IPL Displays Worlds Largest Cricket Jersey And Enters Guinness Book of World Records - Sakshi
Sakshi News home page

IPL 2022 World Largest Jersey: గిన్నిస్‌ బుక్‌ రికార్డు సృష్టించిన ఐపీఎల్‌

Published Sun, May 29 2022 9:11 PM | Last Updated on Mon, May 30 2022 1:40 PM

IPL unveils worlds largest jersey to mark Guinness Book of World Records entry - Sakshi

గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య ఫైనల్‌ మ్యాచ్‌ సందర్భంగా ప్రపంచంలోనే అతిపెద్ద జెర్సీని ఐపీఎల్‌ నిర్వహకులు రూపొందించారు. తద్వారా ఐపీఎల్‌ గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డు సృష్టించింది. ఐపీఎల్‌-2022 ఫైనల్‌ జరగుతున్న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ జెర్సీని ఆవిష్కరించారు. ఈ జెర్సీపై ఐపీఎల్‌ 15లో ఆడుతున్న 10 జట్ల లోగోలు ఉన్నాయి.

ఈ జెర్సీ 66 మీటర్ల పొడవుతో పాటు 42 మీటర్ల వెడల్పు ఉంది. ఇక ఈ జెర్సీకి సంబంధించిన ఫోటో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఐపీఎల్‌-2022 ముగింపు వేడుకులు అంబరాన్ని అంటాయి. ముగింపు కార్యక్రమంలో బాలీవుడ్ సూపర్ స్టార్ రణవీర్ సింగ్, ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తమ ప్రదర్శనలతో  ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

చదవండి: కాల్పుల కలకలం.. పరుగులు పెట్టిన ప్రేక్షకులు; ఊహించని ట్విస్ట్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement