యశస్వి జైశ్వాల్(PC: BCCI)
Ranji Trophy 2021- 2022: Mumbai- Yashasvi Jaiswal: దేశవాళీ టోర్నీ రంజీ ట్రోఫీ 2021-22 సీజన్‌లో ముంబై బ్యాటర్ యశస్వి జైశ్వాల్ ఇప్పటి వరకు మూడు సెంచరీలు చేశాడు. అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటూ తమ జట్టు ఫైనల్ చేరడంలో తన వంతు పాత్ర పోషించాడు. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌తో సెమీస్‌లో యశస్వి రెండు ఇన్నింగ్స్‌లో వరుసగా 100, 181 పరుగులు చేయడం విశేషం. తద్వారా ఒకే మ్యాచ్‌లో రెండు సెంచరీలు బాదిన క్రికెటర్‌గా చరిత్రకెక్కాడు కూడా!
ఇక మధ్యప్రదేశ్‌తో జరుగుతున్న ఫైనల్లో మొదటి ఇన్నింగ్స్‌లో భాగంగా మరో శతకం బాదే అవకాశం చేజారినా యశస్వి.. 78 పరుగులతో రాణించాడు. ఇక ఈ 20 ఏళ్ల లెఫ్ట్ హ్యాండర్ బ్యాటర్.. ఈ ఎడిషన్‌లో మొత్తంగా 497 పరుగులు చేయడం గమనార్హం.
నాకు గర్వకారణం
ఇదిలా ఉంటే.. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో యశస్వి జైశ్వాల్ రాజస్తాన్ రాయల్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జోస్ బట్లర్‌తో కలిసి పలు ఇన్నింగ్స్‌లో ఈ కుర్ర బ్యాటర్ ఓపెనింగ్ చేశాడు. ఈ నేపథ్యంలో రంజీ ట్రోఫీలో తన ప్రదర్శ, బట్లర్‌తో అనుబంధం గురించి బీసీసీఐ ఇంటర్వ్యూలో యశస్వి మాట్లాడాడు.
యశస్వి జైశ్వాల్(PC: Yashasvi Jaiswal Twitter)
ఈ మేరకు.. ‘‘మూడు సెంచరీలు చేసినందుకు ఎంతో సంతోషంగా ఉంది. మరో శతకం చేజారినా.. మరేం పర్లేదు. ఒక్కోసారి ఇలా జరుగుతుంది. నిజానికి ముంబై క్యాప్ ధరించగానే నేను ఎంతో అదృష్టవంతుడినన్న భావన కలుగుతుంది.
ముంబైకి ఆడుతున్నామంటే ఎల్లప్పుడూ ఎంతో జాగరూకతతో ఉండాలి. మానసికంగా దృఢంగా ఉంటేనే సవాళ్లను ఎదుర్కొని ముందుకు సాగగలం. ముంబైకి ఆడటం నిజంగా నాకు గర్వకారణం’’అని యశస్వి చెప్పుకొచ్చాడు.
ఆయన వల్లే ఇదంతా
ఇక తన బ్యాటింగ్ మీద జోస్ బట్లర్ ప్రభావం గురించి మాట్లాడుతూ.. ‘‘ఆయన ఇచ్చిన సలహాలు, సూచనలు నిజంగా నాకు ఎంతగానో ఉపయోగపడ్డాయి. బంతిని చూస్తూ.. పరిస్థితులను అంచనా వేసుకుంటూ షాట్ సెలక్షన్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెప్పారు.
ఇవన్నీ ఏకకాలంలో జరిగిపోవాలి. అప్పుడే మనం అనుకున్న ఫలితాన్ని పొందగలం అని అన్నాడు. ఆయన టిప్స్ ఫాలో అవుతున్నాను’’ అని యశస్వి జైశ్వాల్ పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్-2022లో 10 ఇన్నింగ్స్‌లో 258 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు.. 68.
చదవండి: Ranji Trophy 2022 FInal: 'నీ ఓపికకు సలాం'.. రంజీ ఫైనల్లో సెంచరీ బాదిన సర్ఫరాజ్ ఖాన్
What does it mean to play for Mumbai? 🤔
— BCCI Domestic (@BCCIdomestic) June 22, 2022
How does it feel to score runs in tons? 🤔
The @josbuttler impact 👍
Aman Khan interviews @ybj_19 as he sums up the Day 1 of the @Paytm #RanjiTrophy #Final. 👌 👌 - By @ameyatilak
Full interview 🎥 🔽 #MPvMUM https://t.co/1xxSOsxoEE pic.twitter.com/sqv77EY0tW
50*, 181, 100, 103 👏
— Rajasthan Royals (@rajasthanroyals) June 22, 2022
Yashasvi Jaiswal just loves to bat. 😋💗#MPvMUM | 📸: @bccidomestic pic.twitter.com/n64y2yLazB
Comments
Please login to add a commentAdd a comment