ఆసియాకప్-2023 కోసం 17 మంది సభ్యులతో కూడిన తమ జట్టును ఆఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఈ జట్టుకు హష్మతుల్లా షాహిదీ కెప్టెన్‌గా ఎంపిక అయ్యాడు. అదే విధంగా గాయం కారణంగా పాకిస్తాన్‌తో వన్డే సిరీస్‌కు దూరమైన స్టార్ ఆటగాళ్లు షరాఫుద్దీన్ అష్రఫ్, నజీబుల్లా జద్రాన్‌కు ఈ జట్టులో చోటు దక్కింది. అయితే స్టార్ పేసర్ నవీన్ ఉల్ హక్‌పై ఆఫ్గాన్ సెలక్టర్లు మరోసారి వేటు వేశారు.
అతడి ఆసియాకప్ జట్టులో చోటు దక్కలేదు. ఈ జట్టులో రషీద్ ఖాన్, మహ్మద్ నబీ,కరీం జనత్ వంటి అనుభవజ్ఞులైన ఆటగాళ్లు ఉన్నారు. కాగా ఈ ఏడాది ఆసియాకప్ ఆగస్టు 30 నుంచి ప్రారంభం కానుంది. వన్డే ఫార్మాట్‌లో జరగనున్న ఈ టోర్నీలో మొత్తం ఆరు జట్లుపాల్గొనబోతున్నాయి. పాకిస్తాన్, నేపాల్, భారత్ జట్లు గ్రూపు-ఏ లో ఉండగా.. ఆఫ్గానిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ గ్రూపు-బిలో ఉన్నాయి. కాగా నేపాల్ జట్టు తొలిసారి ఆసియాకప్ అర్హత సాధించింది.
పాకిస్తాన్ చేతిలో వైట్‌వాష్..
ఇక ఆసియాకప్ సన్నాహాకాల్లో భాగంగా పాకిస్తాన్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో ఆఫ్గాన్ ఓటమి పాలైంది. శ్రీలంక వేదికగా జరిగిన ఈ సిరీస్‌లో 3-0 తేడాతో ఆఫ్గాన్‌ను పాక్ వైట్ వాష్ చేసింది. అయితే సిరీస్ ఆఫ్గాన్ కోల్పోయనప్పటికీ.. కొంత మంది ఆటగాళ్లు మాత్రం తమ వ్యక్తిగత ప్రదర్శనలతో అకట్టుకున్నారు. ఇక ఆసియాకప్‌లో ఆఫ్గాన్ తమ తొలి మ్యాచ్‌లో సెప్టెంబర్ 3న బంగ్లాదేశ్‌తో తలపడనుంది.
ఆసియాకప్‌కు ఆఫ్గాన్ జట్టు
హష్మతుల్లా షాహిదీ (కెప్టెన్), రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), ఇబ్రహీం జద్రాన్, రహ్మత్ షా, నజీబుల్లా జద్రాన్, మొహమ్మద్ నబీ, రియాజ్ హసన్, ఇక్రమ్ అలీ ఖిల్, గుల్బాదిన్ నాయబ్, కరీం జనత్, అబ్దుల్ రెహమాన్, రషీద్ ఖాన్, షరఫుద్దీన్ ఉర్ రహ్ అష్రఫ్, సులిమాన్ సఫీ, ఫజల్హాక్ ఫరూఖీ, నూర్ అహ్మద్
చదవండి: #Neeraj Chopra:13 ఏళ్ల వయస్సులోనే ఎన్నో అవమానాలు.. అయినా వరల్డ్ ఛాంపియన్! నీరజ్ 'బంగారు' కథ
Comments
Please login to add a commentAdd a comment