టీ20 ప్రపంచకప్-2022లో భాగంగా ఆదివారం జింబాబ్వేతో జరిగిన ఉత్కంఠ పోరులో మూడు పరుగుల తేడాతో బంగ్లాదేశ్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో జింబాబ్వే ఇన్నింగ్స్ అఖరి ఓవర్‌లో హై డ్రామా చోటు చేసుకుంది. చివరి ఓవర్‌లో జింబాబ్వే విజయానికి 16 పరుగులు అవసరమవ్వగా.. తొలి బంతికి లెగ్ బైస్ రూపంలో ఒక పరగు రాగా.. రెండో బంతికి ఎవెన్స్ ఔటయ్యాడు.
దీంతో మ్యాచ్ సమీకరణం నాలుగు బంతుల్లో 15 పరుగులుగా మారింది. ఈ క్రమంలో మూడో బంతికి లెగ్ బైస్ రూపంలో నాలుగు పరుగులు, నాలుగో బంతికి నగరవా భారీ సిక్స్ బాదాడు. దీంతో ఒక్క సారిగా మ్యాచ్ జింబాబ్వే వైపు మలుపు తిరిగింది.
అఖరి రెండు బంతులకు జింబాబ్వే విజయానికి 5 పరుగులు అవసరమయ్యాయి. ఈ క్రమంలో ఐదో బంతికి నగరవా భారీ షాట్‌కు ప్రయత్నించి స్టంపౌట్‌గా వెనుదిరిగాడు. ఇక అఖరి బంతికి కూడా ముజారబానీ కూడా స్టంపౌటయ్యాడు.
దీంతో గెలుపు సంబురాల్లో మునిగి తేలిపోయింది. ఓటమి బాధతో జింబాబ్వే ఆటగాళ్లు కూడా డగౌట్‌కు చేరుకున్నారు. ఇక్కడే అసలు ట్విస్ట్ చోటు చేసుకుంది. అఖరి బంతిని అంపైర్ నో బాల్‌గా ప్రకటించాడు.
నో బాల్’ ఎందుకంటే...
స్టంప్ చేసే క్రమంలో బంగ్లాదేశ్ కీపర్ నూరుల్ అత్యుత్సాహంతో వికెట్లను దాటి వాటి ముందే బంతిని అందుకున్నాడు. ఐసీసీ నిబంధన 27.3.1 ప్రకారం కీపర్ ఇలా చేయకూడదు. బంతి బ్యాట్‌ను లేదా బ్యాటర్‌ను తాకిన తర్వాత లేదా వికెట్లను దాటిని తర్వాతే బంతిని అందుకోవాలి. 27.3.2 ప్రకారం దానిని ‘నో బాల్’గా ప్రకటిస్తారు కూడా.
దాంతో మరోసారి ఆఖరి బంతికి 5 పరుగులు చేస్తే గెలిచే అవకాశం జింబాబ్వేకు వచ్చింది. అయితే మొసద్దిక్ మరో చక్కటి బంతి వేసి సింగిల్ కూడా ఇవ్వలేదు. దాంతో బంగ్లా ఆటగాళ్ల మొహాల్లో మళ్లీ నవ్వు కనిపించింది. గతంలో ఐపీఎల్‌లో కోల్‌కతా కీపర్ ఉతప్ప, రైనా మధ్య ఇదే తరహాలో ఘటన చోటు చేసుకుంది.
చదవండి: #OnThisDay: నాడు నిరాశపరిచిన సచిన్.. ఆకాశమే హద్దుగా చెలరేగిన ధోని! మిస్టర్ కూల్ తుపాన్ ఇన్నింగ్స్ చూశారా!
Comments
Please login to add a commentAdd a comment