బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భాగంగా టీమిండియా వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. ఢిల్లీ వేదికగా జరిగిన రెండో టెస్టులో ఆస్ట్రేలియాపై ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించి నాలుగు టెస్టుల సిరీస్‌లో 2-0తో ఆధిక్యంలో నిలిచింది. ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా మరోసారి తన బౌలింగ్ మ్యాజిక్‌తో మెరిశాడు. తొలి ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు మాత్రమే తీసిన జడేజా.. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం విశ్వరూపం ప్రదర్శించాడు. ఏడు వికెట్లతో ఆసీస్ నడ్డి విరిచి ఓవరాల్‌గా రెండు ఇన్నింగ్స్‌లు కలిపి 10 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు.
మ్యాచ్ అనంతరం ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్న జడేజా మాట్లాడుతూ.. ''నా బౌలింగ్‌ను నేను బాగా ఎంజాయ్ చేస్తున్నానని అనుకుంటున్నా. ఇలాంటి వికెట్లు నా బౌలింగ్ శైలికి సరిగ్గా సరిపోయింది. ఆసీస్ బ్యాటర్లు ఎక్కువగా స్వీప్స్, రివర్స్ స్వీప్స్ ఆడుతారని ముందే ఊహించాను.. అందుకే వికెట్ టు వికెట్ బౌలింగ్ వేయాలని డిసైడ్ అయ్యాను. పరుగులు చేయడంలో వాళ్లు విఫలమైన ప్రతీసారి నాకు వికెట్ తీసే చాన్స్ లభించింది. ఈ వికెట్‌పై స్వీప్ షాట్స్ ఆడడం మంచి ఆప్షన్ కాదని నా అభిప్రాయం'' అంటూ చెప్పుకొచ్చాడు.
చదవండి: వందో టెస్ట్.. బౌండరీ కొట్టి టీమిండియాను గెలిపించిన పుజారా
Comments
Please login to add a commentAdd a comment