ఆ క్రికెటర్లను విరాట్తో పోల్చలేం!
కరాచీ: ప్రస్తుత తరుణంలో పాకిస్తాన్ క్రికెటర్లు అహ్మద్ షెహ్జాద్, ఉమర్ అక్మల్పై ఆ దేశ క్రికెట్ బోర్డు(పీసీబీ) భారీ అంచనాలు పెట్టుకోవడం అనవసరమని ఆల్ రౌండర్ షాహిద్ ఆఫ్రిది అభిప్రాయడ్డాడు. ఒకవేళ వారి నుంచి పాక్ క్రికెట్ బోర్డు ఎక్కువగా ఆశిస్తే పొరబడినట్లేనని తెలిపాడు.
వచ్చే నెలలో ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లే పాక్ జట్టులో స్థానం కోల్పోయిన ఆ క్రికెటర్లను విరాట్ కోహ్లి, ఏబీ డివిలియర్స్ స్థాయి క్రికెటర్లగా అంచనా వేయవద్దని ఆఫ్రిది సూచించాడు. ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లే జట్టులో అటు ఆఫ్రిదితో పాటు, షెహజాద్, అక్మల్లపై వేటు పడిన సంగతి తెలిసిందే. అయితే షెహజాద్, అక్మల్ లు క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడిన కారణంగా పాక్ బోర్డు వీరిని ఇంగ్లండ్ పర్యటనకు ఎంపిక చేయలేదు. అయితే దీనిపై మాట్లాడిన ఆఫ్రిది.. ఏ స్థాయి క్రికెటరైనా క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడితే ఎట్టిపరిస్థితుల్లోనూ రాజీ పడకూడదన్నాడు.