ఐపీఎల్-2023లో ఆర్సీబీ-లక్నో మధ్య జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లి, నవీన్ ఉల్‌హక్ మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ విషయాన్ని కోహ్లి అక్కడితోనే విడిచి పెట్టగా.. నవీన్ ఉల్ హక్ మాత్రం ఏదో విధంగా విరాట్‌ను గెలుకుతున్నాడు. తాజాగా నవీన్ మరోసారి తన వంకర బుద్ధిని చాటుకున్నాడు.
విరాట్ కోహ్లిని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో నవీన్ ఓ పోస్ట్ చేశాడు. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓటమి పాలైంది. దీంతో ఈ ఏడాది క్యాష్‌రిచ్ లీగ్ నుంచి ఆర్సీబీ ఇంటిముఖం పట్టింది. ఈ క్రమంలో ఆర్సీబీ ఓటమి పాలవ్వగానే.. నవీన్ ఉల్ హక్ తన ఇనాస్టాగ్రామ్‌లో ఓ క్రిప్టిక్ స్టోరీ పోస్టు చేశాడు.
అది కోహ్లితో పాటు ఆర్సీబీ జట్టును ఎగతాళి చేసినట్లు ఉంది. అయితే కోహ్లిని హేళన చేసిన నవీన్ ఉల్‌హక్‌ను ఆర్సీబీ ఫ్యాన్స్ ఓ ఆటాడేసుకుంటున్నారు. సోషల్ మీడియాలో దారుణంగా ట్రోలు చేస్తున్నారు. చీ మరి ఇంత దారుణమా.. నీవు అస్సలు మనిషివేనా అంటూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.
కాగా మే20న కేకేఆర్, లక్నో మధ్య జరిగిన మ్యాచ్‌లో నవీన్‌ను కూడా కోహ్లి అభిమానులు టార్గెట్ చేశారు. నవీన్-ఉల్-హక్ బౌలింగ్‌కు వచ్చినపుడు ప్రేక్షకులు ``కోహ్లీ.. కోహ్లీ..`` అని కేకలు వేసి తమ నిరసనను తెలియజేశారు. కోహ్లీ అభిమానుల చర్యతో తీవ్ర ఆగ్రహానికి గురైన నవీన్ ఉల్ హక్.. ``గప్ చుప్`` అని సైగలు చేస్తూ నోటిపై వేలు వేసి సైలంట్‌గా ఉండాలని ఫ్యాన్స్‌ను సూచించాడు.
కింగ్ పోరాటం వృథా
కాగా గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లి అద్బుత పోరాటం వృథా మిగిలిపోయింది. ఈ మ్యాచ్‌లో విరాట్ సెంచరీతో చెలరేగాడు. 61 బంతులు ఎదుర్కొన్న కోహ్లి 13 ఫోర్లు, 1 సిక్స్‌తో 101 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు.
జట్టులో మిగితా బ్యాటర్లందరూ విఫలమైనప్పటికీ.. కోహ్లి మాత్రం తన అద్భుత ఇన్నింగ్స్‌తో 197 పరుగుల భారీ స్కోర్‌ను అందించాడు. దురదృష్టవశాత్తూ బౌలర్లు లక్ష్యాన్ని కాపాడుకోవడంలో విఫలమకావడంతో ఆర్సీబీ ఈ మెగా టోర్నీ నుంచి నిష్క్రమించింది.
చదవండి: #Virat Kohli: కన్నీరు పెట్టుకున్న కోహ్లి.. ఓడినా పర్వాలేదు! ఎప్పటికీ నీవు మా కింగ్‌వే!
Naveen Ul Haq posted this video on his Instagram after RCB lost the match#RCBvsGT pic.twitter.com/FCaF41IMnM
— Gems of Shorts (@Warlock_Shabby) May 21, 2023
The moment King Kohli created history:
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 21, 2023
7th IPL century - an absolute GOAT..!! pic.twitter.com/NMwjLp5rjE
Comments
Please login to add a commentAdd a comment