IPL 2022: Rajasthan Royals Vs Royal Challengers Bangalore Qualifier 2 Match Today - Sakshi
Sakshi News home page

IPL 2022 RR Vs RCB: ఐపీఎల్‌ క్వాలిఫయర్‌–2: రాజస్తాన్‌ వర్సెస్‌ ఆర్సీబీ

Published Fri, May 27 2022 5:59 AM | Last Updated on Fri, May 27 2022 11:36 AM

IPL 2022: Rajasthan Royals vs Royal Challengers Bangalore Qualifier 2 Match Today - Sakshi

అహ్మదాబాద్‌: ఐపీఎల్‌–2022 విజేతను తేల్చే తుది పోరుకు ముందు మరో సమరం...ఆదివారం జరిగే ఫైనకు అర్హత సాధించేదెవరో తేల్చే క్రమంలో  కీలక పోరుకు రంగం సిద్ధమైంది. నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే క్వాలిఫయర్‌–2లో రాజస్తాన్‌ రాయల్స్‌తో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు తలపడనుంది.

గతంలో మూడు సార్లు ఐపీఎల్‌ ఫైనల్‌కు చేరినా...ఒక్క సారి కూడా విజేతగా నిలవని బెంగళూరు మరో ఫైనల్‌ చేరడమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. మరో వైపు లీగ్‌ తొలి సీజన్‌లో చాంపియన్‌గా నిలిచిన తర్వాత రాజస్తాన్‌ ఇంకెప్పుడూ తుది పోరుకు అర్హత సాధించలేకపోయింది. ఈ సీజన్‌లో లీగ్‌ దశలో ఇరు జట్ల మధ్య రెండు మ్యాచ్‌లు జరగగా...ఇరు జట్లు చెరో మ్యాచ్‌లో నెగ్గి సమ ఉజ్జీలుగా నిలిచాయి. 

ఇక క్వాలిఫైయర్‌-2లో గెలిచిన జట్టు ఫైనల్లో గుజరాత​ టైటాన్స్‌తో తలపడనుంది. ఇక రాజస్తాన్‌ మొదటి సీజన్‌ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే, బెంగళూరుకు మాత్రం ఐపీఎల్‌ టైటిల్‌ ఇంకా అందని ద్రాక్షగానే ఉంది. దీంతో ఇరు జట్లు విజయం కోసం ఉవ్విళ్లూరుతున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం నాటి పోరు మరింత రసవత్తరంగా సాగనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement