గత కొంత కాలంగా వివిధ సిరీస్‌లో కెప్టెన్లను మారుస్తున్న భారత జట్టుపై పాకిస్తాన్ మాజీ ఆటగాడు రషీద్ లతీఫ్ ఆసక్తికర వాఖ్యలు చేశాడు. 1990లలో పాకిస్తాన్ జట్టు కూడా ఇదే విధంగా సారథిలను మారుస్తూ వచ్చింది అని రషీద్ లతీఫ్ అన్నాడు. అప్పుడు పాకిస్తాన్ చేసిన తప్పునే భారత్ ఇప్పుడు చేస్తుందని లతీఫ్ అభిప్రాయపడ్డాడు. కాగా గత 8 నెలల నుంచి భారత జట్టుకు ఇప్పటి వరకు ఏడుగురు కెప్టెన్‌లుగా వ్యవహారించారు.
విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్, రిషభ్ పంత్,జస్ప్రీత్ బుమ్రా, హార్ధిక్ పాండ్యా, శిఖర్ ధావన్ భారత్‌కు సారథిలుగా పనిచేశారు. ఇక తాజాగా జింబాబ్వేతో వన్డే సిరీస్‌కు కూడా ధావన్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఈ నేపథ్యంలో రషీద్ లతీఫ్ తన యూట్యూబ్ ఛానల్‌లో మాట్లాడుతూ.. "ప్రస్తుతం అందరూ బ్యాకప్ కెప్టెన్‌లు గురించి మాట్లాడుతున్నారు.
కానీ భారత్ మాత్రం గత ఏడాది నుంచి ఏకంగా ఏడుగురు సారథిలను మార్చింది. భారత క్రికెట్ చరిత్రలో నేను ఈ పరిస్థితిని చూడటం ఇదే మొదటిసారి. టీమిండియా వరుసగా విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, రిషబ్ పంత్, జస్ప్రీత్ బుమ్రా వంటి వారిని వివిధ సిరీస్‌లకు తమ సారథిలుగా నియమించింది. అది జట్టుకు మంచిది కాదు. ప్రస్తుతం భారత జట్టు తీరు చూస్తుంటే టీమిండియా సైతం 1990లలో పాకిస్తాన్ చేసిన తప్పే చేస్తున్నట్టుంది.
ప్రస్తుతం భారత జట్టుకు సౌరవ్ గంగూలీ, ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లి లాంటి నాయకుడు కావాలి అని పేర్కొన్నాడు. కాగా 1990లలో పాకిస్తాన్ కూడా ఇదే విధంగా తమ కెప్టెన్‌లను పదే పదే మార్చింది. 1992లో ఇమ్రాన్ ఖాన్ సారథ్యంలో పాకిస్తాన్ జట్టు ప్రపంచకప్‌ను కైవసం చేసుకుంది. ఆ తర్వాత జావేద్ మియాందాద్, వసీం అక్రమ్, సలీమ్ మాలిక్, వకార్ యూనిస్, రమీజ్ రాజా, రషీద్ లతీఫ్, సయూద్ అన్వర్, అమీర్ సొహైల్ లు పాకిస్తాన్ జట్టుకు సారథ్యం వహించారు.
చదవండి: Nicholas Pooran: వాళ్ల వల్లే ఈ దుస్థితి! మరీ చెత్తగా! ఇకపై: విండీస్ కెప్టెన్
Comments
Please login to add a commentAdd a comment