PC: IPL.com(రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు)
ఐపీఎల్-2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరో కీలక పోరుకు సిద్దమైంది. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా సోమవారం(మార్చి 25) చిన్నస్వామి స్టేడియం వేదికగా పంజాబ్ కింగ్స్‌తో ఆర్సీబీ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి బోణీ కొట్టాలని ఆర్సీబీ వ్యూహాలు రచిస్తోంది. ఈ క్రమంలో పంజాబ్‌తో మ్యాచ్‌కు ఆర్సీబీ మెనెజ్‌మెంట్ తమ తుది జట్టులో పలు మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది.
తొలి మ్యాచ్‌లో విఫలమైన మిడిలార్డర్ బ్యాటర్ రజిత్ పాటిదార్, అల్జారీ జోషఫ్‌పై వేటు వేయనున్నట్లు సమాచారం. పాటిదార్ స్ధానంలో సుయాష్ ప్రభుదేసాయి, జోషఫ్ స్ధానంలో కివీస్ స్టార్ పేసర్ లాకీ ఫెర్గూసన్ తుది జట్టులోకి రానున్నట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొన్నాడు. కాగా సీఎస్‌కేతో జరిగిన తొలి మ్యాచ్‌లో పాటిదార్ డకౌట్ కాగా.. పేసర్ జోషఫ్ దారుణంగా విఫలమయ్యాడు.
3. 4 ఓవర్లు బౌలింగ్ చేసిన ఈ కరేబియన్ ఫాస్ట్ బౌలర్.. వికెట్ ఏమీ తీయకుండా 38 పరుగులిచ్చాడు. ఈ క్రమంలోనే పాటిదార్, జోషఫ్‌ను ఆర్సీబీ పక్కన పెట్టాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా ఐపీఎల్-2024 మినీవేలంలో జోషఫ్‌ను రూ.11. 50 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. ఇక ఈ మ్యాచ్‌లో పేసర్ యాష్ దయాల్‌ను ఆర్సీబీ ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఉపయోగించుకునే అవకాశముంది.
ఆర్సీబీ తుది జట్టు(అంచనా)
విరాట్ కోహ్లి, ఫాఫ్ డు ప్లెసిస్, సుయాష్ ప్రభుదేసాయి, గ్లెన్ మాక్స్‌వెల్, కామెరాన్ గ్రీన్, అనుజ్ రావత్ (వికెట్ కీపర్), దినేష్ కార్తీక్, లాకీ ఫెర్గూసన్, మయాంక్ దాగర్, కరణ్ శర్మ, మహ్మద్ సిరాజ్.
Comments
Please login to add a commentAdd a comment