టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఐదు నెలల తర్వాత రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో జడ్డూ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. బౌలింగ్‌లో(తొలి ఇన్నింగ్స్‌లో ఐదు, రెండో ఇన్నింగ్స్‌లో రెండు వికెట్లు) ఏడు వికెట్లు పడగొట్టిన జడ్డూ.. బ్యాటింగ్‌లో 70 పరుగులు చేశాడు. ఢిల్లీ వేదికగా జరగనున్న రెండో టెస్టుకు జడేజా సన్నద్ధమవుతున్నాడు.
ఇదిలా ఉంటే జడేజాను సోషల్ మీడియాలో అందరు 'సర్' అని పిలవడం చూస్తుంటాం. అయితే అభిమానులు ఇలా పిలవడం తనకు ఇష్టం లేదని.. అలా పిలిస్తే సర్ అనే పదాన్ని నేను అసహ్యించుకోవాల్సి వస్తుందని పేర్కొన్నాడు. గతంలోనే తనను సర్ అని పిలవొద్దని అభిమానులకు తెలిపినప్పటికి ఆసీస్‌తో తొలిటెస్టు సందర్భంగా తనను మళ్లీ 'సర్' అని కొంతమంది అభిమానులు సంభోదించారు. తాజాగా ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో జడేజా మరోసారి ఈ విషయంపై మాట్లాడాడు.
''అభిమానులు నన్ను నా పేరు(జడేజా) పెట్టి పిలిస్తేనే బాగుంటుంది. అది చాలు. దయచేసి నన్ను సర్ అని పిలవొద్దు. ఆ పదాన్ని అసహ్యించుకుంటున్నా. ఒకవేళ మీకు అలాగే పిలవాలనిపిస్తే బాపు అని పిలుచుకోవచ్చు. అంతేకాని సర్-వర్ అంటూ అడ్డమైన పదాలతో పిలవకండి. జడేజా అనే పేరు అందరి నోళ్లలో నాని ఉంది.. ఇలా సర్ అని పిలిస్తే నాకు మైండ్‌లో రిజిస్టర్ అవడం లేదు.'' అంటూ పేర్కొన్నాడు.
జడేజా ఇంకా మాట్లాడుతూ.. ''చిన్నప్పుడు నా తండ్రి ఇచ్చిన ఒక సలహాను తప్పకుండా పాటించాలనుకున్నా. మ్యాచ్ సమయంలో ఎవరిపై చెంచాగిరి చేయొద్దని వార్నింగ్ ఇచ్చాడు. ఫీల్డ్‌లో ప్రదర్శనను మాత్రమే చెయ్యు.. ఏమన్నా గొడవలు ఉన్నా మైదానం వరకే పరిమితం చెయ్యు అంటే తెలిపాడు. నా ప్రదర్శన మీకు నచ్చితే నన్ను పొగడండి అంతేకాని సర్ అనే పదాన్ని మాత్రం వాడొద్దు. అలాగే నన్నెవరు జడ్జ్ చేయొద్దు. ముఖ్యంగా సోషల్ మీడియాలో తమ మీమ్స్‌తో రెచ్చిపోయే మీమర్స్‌కు నా ప్రత్యేక విన్నపం.'' అని చెప్పుకొచ్చాడు.
చదవండి: ఇంగ్లండ్ టీమ్ ఓవర్ కాన్ఫిడెన్స్.. తొలి రోజే.. ఓ వికెట్ ఉన్నా..!
Comments
Please login to add a commentAdd a comment