
Phoot: IPL Twitter
ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ బ్యాటింగ్ శైలి ఏంటని అడగ్గానే టక్కున చెప్పే సమాధానం ఎడమ చేతి వాటం బ్యాటర్ అని. మరి అలాంటి వార్నర్ తొలిసారి తన బ్యాటింగ్ శైలిని మార్చి చరిత్రకెక్కాడు. ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో భాగంగా ఇన్నింగ్స్ 8వ ఓవర్ రెండో బంతిని ఎదుర్కొనే క్రమంలో వార్నర్ లెఫ్ట్ హ్యాండ్ నుంచి రైట్ హ్యాండ్‌కు స్విచ్ అయి బ్యాటింగ్ ఆడాడు.
క్రికెట్ రూల్స్ ప్రకారం ఒక ఆటగాడు తన బ్యాటింగ్ శైలిని మార్చడం వీలుకాదు. ఒక మ్యాచ్‌లో బంతి పడ్డాకా బ్యాటింగ్‌ను స్విచ్ చేయడం చూస్తుంటాం. కానీ వార్నర్ అలా కూడా చేయలేదు. మరి వార్నర్ రూల్‌ను బ్రేక్‌చేసి ఎలా ఆడాడనేగా మీ డౌటు. వాస్తవానికి వార్నర్ ఆడింది ఫ్రీహిట్‌ను. అవునండీ ఇన్నింగ్స్ 8వ ఓవర్ మూడో బంతిని హృతిక్ షోకీన్ నోబాల్ వేశాడు. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఫ్రీహిట్ లభించింది.
అయితే ఫ్రీహిట్ ఎలా ఆడినా ఎవరికి అభ్యంతరం ఉండదు. ఇక్కడే వార్నర్ ఎవరికి రాని ఆలోచనతో లెఫ్ట్ హ్యాండర్ కాస్త రైట్ హ్యాండ్‌గా మారి భారీ షాట్ ఆడాడు. అయితే బంతి పెద్దగా దూరం పోలేదు. కేవలం ఒక రన్ మాత్రమే వచ్చింది. ఏదైతేనేం వార్నర్ ఎవరికి రాని ఆలోచనతో చరిత్రకెక్కాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
David warner turns to a right handed batsman on a free hit
— Khel Cricket (@Khelnowcricket) April 11, 2023
(📸 - JIO Cinema) #IPL #IPL2023 #DCvMI #Delhicapitals #DC #Davidwarner #CricketTwitter pic.twitter.com/cbsMaRY9t9
Comments
Please login to add a commentAdd a comment