బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఢిల్లీలోని అరుణ్‌జైట్లీ స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్టు ప్రారంభమైంది. ఆట తొలిరోజునే టీమిండియా స్పష్టమైన ఆధిక్యం చూపించింది. అయితే తొలి టెస్టులోలాగా ఆసీస్ ఇన్నింగ్స్ పేకమేడలా కూలిపోలేదు. ఈసారి ఓపెనర్లు ఉస్మాన్ ఖవాజా, డేవిడ్ వార్నర్‌లు ఆస్ట్రేలియాకు మంచి ఆరంభాన్నిచ్చారు. ఇద్దరు కలిసి తొలి వికెట్‌కు 50 పరుగులు జోడించారు. అనంతరం వార్నర్(18) వెనుదిరిగాడు.
ఆ తర్వాత వచ్చిన లబుషేన్ టచ్‌లో ఉన్నట్లు కనిపించాడు. అయితే అశ్విన్ వరుస బంతుల్లో స్మిత్, లబుషేన్‌ను పెవిలియన్ చేర్చి ఆసీస్‌ను దెబ్బ తీశాడు. ఇక అక్కడి నుంచి ఆస్ట్రేలియా వికెట్ల పతనం కొనసాగుతూ వచ్చింది. మధ్యలో పీటర్ హ్యాండ్స్‌కోబ్(72 నాటౌట్.. ఉస్మాన్ ఖవాజా(81 పరుగులు)కు జత కావడంతో ఆసీస్ కోలుకున్నట్లే కనిపించింది. కానీ జడేజా తన స్పిన్ మాయతో టీమిండియాకు మరోసారి బ్రేక్ ఇచ్చాడు. అలా 246 పరుగులకు తొమ్మిది వికెట్లు కోల్పోయిన ఆసీస్ ఆలౌట్‌కు ఒక్క వికెట్ దూరంలో మాత్రమే ఉంది.
ఈ దశలో బౌలింగ్‌కు వచ్చిన జడేజా సూపర్ బంతితో హ్యాండ్స్‌కోబ్‌ను బోల్తా కొట్టించాడు. జడ్డు బంతిని హ్యాండ్స్‌కోబ్ కవర్స్ దిశగా ఆడగా అశ్విన్ క్యాచ్ పట్టాడు. అంతే ఆసీస్ ఇన్నింగ్స్ ముగిసిందని టీమిండియా సంబరాల్లో మునిగిపోయింది. బౌండరీ లైన్ వద్ద ఉన్న క్రికెటర్లు అప్పటికే డ్రెస్సింగ్‌రూమ్ బాట పట్టారు. రోహిత్ , రాహుల్‌లు కూడా వెనుదిరిగే ప్రయత్నంలో ఉన్నారు.
ఇక్కడే ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది. జడేజా నో బాల్ వేసినట్లు రీప్లేలో తేలింది. జడ్డూ ఫుట్ భాగం లైన్ అవతల ఉండడంతో అంపైర్ నోబాల్ ఇచ్చాడు. దీంతో హ్యాండ్స్‌కోబ్ నాటౌట్ అని తేలింది. నోబాల్స్ వేయడంలో పొదుపు పాటించే జడేజా ఈ మ్యాచ్‌లో ఆరు నో బాల్స్ వేయడం విశేషం. ఇక ఆసీస్ ఆలౌట్ అనుకొని అప్పటికే పెవిలియన్ వెళ్లిన టీమిండియా క్రికెటర్లకు తిరిగి రావాలని పిలుపు వచ్చింది. దీంతో చేసేదేంలేక క్రికెటర్లు మైదానంలో అడుగుపెట్టారు. ఆ తర్వాత ఆస్ట్రేలియా ఆలౌట్‌కు ఎక్కువ సమయం పట్టేలేదనుకోండి. షమీ వేసిన మరుసటి ఓవర్లో నాలుగో బంతికి కుహ్నేమన్ క్లీన్‌బౌల్డ్ అవ్వడంతో ఆసీస్ ఇన్నింగ్స్‌కు తెరపడింది.
It was very tight#No ball#jaddu sixth no Ball in this match#INDvAUS #BGT2023 #hotstar pic.twitter.com/OSHwTEcoak
— Raushan choudhary (@Raushan0321) February 17, 2023
Comments
Please login to add a commentAdd a comment