ఐపీఎల్-2023లో భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి, ఆఫ్గానిస్తాన్ పేసర్ నవీన్ ఉల్ హక్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ గొడవలో లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్ గౌతం గంభీర్ జోక్యం చేసుకోవడంతో మరింత పెద్దదైంది.
ఇక ఈ విషయాన్ని కోహ్లి అక్కడితోనే విడిచి పెట్టగా.. నవీన్ మాత్రం సోషల్ మీడియాలో విరాట్‌నే టార్గెట్ చేస్తూ వచ్చాడు. ఈ క్రమంలో కింగ్ కోహ్లి అభిమానులు ఓ ఆట ఆడేసుకున్నారు. అతడు ఎక్కడ కనిపించిన కోహ్లి కోహ్లి అంటూ గట్టిగా అరుస్తూ చుక్కలు చూపించారు. ఇక ఈ వివాదంపై నవీన్ ఉల్ హక్ తాజాగా స్పందించాడు. తాను అసలు గొడవే పడలేదని, కోహ్లీనే గొడవ మొదలు పెట్టాడంటూ సంచలన వాఖ్యలు చేశాడు.
' మ్యాచ్ సమయంలో విరాట్ అన్ని మాటలు అనకుండా ఉండాల్సింది. నేను ఈ గొడవను ప్రారంభించలేదు. మ్యాచ్ అనంతరం మేం షేక్‌హ్యాండ్స్ ఇచ్చేటప్పుడు కోహ్లి మళ్లీ గొడవను ప్రారంభించాడు. మాపై పడిన ఫైన్‌లు చూస్తే మీకు చూస్తే తప్పు ఎవరిదో అర్థం అవుతుంది. ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నేను సాధారణంగా ఎవరినీ స్లెడ్జ్ చేయను.
ఒక వేళ చేయాలనుకున్న నేను బౌలర్‌ను కాబట్టి బ్యాటర్‌లకు మాత్రమే చేస్తా. ఆ మ్యాచ్‌లో నేను ఒక్క మాట కూడా మాట్లాడలేదు. నేను ఎవరినీ స్లెడ్జ్ చేయలేదు. నేను పరిస్థితిని ఎలా ఎదుర్కొన్నానో అక్కడ ఉన్న ఆటగాళ్లకు తెలుసు. నేను బ్యాటింగ్ చేస్తున్నప్పుడు గానీ మ్యాచ్ తర్వాత గానీ సహనం కోల్పోలేదు. అక్కడ నా తప్పులేదని అందరికీ తెలుసు. నేనే షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు కోహ్లినే నా చెయ్యి గట్టిగా పట్టుకున్నాడు. నేను కూడా మనిషినే కదా రియాక్ట్ అవ్వక తప్పలేదు' అని చెప్పాడు.
చదవండి: Ashes 2023: విచిత్రకర రీతిలో ఔటైన హ్యరీ బ్రూక్.. అస్సలు ఊహించుండడు! వీడియో వైరల్
Comments
Please login to add a commentAdd a comment