qualifier 2
-
IPL 2024: ‘ఫైనల్’ వేటలో...
ఓవరాల్‌గా ఆరుసార్లు 200కుపైగా స్కోర్లు... వీటిలో గత ఏడాది వరకు ఉన్న అత్యుత్తమ స్కోరును అధిగమిస్తూ మూడుసార్లు 250కు పైగా పరుగులు... పవర్‌ప్లేలో ఏ జట్టుకూ సాధ్యం కాని విధంగా రెండుసార్లు 100కు పైగా స్కోర్లు... ముగ్గురు ప్రధాన బ్యాటర్లు కలిపి ఏకంగా 106 సిక్సర్లు... ఈ సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ మెరుపు బ్యాటింగ్ ప్రదర్శన ఇది. ఈ జోరులో ప్లే ఆఫ్స్‌కు దూసుకొచి్చన జట్టు తొలి క్వాలిఫయర్‌లో కాస్త తడబడింది. అయితే ఆరేళ్ల తర్వాత మళ్లీ ఫైనల్ చేరేందుకు ఆ జట్టుకు మరో అవకాశం లభించగా, రాజస్తాన్ రాయల్స్ రూపంలో ఎదురుగా ప్రత్యర్థి ఉంది. నాణ్యమైన బౌలింగ్‌తో రాజస్తాన్ ఎలాంటి ప్రత్యర్థినైనా నిలువరించగలుగుతోంది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల మధ్య రెండో క్వాలిఫయర్ మ్యాచ్ ఆసక్తి రేపుతోంది.చెన్నై: ఐపీఎల్–17 సీజన్ తుది పోరులో కోల్‌కతా నైట్‌రైడర్స్ ప్రత్యరి్థని నిర్ణయించే క్వాలిఫయర్–2 సమరానికి రంగం సిద్ధమైంది. పాయింట్ల పట్టికలో రెండు, మూడు స్థానాల్లో నిలిచిన హైదరాబాద్, రాజస్తాన్ జట్ల మధ్య చెపాక్ మైదానంలో ఈ పోరు జరగనుంది. ఈ సీజన్లో ఇరు జట్ల తలపడిన ఏకైక మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఒక పరుగు తేడాతో నెగ్గింది. టోర్నీలో దూకుడైన బ్యాటింగ్‌తో హైదరాబాద్ శాసించగా... రాజస్తాన్ విజయాల్లో బౌలింగ్ కీలకంగా నిలిచింది. ఇరు జట్లు తాజా సీజన్లో చెన్నై వేదికగా ఒక్కో మ్యాచ్ ఆడాయి. హైదరాబాద్ 134, రాజస్తాన్ 141 పరుగులు మాత్రమే చేసి చెన్నై చేతిలో ఓటమి పాలవడం విశేషం. మార్క్రమ్ను ఆడిస్తారా! కోల్‌కతాతో తొలి క్వాలిఫయర్‌లో హైదరాబాద్ బ్యాటింగ్ పూర్తిగా విఫలమైంది. హెడ్ వరుసగా రెండోసారి డకౌట్ కాగా, అభిõÙక్ శర్మ కూడా విఫలం కావడం జట్టుపై ప్రభావం చూపింది. క్లాసెన్ మాత్రం తన ఫామ్ కొనసాగించాడు. ఓపెనర్లు లీగ్ మ్యాచ్ తరహాలో తమ జోరును అందిపుచ్చుకుంటే జట్టు మరోసారి భారీ స్కోరుకు అవకాశం ఉంటుంది. ఇతర బ్యాటర్లు రాహుల్ త్రిపాఠి, నితీశ్ కుమార్ రెడ్డి, అబ్దుల్ సమద్ కూడా సహకరించాల్సి ఉంది. అయితే బ్యాటింగ్‌ను పటిష్టం చేసేందుకు నాలుగో విదేశీ ఆటగాడిగా మార్క్రమ్ లేదా గ్లెన్ ఫిలిప్స్‌లలో ఒకరిని రైజర్స్ ఆడించవచ్చు. పెద్దగా ప్రభావం చూపలేని విజయకాంత్ స్థానంలో లెగ్ స్పిన్నర్ మయాంక్ మార్కండేను తీసుకొని ‘ఇంపాక్ట్’ ద్వారా మరో బ్యాటర్‌ను ఆడించే అవకాశం ఉంది. చెపాక్ పిచ్‌పై షహబాజ్‌తో పాటు మరో స్పిన్నర్ జట్టుకు అవసరం. పేస్ బౌలింగ్‌లో భువనేశ్వర్, కమిన్స్‌లతో పాటు సొంత మైదానంలో ఆడుతున్న నటరాజన్ కీలకం అవుతారు. మార్పుల్లేకుండా... రాజస్తాన్ మాత్రం బుధవారం ఆర్సీబీని ఓడించిన టీమ్‌లో ఎలాంటి మార్పులు చేయకపోవచ్చు. స్పిన్‌కు అనుకూలిస్తే ఒక పేసర్‌ను తప్పించి కేశవ్‌ను ఆడించాలని భావించినా... జట్టు విదేశీ కూర్పుపై ప్రభావం పడవచ్చు. బౌల్ట్ కీలక బౌలర్ కాగా ఓపెనర్‌గా టామ్ కోలర్ ఖాయం. లోయర్ మిడిలార్డర్లో హెట్‌మైర్, పావెల్ల మెరుపు బ్యాటింగ్‌ను కోల్పోయి పరిస్థితి రాజస్తాన్ తెచ్చుకోదు. కాబట్టి ఇద్దరు అగ్రశ్రేణి స్పిన్నర్లు అశి్వన్, చహల్ జట్టు భారం మోస్తారు. ముఖ్యంగా ఓనమాలు నేర్చుకున్న మైదానంలో అశి్వన్ చెలరేగితే హైదరాబాద్‌కు కష్టాలు తప్పవు. రాయల్స్ బ్యాటింగ్‌లో కాస్త దూకుడు లోపించింది. ఎలిమినేటర్‌లో కూడా అది కనిపించింది కానీ లక్ష్యం చిన్నది కావడంతో దాని ప్రభావం కనపడలేదు. ముఖ్యంగా సామ్సన్ వరుసగా మూడు మ్యాచ్‌లలో విఫలమయ్యాడు. రియాన్ పరాగ్ మాత్రమే నిలకడగా ఆడుతుండగా, జురేల్ కూడా రాణించడం లేదు. తుది జట్ల వివరాలు (అంచనా) హైదరాబాద్: కమిన్స్ (కెప్టెన్), హెడ్, అభిషేక్, త్రిపాఠి, నితీశ్ రెడ్డి, క్లాసెన్, సమద్, షహబాజ్, భువనేశ్వర్, నటరాజన్, మార్కండే, మార్క్రమ్. రాజస్తాన్: సామ్సన్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, టామ్ కోలర్, పరాగ్, జురేల్, హెట్‌మైర్, పావెల్, అశ్విన్, బౌల్ట్, అవేశ్ ఖాన్, సందీప్ శర్మ, చహల్.పిచ్, వాతావరణం చెన్నైలో వేడి చాలా ఎక్కువగా ఉంది. అయితే సాయంత్రం మంచు ప్రభావం కూడా ఉండటంతో టాస్ గెలిచిన జట్టు ఫీల్డింగ్ ఎంచుకోవచ్చు. ఈ సీజన్లో జరిగిన 7 మ్యాచ్‌లలో 5 సార్లు తర్వాత బ్యాటింగ్ చేసిన జట్టే నెగ్గింది. 19: ఐపీఎల్లో ఇప్పటి వరకు సన్‌రైజర్స్, రాజస్తాన్ రాయల్స్ జట్లు ముఖాముఖిగా 19 సార్లు తలపడ్డాయి. 10 మ్యాచ్‌ల్లో హైదరాబాద్... 9 మ్యాచ్‌ల్లో రాజస్తాన్ గెలుపొందాయి. ఈ సీజన్లో ఈ రెండు జట్లు ఒకసారి పోటీపడగా సన్‌రైజర్స్ ఒక పరుగు తేడాతో నెగ్గింది. రాజస్తాన్‌పై సన్‌రైజర్స్ అత్యధిక స్కోరు 217, అత్యల్ప స్కోరు 127 కాగా... సన్‌రైజర్స్‌పై రాజస్తాన్ అత్యధిక స్కోరు 220, అత్యల్ప స్కోరు 102. -
SRH vs RR: ‘సన్‌రైజర్స్ కాదు!.. రాజస్తాన్‌కే గెలిచే ఛాన్స్’
ఐపీఎల్-2024 ఆరంభం నుంచి వరుస విజయాలు సాధించిన రాజస్తాన్ రాయల్స్.. ఆ తర్వాత చతికిల పడింది. వరుస ఓటములతో విమర్శలు మూటగట్టుకుంది. ప్లే ఆఫ్స్ చేరినప్పటికీ పాయింట్ల పట్టికలో మూడో స్థానానికే పరిమితమైంది.ఈ క్రమంలో అమీ తుమీ తేల్చుకోవాల్సిన ఎలిమినేటర్ మ్యాచ్‌లోనూ రాజస్తాన్ గెలిచే అవకాశాల్లేవంటూ విశ్లేషకులు పెదవి విరిచారు. స్టార్ ఓపెనర్ జోస్ బట్లర్ స్వదేశానికి వెళ్లిపోవడం.. యశస్వి జైస్వాల్ స్థాయికి తగ్గట్లు రాణించకపోవడం.. బౌలింగ్ విభాగంలోనూ లోపాలు అంటూ రాజస్తాన్‌ను విమర్శించారు.ఆర్సీబీని చిత్తుచేసి.. క్వాలిఫయర్-2లోఇక సునిల్ గావస్కర్ వంటి దిగ్గజాలు సైతం ఆర్సీబీ- రాజస్తాన్ వార్ వన్‌సైడ్ అంటూ బెంగళూరు జట్టుకు మద్దతు పలికారు. ఈ క్రమంలో రాజస్తాన్ ఆర్సీబీకి ఊహించని షాకిచ్చింది. అహ్మదాబాద్‌లో బుధవారం నాటి మ్యాచ్‌లో బెంగళూరును నాలుగు వికెట్ల తేడాతో ఓడించి క్వాలిఫయర్-2కు అర్హత సాధించింది.ఫైనల్ రేసులో నిలిచే క్రమంలో చెన్నై వేదికగా శుక్రవారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.రాజస్తాన్ రాయల్స్ ఫేవరెట్సన్రైజర్స్- రాజస్తాన్ మ్యాచ్ గురించి మాట్లాడుతూ.. ‘‘ఈ మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ ఫేవరెట్‌గా కనిపిస్తోంది. వాళ్లు ఇక్కడిదాకా చేరుకున్న తీరు అద్బుతం.చెన్నై పిచ్ పరిస్థితులు కూడా రాజస్తాన్ స్పిన్నర్లకు బాగా నప్పుతాయి. కాబట్టి ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ చేసేటపుడు ఆటగాళ్లు తమ మెదళ్లను బాగా ఉపయోగించాలి.అది హైదరాబాద్ వికెట్ కాదు. చెన్నైలో మీరు వికెట్లు తీయలేరు. అందుకే బ్యాటింగ్‌పై దృష్టి సారించాలి. నిజానికి చెన్నై పిచ్ మీద పరుగులు రాబట్టాలంటే కచ్చితంగా ఆచితూచి ఆడుతూ బ్యాట్స్‌మన్‌షిప్ చూపాలి’’ అని అంబటి రాయుడు స్టార్ స్పోర్ట్స్ షోలో తన అభిప్రాయాలు పంచుకున్నాడు.ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ ఫైర్అయితే, ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ రాయుడు వ్యాఖ్యలను జీర్ణించుకోలేకపోతున్నారు. సన్‌రైజర్స్ ఆటగాళ్లను తక్కువ చేసి మాట్లాడటం సరికాదని మండిపడుతున్నారు. రాజస్తాన్ మాదిరే సన్‌రైజర్స్ కూడా ఆది నుంచి దూకుడుగా ఆడుతూ ఇక్కడిదాకా వచ్చిందని పేర్కొంటున్నారు.హైదరాబాద్ జట్టులోనూ షాబాజ్ అహ్మద్, మయాంక్ మార్కండే, విజయకాంత్ వియస్కాంత్, వాషింగ్టన్ సుందర్ వంటి స్పిన్నర్లు ఉన్నారని గుర్తు చేస్తున్నారు. అనుభవం లేకపోయినా మొమెంటమ్ తీసుకురావడంలో వీళ్లు సఫలమవుతారంటూ అంబటి రాయుడుకి కౌంటర్లు వేస్తున్నారు. కాగా రాజస్తాన్ రాయల్స్ జట్టులో చెన్నై దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్‌తో పాటు యజువేంద్ర చహల్ రూపంలో ఇద్దరు మేటి స్పిన్నర్లు ఉన్న విషయం తెలిసిందే.చదవండి: Hardik Pandya: భార్యతో హార్దిక్ పాండ్యాకు విభేదాలు?.. అతడి వల్లే అంటూ నటాషా పోస్ట్ వైరల్ -
గిల్ ప్రపంచ క్రికెట్‌ను ఏలుతాడు.. నేను ఆధారపడేది రషీద్‌పైనే: హార్ధిక్ పాండ్యా
ఐపీఎల్-2023లో భాగంగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా నిన్న (మే 26) జరిగిన క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై గుజరాత్ టైటాన్స్ 62 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా గుజరాత్ వరుసగా రెండో సీజన్లో ఫైనల్లోకి అడుగుపెట్టి, టైటిల్ పోరులో సీఎస్కేతో అమీతుమీకి సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్.. శుభ్‌మన్ గిల్ విధ్వంసకర శతకంతో (60 బంతుల్లో 129; 7 ఫోర్లు, 10 సిక్సర్లు) విరుచుకుపడటంతో నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 233 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం ఛేదనలో తడబడిన ముంబై.. మోహిత్ శర్మ (5/10) ధాటికి 18.2 ఓవర్లలో 171 పరుగులకు ఆలౌటై ఓటమిపాలైంది. మ్యాచ్ అనంతరం జరిగిన ప్రెజెంటేషన్ సెర్మనీలో గుజరాత్ కెప్టెన్ హార్ధిక్ పాండ్యా మాట్లాడుతూ.. జట్టు సభ్యులపై, ప్రత్యేకించి శతక వీరుడు గిల్, తన తురుపు ముక్క రషీద్ ఖాన్‌లపై ప్రశంసల వర్షం కురిపించాడు. తమ విజయాల వెనుక ఆటగాళ్ల కఠోర శ్రమ దాగి ఉందని కొనియాడాడు. జట్టులోని సభ్యులందరూ అనునిత్యం సాధన చేస్తూనే ఉంటారని, దాని ఫలితమే తాము సాధిస్తున్న విజయాలని అన్నాడు. జట్టులో ప్రతి ఒక్కరూ బాధ్యత కలిగి ఉంటారని, కలిసికట్టుగా ఆడటమే తమ విజయ రహస్యమని తెలిపాడు. శుభ్‌మన్ గిల్ గురించి మాట్లాడుతూ.. అతని ఆత్మవిశ్వాసం, ఆటపై అతనికున్న స్పష్టత అత్యద్భుతమని ప్రశంసించాడు. నేటి ఇన్నింగ్స్ నేను చూసిన వాటిలో అత్యుత్తమమని కొనియాడాడు. గిల్ ఆడిన ఇన్నింగ్స్‌లో ఎక్కడా హడావుడి కనిపించలేదని అన్నాడు. ఎవరో బంతులు విసురుతుంటే, కొట్టినట్లు అనిపించిందని తెలిపాడు. గిల్ ఫ్రాంచైజీ క్రికెట్‌తో పాటు అంతర్జాతీయ క్రికెట్‌ను ఏలుతాడని జోస్యం చెప్పాడు. రషీద్ ఖాన్‌పై స్పందిస్తూ.. అతని గురించి ప్రత్యేకించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పటికే అతని గురించి చాలా అనుకున్నాం. అతను మా జట్టుకు తరుపు ముక్క. జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు నేను ఆధారపడగలిగే వ్యక్తి అతను. ఎన్నో సందర్భాల్లో ఇది నిరూపితమైంది. ముంబైపై గెలిచి ఫైనల్‌కు చేరుకోవడంపై స్పందిస్తూ.. ముంబై లాంటి కఠినమైన జట్టుపై గెలిచి ఫైనల్‌కు చేరుకోవడం గొప్ప అనుభూతి కలిగిస్తుంది. ఫైనల్లో తాము ఇంకా కఠినమైన ప్రత్యర్ధిని ఎదుర్కోవాల్సి ఉంది. వంద శాతం ఎఫర్ట్ పెడితే కానీ సీఎస్కేను ఓడించలేము. మంచి క్రికెట్ ఆడాలని ఆశిస్తున్నాము. నాకౌట్ మ్యాచ్‌లు ఏ విధంగా అయినా టర్న్ అవ్వచ్చు. ఏదిఏమైనా ఫైనల్ మ్యాచ్ కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాం. చదవండి: శుభ్‌మన్ గిల్‌కు ఆరెంజ్ క్యాప్.. అయితే గుజరాత్ టైటిల్ గెలవడం కష్టం..! -
శుబ్‌మన్ సూపర్ సెంచరీ.. ఫైనల్లో గుజరాత్ టైటాన్స్
మే 7న లీగ్ దశలో లక్నోతో జరిగిన మ్యాచ్‌లో శుబ్‌మన్ గిల్ 94 పరుగులతో అజేయంగా నిలిచాడు. సెంచరీ కోల్పోవడంపై స్పందిస్తూ... ఇంకా కొన్ని మ్యాచ్‌లు ఉన్నాయి కదా, శతకం సాధిస్తాను అంటూ చెప్పాడు. అతని ఆత్మవిశ్వాసం ఎలాంటిదంటే ఒక సెంచరీ కాదు, తర్వాతి ఐదు మ్యాచ్‌ల్లో ఏకంగా మూడు సెంచరీలు సాధించేశాడు! శుక్రవారం మ్యాచ్‌లో అతని సత్తా ఏమిటో మళ్లీ కనిపించింది. అసలైన ‘సెమీస్’ సమరంలో అతను అద్భుత ఆటతో ఐదుసార్లు చాంపియన్ ముంబైను పుట్టి ముంచాడు. గిల్ శతకంతో భారీ స్కోరు సాధించిన గుజరాత్ ఆపై పదునైన బౌలింగ్‌తో రోహిత్ సేనను కట్టి పడేసింది. హోరాహోరీ అనుకున్న సమరం ఏకపక్షంగా మారిపోగా, డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ వరుసగా రెండో ఏడాది ఫైనల్‌కు సిద్ధమైంది. రేపు చెన్నై సూపర్ కింగ్స్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. అహ్మదాబాద్: హార్దిక్ పాండ్యా నాయకత్వంలో గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్ టోర్నీలో వరుసగా రెండోసారి ఫైనల్ చేరింది. శుక్రవారం జరిగిన క్వాలిఫయర్–2లో గుజరాత్ 62 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్‌ను చిత్తు చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 233 పరుగులు సాధించింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ శుబ్‌మన్ గిల్ (60 బంతుల్లో 129; 7 ఫోర్లు, 10 సిక్స్‌లు) శతకంతో కదం తొక్కాడు. గిల్, సాయి సుదర్శన్ (31 బంతుల్లో 43; 5 ఫోర్లు, 1 సిక్స్) రెండో వికెట్‌కు 64 బంతుల్లోనే 138 పరుగులు జోడించారు. అనంతరం ముంబై 18.2 ఓవర్లలో 171 పరుగులకు ఆలౌటైంది. సూర్యకుమార్ (38 బంతుల్లో 61; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) టాప్ స్కోరర్‌గా నిలవగా, తిలక్ వర్మ (14 బంతుల్లో 43; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించాడు. గుజరాత్ బౌలర్ మోహిత్ శర్మ 14 బంతుల్లో కేవలం 10 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. అంతా గిల్మయం... ఓపెనర్ సాహా (18) తొందరగానే అవుటయ్యాక గిల్ జోరు మొదలైంది. జోర్డాన్ ఓవర్లో వరుసగా 6, 4 కొట్టిన తర్వాత అదే ఓవర్లో గిల్ ఇచ్చి న కష్టసాధ్యమైన క్యాచ్‌ను (వ్యక్తిగత స్కోరు 30 వద్ద) డేవిడ్ వదిలేయడం కూడా కలిసొచ్చింది. 32 బంతుల్లో అతని అర్ధ సెంచరీ పూర్తయింది. మరోవైపు సుదర్శన్ కూడా తన వంతుగా సహకారం అందించాడు. హాఫ్ సెంచరీ తర్వాత గిల్ మరింత చెలరేగిపోయాడు. 50 నుంచి 100కు చేరేందుకు అతనికి 17 బంతులు మాత్రమే సరిపోయాయి. ఇందులో 6 భారీ సిక్సర్లు ఉండటం విశేషం. ఆకాశ్ మధ్వాల్ వేసిన ఓవర్లోనే 3 సిక్సర్లు బాదిన అతను చావ్లా ఓవర్లో మరో రెండు సిక్స్‌లు కొట్టాడు. 49 బంతుల్లో సెంచరీ సాధించిన అనంతరం గ్రీన్ ఓవర్లో గిల్ వరుసగా 6, 4, 6తో తన ధాటిని కొనసాగించా డు. మరో షాట్‌కు ప్రయత్నించి డేవిడ్‌కే క్యాచ్ ఇవ్వ డంతో ఎట్టకేలకు ఆ అద్భుత ఇన్నింగ్స్ ముగిసింది. చివర్లో వేగంగా ఆడటంలో విఫలమైన సుదర్శన్ ‘రిటైర్డ్ అవుట్’తో తప్పుకోగా, హార్దిక్ (13 బంతుల్లో 28 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరుపు షాట్లతో గుజరాత్ భారీ స్కోరుతో ముగించింది. తిలక్ మెరుపులు... గుజరాత్ ఇన్నింగ్స్ సమయంలో మైదానంలో కలిసి నడుస్తుండగా జోర్డాన్ మోచేయి అనుకోకుండా ఇషాన్ కంటికి తగిలింది. దాంతో ‘కన్కషన్’కు గురైన అతను ఆడలేని స్థితిలో ఉండగా, ఓపెనర్‌గా వచ్చి న నేహల్ వధేరా (4) తొలి ఓవర్లోనే వెనుదిరిగాడు. షమీ తర్వాతి ఓవర్లోనే రోహిత్ శర్మ (8) కూడా అవుట్ కావడంతో ముంబై కష్టాలు పెరిగాయి. ఈ దశలో తిలక్ జోరుతో ముంబై కోలుకుంది. తన తొలి 4 బంతుల్లోనే 2 సిక్స్‌లు కొట్టిన తిలక్... షమీని ఓ ఆటాడుకున్నాడు. అతని ఓవర్లో వరుసగా 4, 4, 4, 4, 2, 6 కొట్టడంతో 24 పరుగులు వచ్చాయి. అయితే రషీద్ చక్కటి బంతితో తిలక్‌ను బౌల్డ్ చేయగా, గ్రీన్ (20 బంతుల్లో 30; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) కూడా ఎక్కువసేపు నిలవలేకపోయాడు. అయినా సూర్య క్రీజ్‌లో ఉండటంతో జట్టు ఆశలు మిగిలే ఉన్నాయి. కొన్ని చూడచక్కటి షాట్లు ఆడిన అతను 33 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కానీ మోహిత్ ఓవర్లో మరో మెరుపు షాట్‌కు ప్రయత్నించి సూర్య బౌల్డ్ కావడంతో గెలుపు దారులు మూసుకుపోయాయి. స్కోరు వివరాలు గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్: సాహా (స్టంప్డ్) ఇషాన్ (బి) చావ్లా 18; గిల్ (సి) డేవిడ్ (బి) ఆకాశ్ 129; సుదర్శన్ (రిటైర్డ్ అవుట్) 43; పాండ్యా (నాటౌట్) 28; రషీద్ (నాటౌట్) 5; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 3 వికెట్లకు) 233. వికెట్ల పతనం: 1–54, 2–192, 3–214. బౌలింగ్: బెహ్రన్‌డార్ఫ్ 4–0–28–0, గ్రీన్ 3–0–35–0, ఆకాశ్ మధ్వాల్ 4–0–52–1, జోర్డాన్ 4–0–56–0, చావ్లా 3–0–45–1, కార్తికేయ 2–0–15–0. ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) లిటిల్ (బి) షమీ 8; వధేరా (సి) సాహా (బి) షమీ 4; గ్రీన్ (బి) లిటిల్ 30; సూర్యకుమార్ (బి) మోహిత్ 61; తిలక్ వర్మ (బి) రషీద్ 43; విష్ణు (సి) పాండ్యా (బి) మోహిత్ 5; డేవిడ్ (ఎల్బీ) (బి) రషీద్ 2; జోర్డాన్ (సి) సుదర్శన్ (బి) మోహిత్ 2; చావ్లా (సి) మిల్లర్ (బి) మోహిత్ 0; కార్తికేయ (సి) మిల్లర్ (బి) మోహిత్ 6; బెహ్రన్‌డార్ఫ్ (నాటౌట్) 3; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (18.2 ఓవర్లలో ఆలౌట్) 171. వికెట్ల పతనం: 1–5, 2–21, 3–72, 4–124, 5–155, 6–156, 7–158, 8–161, 9–162, 10– 171. బౌలింగ్: షమీ 3–0–41–2, పాండ్యా 2–0– 24–0, రషీద్ 4–0–33–2, నూర్ 4–0–35–0, లిటిల్ 3–0–26–1, మోహిత్ 2.2–0–10–5. -
చెన్నైని ‘ఢీ’కొట్టేదెవరు?
అహ్మదాబాద్: ఐపీఎల్లో ఇది సెమీస్ కానీ సెమీస్‌లాంటి మ్యాచ్. డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్‌కు ఇంకో చాన్సుండదు. ముంబై వరుసగా మరోమ్యాచ్ గెలుపొందక తప్పదు. ఈ నేపథ్యంలో ఐపీఎల్లో మేటి జట్ల మధ్య శుక్రవారం రెండో క్వాలిఫయర్ లో ఆసక్తికర పోరు జరుగనుంది. ఈ టోర్నీలో ఎవరి గడ్డపై వారు గర్జించారు. ఇప్పుడు గుజరాత్ గడ్డపై జరిగే మ్యాచ్ కావడంతో తప్పకుండా టైటాన్స్‌కు అనుకూలతలు ఉంటాయి. అయితే ఐదుసార్లు చాంపియన్ అయిన ముంబైకి ఇదేమంత ప్రతికూలం కానేకాదు. పైగా ‘ఇంపాక్ట్ ప్లేయర్’ రాకతో అంతా మారింది. ఏదైనా సాధ్యమే... ఏకపక్షం మాత్రం కానేకాదు! ఇంకా చెప్పాలంటే ఈ సీజన్లో రెండు జట్లూ చేజింగ్‌లో సత్తా చాటుకొని ఆరేసి మ్యాచ్‌ల్లో నెగ్గాయి. గుజరాత్ గర్జించాల్సిందే లీగ్ దశ పాయింట్ల పట్టికలో ‘టాప్’ లేపిన గుజరాత్ టైటాన్స్ చివరకు తొలి క్వాలిఫయర్‌లో నాలుగుసార్లు చాంపియన్ అయిన చెన్నై ధాటికి బోల్తా పడింది. ఇప్పుడు ఏకంగా ఐదుసార్లు విజేత ముంబై ఇండియన్స్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధమైంది. ఓపెనింగ్‌లో సాహా నిరుత్సాహపరుస్తున్నా... స్టార్ ఓపెనర్ గిల్ తన మెరుపు ఇన్నింగ్స్‌లతో చెలరేగుతున్నాడు. బెంగళూరుతో ఆఖరి లీగ్‌లో ‘ఇంపాక్ట్’ చూపిన విజయ్ శంకర్ గత మ్యాచ్‌లో తేలిపోయాడు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా పేలవ ఫామ్‌కు ముగింపు పలికి ఈ మ్యాచ్‌లో పరుగుల ధమాకా సృష్టిస్తే జట్టు విజయానికి ఢోకా ఉండదు. ఎందుకంటే మిగతా పని కానిచ్చేందుకు మిల్లర్, తెవాటియా, రషీద్ ఖాన్ ఉండనే ఉన్నారు. ఆఖరి దశలో ముంబైకి ఎదురుందా? గత కొన్ని సీజన్లను పరిశీలిస్తే ముంబై ఇండియన్స్ ఆఖరి దశలో శివాలెత్తుతోంది. తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో 200 పైచిలుకు పరుగుల లక్ష్యాన్ని 18 ఓవర్లలోనే ఛేదించింది. ఎలిమినేటర్‌లో లక్నోను చిత్తు చేసింది. పటిష్టమైన బ్యాటింగ్, వైవిధ్యమైన బౌలింగ్ కలగలిపిన రోహిత్ సేనను ఢీకొట్టడం అంత సులభం కాదు. గ్రీన్, సూర్యకుమార్, టిమ్ డేవిడ్ అసాధారణ స్థాయిలో హిట్టింగ్ చేయగలరు. ఓపెనింగ్‌లో ఇషాన్–రోహిత్ శర్మ ‘పవర్‌ప్లే’ మెరుపులు మెరిపిస్తే మిగతా ‘రన్స్’రంగాన్ని మిడిలార్డర్ చూసుకుంటుంది. బౌలింగ్ సంచలనం ఆకాశ్ మధ్వాల్ ఇప్పుడు ముంబై అదనపు బలమైంది. ఇతనితో పాటు జోర్డాన్, బెహ్రెన్‌డార్‌్ఫ, పీయూశ్ చావ్లాలు ప్రత్యర్తి బ్యాటర్ల పనిపడతారు. పిచ్, వాతావరణం అహ్మదాబాద్‌లో ఊష్ణోగ్రత 43 డిగ్రీలకు చేరడంతో పిచ్‌పై పగుళ్లు రాకుండా కవర్లు పరిచారు. పేస్, బౌన్స్‌కు అనుకూలమని పిచ్ క్యూరేటర్ అన్నారు. నిలదొక్కుకుంటే బ్యాటర్లకు కలిసొచ్చే పిచ్ ఇది. వర్ష సూచన లేదు. తుది జట్లు (అంచనా) ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, గ్రీన్, సూర్యకుమార్, తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, నేహల్ వధేరా, జోర్డాన్, హృతిక్ షోకిన్, పీయూశ్ చావ్లా, బెహ్రెన్‌డార్ఫ్, ఆకాశ్ మధ్వాల్. గుజరాత్ టైటాన్స్: హార్దిక్ పాండ్యా (కెప్టెన్), సాహా, శుబ్‌మన్ గిల్, షనక, మిల్లర్, విజయ్ శంకర్/మోహిత్ శర్మ, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, షనక, నూర్ అహ్మద్, షమీ. 3 ఐపీఎల్ టోర్నీలో ముంబై, గుజరాత్ మధ్య మూడు మ్యాచ్‌లు జరిగాయి. రెండింటిలో గుజరాత్, ఒక మ్యాచ్‌లో ముంబై గెలిచాయి. 6 ఐపీఎల్లో ముంబై ఆరుసార్లు ఫైనల్ చేరి ఐదుసార్లు విజేతగా నిలిచి, ఒకసారి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. గతేడాది ఫైనల్ చేరిన తొలిసారే గుజరాత్ చాంపియన్‌గా నిలిచింది. -
Ultimate Kho Kho: క్వాలిఫయర్–2కు తెలుగు యోధాస్
పుణే: అల్టిమేట్ ఖో–ఖో లీగ్‌లో తెలుగు యోధాస్ జట్టు క్వాలిఫయర్–2 మ్యాచ్‌కు అర్హత పొందింది. చెన్నై క్విక్గన్స్తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో తెలుగు యోధాస్ 61–43తో గెలిచింది. తెలుగు యోధాస్ కెప్టెన్ ప్రతీక్, ఆదర్శ్ రాణించారు. పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన ఒడిశా జగర్‌నాట్స్, గుజరాత్ జెయింట్స్ క్వాలిఫయర్–1లో తలపడగా ... ఒడిశా జగర్‌నాట్స్ 57–43తో నెగ్గి ఫైనల్ చేరింది. నేడు జరిగే క్వాలిఫయర్–2లో గుజరాత్‌తో తెలుగు యోధాస్ తలపడుతుంది. ఈ మ్యాచ్‌లో నెగ్గిన జట్టు ఆదివారం జరిగే ఫైనల్లో ఒడిశాతో ఆడుతుంది. -
IPL 2022 Qualifier 2: రాజస్తాన్ రైట్ రైట్...
ఐపీఎల్ మొదటి సీజన్–2008లో విజేతగా నిలిచిన తర్వాత పడుతూ, లేస్తూ ప్రస్థానం సాగించి... మధ్యలో రెండేళ్లు నిషేధానికి కూడా గురైన రాజస్తాన్ రాయల్స్ 14 ఏళ్ల తర్వాత మళ్లీ తుది పోరుకు అర్హత సాధించింది. గత మూడు సీజన్లుగా చివరి రెండు స్థానాల్లోనే నిలుస్తూ వచ్చిన ఈ టీమ్ ఈసారి స్ఫూర్తిదాయక ప్రదర్శనతో లీగ్ దశలో రెండో స్థానంలో నిలిచింది. తొలి క్వాలిఫయర్‌లో ఓడినా... తమ తప్పులు దిద్దుకొని రెండో క్వాలిఫయర్‌లో సత్తా చాటింది. ప్రసిధ్, మెక్కాయ్ కట్టుదిట్టమైన బౌలింగ్‌తో బెంగళూరును సాధారణ స్కోరుకే పరిమితం చేసిన రాజస్తాన్ ఆ తర్వాత బట్లర్ మెరుపు సెంచరీతో సునాయాసంగా విజయాన్ని అందుకుంది. మరోవైపు కొంత అదృష్టం కూడా కలి సొచ్చి ఇక్కడి వరకు వచ్చిన ఆర్సీబీ నాకౌట్ మ్యాచ్‌లో ఓడి నిష్క్రమించింది. టైటిల్ లేకుండానే ఆ జట్టు 15వ సీజన్‌నూ నిరాశగా ముగించింది. అహ్మదాబాద్: ఐపీఎల్–2022 ఫైనల్లో టాప్–2 జట్ల మధ్య పోరుకు రంగం సిద్ధమైంది. రెండు ‘రాయల్స్’ జట్ల మధ్య జరిగిన పోరులో చివరకు రాజస్తాన్‌దే పైచేయి అయింది. శుక్రవారం జరిగిన క్వాలిఫయర్–2లో రాజస్తాన్ 7 వికెట్ల తేడాతో బెంగళూరుపై ఘన విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బెంగళూ రు 20 ఓవర్లలో 8 వికెట్లకు 157 పరుగులు చేసింది. రజత్ పటిదార్ (42 బంతుల్లో 58; 4 ఫోర్లు, 3 సిక్స్ లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం రాజస్తాన్ 18.1 ఓవర్లలో 3 వికెట్లకు 161 పరుగులు సాధించి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ బట్లర్ (60 బంతుల్లో 106 నాటౌ ట్; 10 ఫోర్లు, 6 సిక్స్ లు) సీజన్లో నాలుగో సెంచరీతో చెలరేగాడు. రేపు ఇదే మైదానంలో జరిగే ఫైనల్లో గుజరాత్ టైటాన్స్‌తో రాజస్తాన్ తలపడుతుంది. పటిదార్ మినహా... కోహ్లి (7) మరోసారి నిరాశపరుస్తూ తొందరగా అవుట్ కావడంతో ఆర్సీబీకి సరైన ఆరంభం లభించలేదు. గత మ్యాచ్ హీరో పటిదార్ కొన్ని చక్కటి షాట్లతో దూకుడు ప్రదర్శించగా, కెప్టెన్ డుప్లెసిస్ (27 బంతుల్లో 25; 3 ఫోర్లు) అతనికి సహకరించాడు. 13 పరుగుల వద్ద పరాగ్ సునాయాస క్యాచ్ వదిలేయడంతో బతికిపోయిన పటిదార్ ఆ తర్వాత మరింత ధాటిగా ఆడాడు. పటిదార్‌తో రెండో వికెట్‌కు 70 పరుగులు (53 బంతుల్లో) జోడించిన అనంతరం డుప్లెసిస్ అవుట్ కాగా, మ్యాక్స్‌వెల్ (13 బంతుల్లో 24; 1 ఫోర్, 2 సిక్స్‌లు) జోరును ప్రదర్శించాడు. చహల్ బౌలింగ్‌లో సిక్స్‌తో 40 బంతుల్లో పటిదార్ అర్ధ సెంచరీ పూర్తయింది. అయితే తక్కువ వ్యవధిలో వీరిద్దరిని అవుట్ చేసిన రాజస్తాన్ పట్టు బిగించింది. మెరుపు బ్యాటింగ్‌తో... ఛేదనలో రాజస్తాన్‌కు ఏ దశలోనూ ఇబ్బంది ఎదురు కాలేదు. సిరాజ్ వేసిన తొలి ఓవర్లో యశస్వి జైస్వాల్ (13 బంతుల్లో 21; 1 ఫోర్, 2 సిక్స్‌లు) 16 పరుగులు రాబట్టడంతో రాయల్స్ జోరుగా ఇన్నింగ్స్‌ను మొదలు పెట్టింది. సిరాజ్ తర్వాతి ఓవర్లో వరుస బంతుల్లో 4, 4, 6 కొట్టిన బట్లర్, షహబాజ్ ఓవర్లోనూ 2 సిక్స్‌లు, ఒక ఫోర్‌తో చెలరేగాడు. తొలి వికెట్‌కు 31 బంతుల్లోనే 61 పరుగులు వచ్చాక యశస్వి వెనుదిరిగాడు. తర్వాత వచ్చిన సామ్సన్ (21 బంతుల్లో 23; 1 ఫోర్, 2 సిక్స్‌లు) కూడా కీలక పరుగులు సాధించాడు. బట్లర్ మాత్రం ఎక్కడా తగ్గకుండా దూకుడును కొనసాగించడంతో రాజస్తాన్ పని మరింత సులువైంది. 66 పరుగుల వద్ద బట్లర్ ఇచ్చిన సునాయాస క్యాచ్‌ను దినేశ్ కార్తీక్ వదిలేయడం కూడా బెంగళూరు ఆశలను ముగించింది. స్కోరు వివరాలు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: కోహ్లి (సి) సామ్సన్ (బి) ప్రసిధ్ 7; డుప్లెసిస్ (సి) అశ్విన్ (బి) మెక్కాయ్ 25; పటిదార్ (సి) బట్లర్ (బి) అశ్విన్ 58; మ్యాక్స్‌వెల్ (సి) మెక్కాయ్ (బి) బౌల్ట్ 24; లోమ్రోర్ (సి) అశ్విన్ (బి) మెక్కాయ్ 8; కార్తీక్ (సి) పరాగ్ (బి) ప్రసిధ్ 6; షహబాజ్ (నాటౌట్) 12; హసరంగ (బి) ప్రసిధ్ 0; హర్షల్ (బి) మెక్కాయ్ 1; హాజల్‌వుడ్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 157. వికెట్ల పతనం: 1–9, 2–79, 3–111, 4–130, 5–141, 6–146, 7–146, 8–154. బౌలింగ్: బౌల్ట్ 4–0–28–1, ప్రసిధ్ కృష్ణ 4–0–22–3, మెక్కాయ్ 4–0–23–3, అశ్విన్ 4–0–31–1, చహల్ 4–0–45–0. రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: యశస్వి (సి) కోహ్లి (బి) హాజల్‌వుడ్ 21; బట్లర్ (నాటౌట్) 106; సామ్సన్ (స్టంప్డ్) కార్తీక్ (బి) హసరంగ 23; పడిక్కల్ (సి) కార్తీక్ (బి) హాజల్‌వుడ్ 9; హెట్‌మైర్ (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 0; మొత్తం (18.1 ఓవర్లలో 3 వికెట్లకు) 161. వికెట్ల పతనం: 1–61, 2–113, 3–148. బౌలింగ్: సిరాజ్ 2–0–31–0, హాజల్‌వుడ్ 4–0–23–2, మ్యాక్స్‌వెల్ 3–0–17–0, షహబాజ్ అహ్మద్ 2–0–35–0, హర్షల్ పటేల్ 3.1–0–29–0, హసరంగ 4–0–26–1. -
IPL 2022: క్వాలిఫయర్–2: రాజస్తాన్ వర్సెస్ ఆర్సీబీ
అహ్మదాబాద్: ఐపీఎల్–2022 విజేతను తేల్చే తుది పోరుకు ముందు మరో సమరం...ఆదివారం జరిగే ఫైనకు అర్హత సాధించేదెవరో తేల్చే క్రమంలో కీలక పోరుకు రంగం సిద్ధమైంది. నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే క్వాలిఫయర్–2లో రాజస్తాన్ రాయల్స్‌తో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలపడనుంది. గతంలో మూడు సార్లు ఐపీఎల్ ఫైనల్‌కు చేరినా...ఒక్క సారి కూడా విజేతగా నిలవని బెంగళూరు మరో ఫైనల్ చేరడమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. మరో వైపు లీగ్ తొలి సీజన్లో చాంపియన్‌గా నిలిచిన తర్వాత రాజస్తాన్ ఇంకెప్పుడూ తుది పోరుకు అర్హత సాధించలేకపోయింది. ఈ సీజన్లో లీగ్ దశలో ఇరు జట్ల మధ్య రెండు మ్యాచ్‌లు జరగగా...ఇరు జట్లు చెరో మ్యాచ్‌లో నెగ్గి సమ ఉజ్జీలుగా నిలిచాయి. ఇక క్వాలిఫైయర్-2లో గెలిచిన జట్టు ఫైనల్లో గుజరాత టైటాన్స్‌తో తలపడనుంది. ఇక రాజస్తాన్ మొదటి సీజన్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే, బెంగళూరుకు మాత్రం ఐపీఎల్ టైటిల్ ఇంకా అందని ద్రాక్షగానే ఉంది. దీంతో ఇరు జట్లు విజయం కోసం ఉవ్విళ్లూరుతున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం నాటి పోరు మరింత రసవత్తరంగా సాగనుంది. When in Amdavad, we got to vlog. 😌 PS: @ninety9sl has a special message for you at the end. 💗#RoyalsFamily | #HallaBol | #TATAIPL2022 pic.twitter.com/5elFbzZofu — Rajasthan Royals (@rajasthanroyals) May 26, 2022 The action shifts to Ahmedabad as we take on RR & the winner books a ticket to the final against GT. Here is everything you need to know about #Qualifier2 #RRvRCB on @KreditBee presents 12th Man TV.#PlayBold #WeAreChallengers #IPL2022 #Mission2022 #RCB #ನಮ್ಮRCB #PlayOffs pic.twitter.com/BrmSLaiClv — Royal Challengers Bangalore (@RCBTweets) May 26, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4381453179.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
సన్‌రైజర్స్‌కు షాక్.. ఫైనల్లో ఢిల్లీ
ఢిల్లీ నిరీక్షణ ఫలించింది. ఐపీఎల్ చరిత్రలో ఎట్టకేలకు ఆ జట్టు తొలిసారి ఫైనల్లోకి ప్రవేశించింది. తొలి క్వాలిఫయర్ మ్యాచ్‌లో ఎక్కడ విఫలమైందో తెలుసుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ రెండో క్వాలిఫయర్‌లో వాటిని అధిగమించింది. ఆఖరి అవకాశాన్ని అద్భుతంగా అందిపుచ్చుకుంది. ధావన్ మెరుపు ఇన్నింగ్స్... స్టొయినిస్ ఆల్‌రౌండ్ ప్రదర్శన... రబడ వైవిధ్యభరిత బౌలింగ్... ఢిల్లీని ఫైనల్ మెట్టుపై పడేసింది. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ వైఫల్యాలతో సన్‌రైజర్స్ ఐపీఎల్–13ను మూడో స్థానంతో ముగించింది. అబుదాబి: ఐపీఎల్ చరిత్రలో ఎనిమిదోసారి టాప్–2 జట్లే టైటిల్ పోరుకు అర్హత పొందాయి. డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్‌తో అమీతుమీ తేల్చుకునేందుకు ఢిల్లీ క్యాపిటల్స్ తొలిసారి ‘సై’ అంటోంది. ఆదివారం జరిగిన రెండో క్వాలిఫయర్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఢిల్లీ 17 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ (50 బంతుల్లో 78; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధసెంచరీ సాధించాడు. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ స్టొయినిస్ (27 బంతుల్లో 38; 3 ఫోర్లు, సిక్స్), హెట్‌మైర్ (22 బంతుల్లో 42 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్) ధాటిగా ఆడారు. తర్వాత లక్ష్యఛేదనలో సన్‌రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 172 పరుగులే చేసి ఓడింది. కేన్ విలియమ్సన్ (45 బంతుల్లో 67; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు) పరువు నిలిపే పోరాటం చేశాడు. స్టొయినిస్ (3/26), రబడ (4/29) హైదరాబాద్‌ను దెబ్బ తీశారు. విలియమ్సన్ పోరాటం.... 190 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ జట్టు అనుభవజ్ఞుడైన అశ్విన్ తొలి ఓవర్లోనే 12 పరుగులు చేసింది. సన్‌రైజర్స్ జోరు ఇక షురూ అనుకుంటున్న తరుణంలోనే రబడ రెండో ఓవర్ తొలి బంతికే వార్నర్ (2)ను క్లీన్‌బౌల్డ్ చేశాడు. ఐదో ఓవర్ వేసిన స్టొయినిస్... ప్రియమ్ గార్గ్ (17; 2 సిక్స్‌లు)ను బౌల్డ్ చేశాడు. రెండు బంతుల వ్యవధిలో మనీశ్ పాండే (14 బంతుల్లో 21; 3 ఫోర్లు)ను ఔట్ చేశాడు. దీంతో 44 పరుగులకే 3 కీలక వికెట్లను కోల్పోయిన హైదరాబాద్ కష్టాల్లో పడింది. కేన్ విలియమ్సన్, హోల్డర్ కాసేపు వికెట్ల పతనానికి అడ్డుకట్ట వేశారు. క్రీజులో కుదురుకున్నాక విలియమ్సన్ చెలరేగాడు. హోల్డర్ (11) ఔటయ్యాక... అబ్దుల్ సమద్ (16 బంతుల్లో 33; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు)తో కలిసి లక్ష్యాన్ని అందుకునేందుకు విలియమ్సన్ విఫలయత్నం చేశాడు. జట్టు స్కోరు 12.1 ఓవర్లలో వంద పరుగులకు చేరింది. ఈ దశలో పరుగుల వేగం పెరగడంతో ఢిల్లీ శిబిరం లో కలవరం మొదలైంది. 19 బంతుల్లో 43 పరుగులు చేయాల్సిన తరుణంలో విలియమ్సన్‌ను స్టొయినిస్ ఔట్ చేశాడు. రబడ ఒకే ఓవర్లో సమద్, రషీద్ ఖాన్‌లను పెవిలియన్ చేర్చాడు. ఐదో బంతికి శ్రీవత్స్ గోస్వామి (0) కూడా అవుట్ కావడంతో హైదరాబాద్ ఓటమి ఖాయమైంది. ఐపీఎల్ చరిత్రలో ఢిల్లీ జట్టు ఫైనల్ చేరడం ఇదే ప్రథమం. గతంలో ఆ జట్టు నాలుగుసార్లు (2008, 2009–సెమీఫైనల్; 2012, 2019–ప్లే ఆఫ్స్ మూడో స్థానం) ప్రయత్నించి విఫలమైంది. ఓపెనర్ల మెరుపులు... అంతకుముందు ఢిల్లీ ఆరంభం నుంచే ధనాధన్‌కు శ్రీకారం చుట్టింది. తొలుత స్టొయినిస్... ఆ తర్వాత ధావన్ దంచేశారు. నాలుగో ఓవర్ వేసిన హోల్డర్‌ను స్టొయినిస్ చితగ్గొట్టాడు. 4, 0, 4, 0, 6, 4లతో ఏకంగా 18 పరుగులు పిండుకున్నాడు. దీంతో 4.5 ఓవర్లలో జట్టు స్కోరు 50కి చేరింది. కాసేపటికి స్టొయినిస్‌ను రషీద్‌ఖాన్ బౌల్డ్ చేశాడు. 9వ ఓవర్లో ధావన్ ఫిఫ్టీ, జట్టు స్కోరు వంద దాటింది. తర్వాత ఢిల్లీ ఆట చూస్తే వేగం తగ్గినట్లనిపించింది. 4 ఓవర్ల పాటు (11 నుంచి 14) 24 పరుగులే చేయగలిగింది. అయ్యర్ (21) ఔటయ్యాక వచ్చిన హెట్‌మైర్ చెలరేగడంతో ఢిల్లీ స్కోరు మళ్లీ పుంజుకుంది. హోల్డర్ 18వ ఓవర్లో హెట్‌మైర్ 3, ధావన్ ఒక బౌండరీ బాదడంతో 18 పరుగులొచ్చాయి. నటరాజన్ ఆఖరి ఓవర్‌ను నియంత్రించి 7 పరుగులే ఇచ్చాడు. స్కోరు వివరాలు ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: స్టొయినిస్ (బి) రషీద్ ఖాన్ 38; ధావన్ (ఎల్బీడబ్ల్యూ) (బి) సందీప్ 78; అయ్యర్ (సి) మనీశ్ పాండే (బి) హోల్డర్ 21; హెట్‌మైర్ (నాటౌట్) 42; పంత్ (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 3 వికెట్లకు) 189. వికెట్ల పతనం: 1–86, 2–126, 3–178. బౌలింగ్: సందీప్ 4–0–30–1, హోల్డర్ 4–0–50–1, నదీమ్ 4–0–48–0, రషీద్ ఖాన్ 4–0–26–1, నటరాజన్ 4–0–32–0. సన్‌రైజర్స్ ఇన్నింగ్స్: ప్రియమ్ గార్గ్ (బి) స్టొయినిస్ 17; వార్నర్ (బి) రబడ 2; మనీశ్ పాండే (సి) నోర్జే (బి) స్టొయినిస్ 21; విలియమ్సన్ (సి) రబడ (బి) స్టొయినిస్ 67; హోల్డర్ (సి) ప్రవీణ్ దూబే (బి) అక్షర్ 11; సమద్ (సి) (సబ్) కీమో పాల్ (బి) రబడ 33; రషీద్ ఖాన్ (సి) అక్షర్ (బి) రబడ 11;గోస్వామి (సి) స్టొయినిస్ (బి) రబడ 0; నదీమ్ (నాటౌట్) 2; సందీప్ (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 172. వికెట్ల పతనం: 1–12, 2–43, 3–44, 4–90, 5–147, 6–167, 7–167, 8–168. బౌలింగ్: అశ్విన్ 3–0–33–0, రబడ 4–0–29–4, నోర్జే 4–0–36–0, స్టొయినిస్ 3–0–26–3, అక్షర్ 4–0–33–1, ప్రవీణ్ దూబే 2–0–14–0. ► శిఖర్ ధావన్ తన ఐపీఎల్ కెరీర్లో అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చాడు. ఈ సీజన్లో అతను 16 మ్యాచ్‌లు ఆడి 603 పరుగులు చేశాడు. 2012లో ధావన్ అత్యధికంగా 569 పరుగులు సాధించాడు. ► ఐపీఎల్లో ఢిల్లీ జట్టు తరఫున ఒకే సీజన్లో ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్‌గా రబడ నిలిచాడు. ఈ సీజన్లో రబడ 29 వికెట్లు పడగొట్టాడు. మోర్నీ మోర్కెల్ (2012లో 25 వికెట్లు) పేరిట ఉన్న రికార్డును అతను సవరించాడు. -
ఫైనల్‌పై రైజర్స్ గురి!
అబుదాబి: మాజీ చాంపియన్ సన్‌రైజర్స్ హైదరాబాద్ రెండోసారి ఐపీఎల్ ఫైనల్ చేరడంపై గురి పెట్టింది. అద్భుత ఫామ్‌తో వరుసగా నాలుగు విజయాలు సాధించి ఊపు మీదున్న ఈ టీమ్‌కు ఇప్పుడు ‘క్వాలిఫయర్–2’ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ రూపంలో ప్రత్యర్థి ఎదురైంది. ఎలిమినేటర్ మ్యాచ్‌లో బెంగళూరును చిత్తు చేసిన హైదరాబాద్... ఇప్పుడు ఢిల్లీనీ ఓడిస్తే తుది పోరుకు అర్హత సాధిస్తుంది. నాలుగుసార్లు చాంపియన్ ముంబైని టైటిల్ కోసం ఢీకొట్టాలంటే ముందుగా ఢిల్లీ అడ్డంకిని సన్‌రైజర్స్ అధిగమించాల్సి ఉంది. ఐపీఎల్ చరిత్రలో ఢిల్లీ ఒక్కసారి కూడా ఫైనల్ చేరలేదు. ఫామ్ ప్రకారం చూస్తే ఢిల్లీకంటే హైదరాబాద్ జోరు మీదుంది. ఒక దశలో తొలి 9 మ్యాచ్‌లలో 3 మాత్రమే గెలిచి ఏడో స్థానంలో ఉన్న సన్‌రైజర్స్ ఆ తర్వాత పుంజుకుంది. ఇప్పుడు వరుసగా నాలుగు మ్యాచ్‌లలో గెలిచి సత్తా చాటింది. తుది జట్టు విషయంపై రైజర్స్‌కు పూర్తి స్పష్టత వచ్చేసింది. ముఖ్యంగా బౌలింగే రైజర్స్ బలంగా మారింది. గత ఆరు మ్యాచ్‌లలో ఒక్కసారి మాత్రమే హైదరాబాద్ ప్రత్యర్థులు 150కు పైగా పరుగులు చేయగలిగారు. అయితే మిడిలార్డర్లో కొంత తడబాటు ఉందని ఎలిమినేటర్‌లో కూడా కనిపించింది. దీనిని జట్టు అధిగమించడమే కీలకం. సాహా గాయం నుంచి కోలుకోకపోవడంతో శ్రీవత్స్‌ని కొనసాగించే అవకాశం ఉంది. తొలి 9 మ్యాచ్‌లలో 7 గెలిచి అభేద్యంగా కనిపించిన ఢిల్లీ క్యాపిటల్స్ ఆ తర్వాత కుప్పకూలింది. వరుసగా నాలుగు మ్యాచ్‌లు ఓడింది. ఎట్టకేలకు ఆఖరి లీగ్‌లో బెంగళూరుపై గెలిచి ప్లే ఆఫ్స్‌కు చేరినా... టీమ్ ఆట మారలేదని తొలి క్వాలిఫయర్‌లో చెత్త ప్రదర్శన చూపించింది. జట్టు టాపార్డర్ మరీ పేలవం. ఎవరిని ఆడించాలో కూడా అర్థం కాని పరిస్థితి. రెండు సెంచరీలు చేసినా కూడా ధావన్ 4 డకౌట్లు నమోదు చేయగా... పృథ్వీ షా 3 సార్లు, రహానే 2 సార్లు డకౌటయ్యారు. ఈ మ్యాచ్ కోసం డేనియల్ స్యామ్స్ స్థానంలో బ్యాటింగ్‌కు బలంగా మార్చేందుకు హెట్‌మైర్ రావచ్చు. ఈ సీజన్లో ఢిల్లీతో ఆడిన రెండు మ్యాచ్‌లలో కూడా హైదరాబాద్ గెలిచింది. తొలి మ్యాచ్‌లో 15 పరుగులతో నెగ్గిన రైజర్స్, రెండో పోరులో 88 పరుగులతో ఘన విజయం సాధించింది. అబుదాబిలో జరిగిన గత 9 మ్యాచ్‌లలో 8 సార్లు రెండోసారి బ్యాటింగ్ చేసిన జట్టే గెలిచింది. రెండో ఇన్నింగ్స్ సమయంలో మంచు ప్రభావం కూడా దీనికి కారణం కాబట్టి టాస్ కీలకం. అయితే శుక్రవారం జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో మంచు పెద్దగా ఇబ్బంది పెట్టలేదు. హైదరాబాద్ వికెట్ కీపర్ శ్రీవత్స్ గోస్వామి తొలి సీజన్ (2008) నుంచే ఐపీఎల్లో ఆడుతున్నాడు. నాటినుంచి 2020 ఐపీఎల్ వరకు ఆడుతూ ఒక్కసారి కూడా జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించని (అన్క్యాప్డ్) ఆటగాడు అతనొక్కడే. గత ఐపీఎల్లో నాకౌట్ దశలో హైదరాబాద్‌ను ఢిల్లీ దెబ్బ తీసింది. విశాఖపట్నంలో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో క్యాపిటల్స్ 2 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్‌ను ఓడించింది. ఇప్పుడు మళ్లీ నాకౌట్ మ్యాచ్‌లో రెండు జట్లు తలపడుతున్నాయి. శ్రీవత్స్ గోస్వామి -
ముంబై ఇంటికి...
ఎలిమినేటర్‌లో చెన్నై చేతిలో చిత్తు క్వాలిఫయర్-2కు దూసుకెళ్లిన ధోనీసేన ముంబై: ఎవరూ ఊహించని రీతిలో రాజస్థాన్‌ను చిత్తుచేసిన ముంబైని చెన్నై జట్టు నేలకు దించింది. ఎలిమినేటర్ మ్యాచ్‌లో ధోనిసేన అద్భుతమైన బ్యాటింగ్‌తో ముంబైని ఇంటికి పంపించింది. బ్రబౌర్న్ స్టేడియంలో బుధవారం జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 7 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్‌ను మట్టికరిపించింది. టాస్ కోల్పోయి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. ఓపెనర్లు సిమ్మన్స్ (44 బంతుల్లో 67; 5 ఫోర్లు, 4 సిక్సర్లు), మైక్ హస్సీ (33 బంతుల్లో 39; 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. చెన్నై బౌలర్లలో మోహిత్ శర్మ (3/42) మూడు వికెట్లు పడగొట్టగా, ఆశిష్ నెహ్రా, జడేజా రెండేసి వికెట్ల చొప్పున తీశారు. అనంతరం చెన్నై 18.4 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 176 పరుగులు చేసి విజయాన్నందుకుంది. రైనా (33 బంతుల్లో 54 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), డేవిడ్ హస్సీ (29 బంతుల్లో 40 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్సర్లు)లు రాణించారు. ముంబై బౌలర్లలో హర్భజన్‌కు రెండు, ఓజాకు ఒక వికెట్ దక్కాయి. స్లాగ్ ఓవర్లలో తడబాటు: ముంబైకి సిమ్మన్స్-మైక్ హస్సీ జోడి శుభారంభాన్నిచ్చారు. దీంతో పవర్‌ప్లేలో 53 పరుగులు లభించాయి. స్పిన్నర్లు అశ్విన్, జడేజాల ప్రవేశంతో ముంబై వేగానికి బ్రేకులు పడ్డాయి. ఈ క్రమంలో జడేజా బౌలింగ్‌లో 10వ ఓవర్లో హస్సీ ఔటయ్యాక.. అండర్సన్ (10 బంతుల్లో 20; 1 ఫోర్, 2 సిక్సర్లు) వచ్చీ రావడంతోనే చెలరేగినా... అశ్విన్‌కు వికెట్ ఇచ్చి వెనుదిరిగాడు. రోహిత్ శర్మ సహకారంతో దూకుడు పెంచిన సిమ్మన్స్ అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. మూడో వికెట్‌కు 27 బంతుల్లో 44 పరుగులు జత చేశాక సిమ్మన్స్.. లాంగాన్‌లో రైనా చేతికి చిక్కాడు. ఇక్కడి నుంచి స్కోరు వేగం పెంచేప్రయత్నంలో రోహిత్ (16 బంతుల్లో 20), పొలార్డ్ (8 బంతుల్లో 14)లతో సహా బ్యాట్స్‌మెన్ వరుసగా డగౌట్‌కు క్యూ కట్టారు. ఒక దశలో 16 ఓవర్లలో 140/2 స్కోరుతో ఉన్న ముంబై.. నాలుగు ఓవర్లలోనే 6 వికెట్లు కోల్పోయి చతికిలబడింది. చివరి రెండు ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోవడంతో ఆశించిన స్కోరు రాలేదు. రైనా దూకుడు: లక్ష్యఛేదనలో చెన్నై ఆరంభం నుంచే ముంబైపై ఆధిపత్యం ప్రదర్శించింది. డ్వేన్ స్మిత్ (20), డుప్లెసిస్ (35) చెలరేగడంతో పవర్ ప్లేలో 60 పరుగులు లభించాయి. అయితే హర్భజన్ ఒకే ఓవర్లో వీరిద్దరినీ ఔట్ చేసి ముంబై శిబిరంలో ఉత్సాహం నింపాడు. మరికొద్ది సేపటికే మెకల్లమ్ (14) ఓజా బౌలింగ్‌లో స్టంపవుటయ్యాడు. కానీ ఆ తరువాత రైనా, డేవిడ్ హస్సీలు ముంబైకి మరో అవకాశమే ఇవ్వలేదు. ముఖ్యంగా రైనా అద్భుతంగా ఆడాడు. 36 బంతుల్లో 56 పరుగులు చేయాల్సిన దశలో ప్రవీణ్ వేసిన 15వ ఓవర్లో 14, ఓజా వేసిన 16వ ఓవర్లో 20 పరుగులు సాధించిన ఈ ఇద్దరూ లక్ష్యాన్ని తేలిక చేశారు. అజేయమైన నాలుగో వికెట్‌కు 89 పరుగులు జోడించి మరో 8 బంతులు మిగిలుండగానే జట్టును గెలిపించారు. స్కోరు వివరాలు ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: సిమ్మన్స్ (సి) రైనా (బి) జడేజా 67; మైక్ హస్సీ (బి) జడేజా 39; అండర్సన్ (సి) పాండే (బి) అశ్విన్ 20; రోహిత్ (సి) మెకల్లమ్ (బి) మోహిత్ 20; పొలార్డ్ (సి) మోహిత్ (బి) నెహ్రా 14; రాయుడు (సి) డేవిడ్ హస్సీ (బి) మోహిత్ 2; తారే (సి) డుప్లెసిస్ (బి) నెహ్రా 0; హర్భజన్ (నాటౌట్) 7; ప్రవీణ్ (బి) మోహిత్ 1; ఓజా (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం: (20 ఓవర్లలో 8 వికెట్లకు) 173. వికెట్ల పతనం: 1-76; 2-99; 3-143; 4-150; 5-163; 6-164; 7-164; 8-166. బౌలింగ్: నెహ్రా 4-0-34-2; పాండే 3-0-25-0; మోహిత్ 4-0-42-3; అశ్విన్ 4-0-26-1; జడేజా 4-0-31-2; రైనా 1-0-13-0. చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్: డ్వేన్ స్మిత్ (సి) పొలార్డ్ (బి) హర్భజన్ 24; డుప్లెసిస్ (సి) సబ్‌స్టిట్యూట్- డంక్ (బి) హర్భజన్ 35; రైనా (నాటౌట్) 54; మెకల్లమ్ (స్టంప్డ్) తారే (బి) ఓజా 14; డేవిడ్ హస్సీ (నాటౌట్) 40; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం: (18.4 ఓవర్లలో 3 వికెట్లకు) 176. వికెట్ల పతనం: 1-60; 2-64; 3-87. బౌలింగ్: ప్రవీణ్ 4-0-27-0; అండర్సన్ 3-0-35-0; బుమ్రా 3.4-0-40-0; హర్భజన్ 4-0-27-2; ఓజా 3-0-34-1; పొలార్డ్ 1-0-10-0.