కొలంబో : తొలి ఇన్నింగ్స్‌లో స్వల్ప స్కోరుకే కుప్పకూలిన పాకిస్తాన్ తమ రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం మెరుగ్గా ఆడుతోంది. ఓపెనర్ అహ్మద్ షెహజాద్ (154 బంతుల్లో 69; 4 ఫోర్లు; 1 సిక్స్), అజహర్ అలీ (152 బంతుల్లో 64 బ్యాటింగ్; 3 ఫోర్లు) అర్ధ సెంచరీలతో ఆకట్టుకోవడంతో శనివారం మూడో రోజు ఆట ముగిసే సమయానికి పాక్ 59 ఓవర్లలో రెండు వికెట్లకు 171 పరుగులు చేసింది. రెండో వికెట్‌కు వీరిద్దరు 120 పరుగులు జోడించారు. లంక తొలి ఇన్నింగ్స్ ఆధిక్యానికి ఇంకా పాక్ 6 పరుగులు వెనుకబడి ఉంది.
క్రీజులో అలీతో పాటు యూనిస్ (35 బంతుల్లో 23 బ్యాటింగ్; 3 ఫోర్లు) ఉన్నాడు. లంక తొలి ఇన్నింగ్స్‌లో 121.3 ఓవర్లలో 315 పరుగులకు ఆలౌట్ అయ్యి 177 పరుగుల ఆధిక్యం సాధించింది. యాసిర్ షాకు ఆరు వికెట్లు దక్కాయి.
కోలుకున్న పాకిస్తాన్
Published Sun, Jun 28 2015 12:40 AM | Last Updated on Sun, Sep 3 2017 4:28 AM
Advertisement