ఎంతగా కష్టపడ్డానో.. దేశం కోసం అంతకంటే ఎక్కువగానే కష్టపడతానంటూ ఉద్వేగపూరితంగా మాట్లాడాడు. అలాగే తనను ఎవరూ భారత జట్టు నుంచి తప్పించలేదని, తనకు తానుగా విశ్రాంతి కోరానని చెప్పుకొచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియోను గుజరాత్‌ టైటాన్స్‌ ట్విటర్‌లో షేర్‌ చేసింది. అభిమానులను ఆకట్టుకుంటున్న ఈ వీడియో వైరల్‌ అవుతోంది.

చదవండి: IPL 2022: ఒక్క మ్యాచ్‌ ఆడలేదు.. అయినా కోటికి పైగా వెనకేశారు! టైటిల్స్‌ కూడా!
IPL: మా వాళ్లంతా సూపర్‌.. ఏదో ఒకరోజు నేనూ ఐపీఎల్‌లో ఆడతా: ప్రొటిస్‌ కెప్టెన్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement