
బౌలింగ్ చేస్తున్న షెల్డాన్ కోట్రెల్
క్రికెట్‌లో అప్పుడప్పుడు వైవిధ్యమైన, ఆశ్చర్యకర ఘటనలు చోటుచేసుకుంటాయి. సరిగ్గా అలాంటి ఓ ఘటన బంగ్లాదేశ్, వెస్టిండీస్ జట్ల మధ్య ఇటీవల జరిగిన మూడో వన్డేలో జరిగింది. విండీస్ పేసర్ షెల్డాన్ కోట్రెల్ వేసిన ఓ నో బాల్‌ను ఈ శతాబ్దపు నో బాల్‌గా పిలుస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియోను ఫాక్స్ స్పోర్ట్స్ ఆస్ట్రేలియా ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయగా వైరల్‌గా మారింది.
ఇటీవల విండీస్‌తో జరిగిన మూడో వన్డేలో టాస్ నెగ్గిన బంగ్లాదేశ్ బ్యాటింగ్ చేసింది. ఇన్నింగ్స్ తొలి ఓవర్‌ను లెఫ్టార్మ్ పేసర్ షెల్డాన్ కోట్రెల్ వేశాడు. ఆ ఓవర్‌లో ఐదో బంతిని షెల్డాన్ వేయగా.. సెకండ్ స్లిప్‌లో ఉన్న విండీస్ ఫీల్డర్ అతికష్టమ్మీద బంతిని క్యాచ్ అందుకున్నాడు. అంపైర్ ఆ బంతిని నో బాల్‌గా ప్రకటించాడు. కాగా, స్ట్రైకింగ్‌లో ఉన్న బంగ్లా ఓపెనర్ అనాముల్ హక్ విండీస్ పేసర్ నోబాల్‌కు ఆశ్చర్యపోయాడు. కాగా, ఈ మ్యాచ్‌లో షెల్డాన్ 9 ఓవర్లు వేసి ఒకే వికెట్ సాధించి 59 పరుగులు సమర్పించుకున్నాడు. ఈ వన్డేలో 18 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ నెగ్గిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment