వన్డే వరల్డ్‌కప్-2023లో కనీసం సెమీస్ కూడా చేరకుండానే నిష్క్రమించిన పాకిస్తాన్ .. టీ20 ఫార్మాట్లో మాత్రం సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతోంది. ఎనిమిదో ఎడిషన్‌లో రన్నరప్‌తో సరిపెట్టుకున్న బాబర్ ఆజం బృందం.. ఈసారి తమ తలరాతను మార్చుకోవాలని పట్టుదలగా ఉంది.
అయితే, టీ20 ప్రపంచకప్-2024కు ముందు పాక్‌కు అన్నీ ఎదురుదెబ్బలే తగిలాయి. బాబర్ స్థానంలో షాహిన్ ఆఫ్రిది టీ20 కెప్టెన్‌గా రావడం.. ఈ క్రమంలో న్యూజిలాండ్‌తో సిరీస్‌లో 5-0తో వైట్‌వాష్ కావడం.. ఆ తర్వాత బాబర్ తిరిగి పగ్గాలు చేపట్టడం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి.
ఇదిలా ఉంటే.. పాక్ ఆటగాళ్ల ఫిట్‌నెస్‌పై విమర్శలు వెల్లువెత్తడంతో మిలిటరీ టైప్ ట్రెయినింగ్ రూపంలో పాక్ క్రికెట్ బోర్డు ప్రక్షాళన చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో మెగా టోర్నీ సన్నాహకాల్లో భాగంగా ఇంగ్లండ్‌తో ఇటీవల జరిగిన టీ20 సిరీస్‌లో కూడా పాక్ చిత్తుగా ఓడిపోయింది.
దమ్ముంటే ఈసారి వరల్డ్‌కప్ సాధించు
ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ అహ్మద్ షెహజాద్ బాబర్ ఆజంను ఉద్దేశించి ఘాటు విమర్శలు చేశాడు. దమ్ముంటే ఈసారి వరల్డ్‌కప్ గెలిచి చూపించాలంటూ సవాల్ విసిరాడు.
ఈ మేరకు.. ‘‘పాకిస్తాన్ క్రికెటర్ల క్రమశిక్షణ గురించి మాట్లాడాలంటే తెల్లారిపోతుంది. మనం ఎవరికీ ఎలాంటి సలహాలు ఇవ్వకూడదు.
అయితే, క్రికెట్ గురించి మాత్రం మాట్లాడొచ్చు కదా! జట్టులో కీలకమైన ఆటగాడిగా ఉన్నపుడు, నా కంటే ఎవరూ ఎక్కువ కాదనే భావనలో మునిగిపోయినపుడు.. వరల్డ్‌కప్ గెలిచి చూపించాలి.
ఇప్పటికే ఐదు టోర్నమెంట్లు ఆడినా.. మీలో మార్పు రాకపోతే ఎలా?’’ అంటూ ఓ టాక్ షోలో మాజీ బ్యాటర్ అహ్మద్ షెహజాద్ బాబర్ ఆజంపై పరోక్షంగా సెటైర్లు వేశాడు.
కాగా అమెరికా- వెస్టిండీస్ వేదికగా జరుగుతున్న వరల్డ్‌కప్-2024లో పాక్ జట్టు టీమిండియా, ఐర్లాండ్, కెనడా, యూఎస్‌ఏతో పాటు గ్రూప్-ఏలో ఉంది. జూన్ 6న యూఎస్‌ఏతో తమ తొలి మ్యాచ్ ఆడనుంది.
ప్రపంచకప్-2024: పాకిస్తాన్ జట్టు
బాబర్ ఆజం(కెప్టెన్), అబ్రార్ అహ్మద్, ఆజం ఖాన్, ఫఖర్ జమాన్, హారిస్ రవూఫ్, ఇఫ్తికర్ అహ్మద్, ఇమాద్ వసీం, మహ్మద్ అబ్బాస్ అఫ్రిది, మహ్మద్ అమీర్, మహ్మద్ రిజ్వాన్, నసీమ్ షా, సయీమ్ అయూబ్, షాదాబ్ ఖాన్, షాహీన్ షా అఫ్రిది, ఉస్మాన్ ఖాన్.
చదవండి: T20 WC 2024: ఈసారి ట్రోఫీ మాదే: సౌతాఫ్రికా కెప్టెన్
Comments
Please login to add a commentAdd a comment