IPL 2024: ఆర్సీబీ ఈసారైన కప్‌ కొడుతుందా? | RCB IPL 2024 squad analysis: Strengths, Weaknesses | Sakshi
Sakshi News home page

IPL 2024: ఆర్సీబీ ఈసారైన కప్‌ కొడుతుందా?

Published Thu, Mar 14 2024 1:29 PM | Last Updated on Thu, Mar 14 2024 2:45 PM

RCB IPL 2024 squad analysis: Strengths, weaknesses - Sakshi

రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు(ఆర్సీబీ).. ఇప్పటివరకు ఐపీఎల్‌ టైటిల్‌ను గెలవకపోయిన జట్లలో ఒకటి. ప్రతీసీజన్‌లోనూ ఎన్నో అంచనాలతో బరిలోకి దిగడం.. ఆఖరికి బొక్కాబోర్లా పడడం ఆర్సీబీకి అలవాటుగా మారిపోయింది. ఐపీఎల్‌ మొదటి సీజన్ నుంచి ఆర్సీబీకి టైటిల్‌ అందని ద్రాక్ష లాగానే మిగిలిపోయింది.

కానీ ఆర్సీబీ ఫ్యాన్ ఫాలోయింగ్‌ మాత్రం ఏ మాత్రం తగ్గలేదు. ప్రతీ ఏడాది 'ఈసాలా కప్ నమ్దే' అంటూ సందడి చేస్తూంటారు. తమ ఆరాద్య జట్టు ఎప్పుడు టైటిల్‌ను ముద్దాడుతుందా అని వెయ్యికళ్లుతో ఎదురుచూస్తుంటారు. ఇప్పుడు ఐపీఎల్‌-2024 సీజన్‌కు సమయం అసన్నం కావడంతో అభిమానుల సందడి మొదలైపోయింది. ఆర్సీబీ కనీసం ఈసారైనా అభిమానుల కలను నెరవేరుస్తుందా?

గతం ఇలా..
ఈ క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో 2008 ఆరంభ సీజన్‌ నుంచి ఆర్సీబీ ఇప్పటివరకు మూడు సార్లు ఫైనల్‌కు చేరింది. కానీ మూడు సార్లు కూడా ఆఖరి మెట్టుపై బోల్తా పడింది. 2009లో తొలిసారి ఐపీఎల్‌ ఫైనల్‌కు చేరిన బెంగళూరు.. ఫైనల్లో డెక్కన్‌ ఛార్జర్స్‌ హైదరాబాద్‌ చేతిలో ఓడిపోయింది.

అనంతరం 2011 సీజన్‌లో తుదిపోరుకు అర్హత సాధించిన ఆర్సీబీ.. చెన్నైసూపర్‌ కింగ్స్‌ చేతిలో ఓటమిపాలై రన్నరప్‌తో సరిపెట్టుకుంది. అనంతరం 2016 సీజన్‌లో విరాట్‌ కోహ్లి సారథ్యంలో వరుస విజయాలతో ఆర్సీబీ ఫైనల్‌కు దూసుకెళ్లింది. కానీ మళ్లీ హైదరాబాద్‌ ఫ్రాంచైజీ చేతిలోనే పరభావం ఎదురైంది. ఆ తర్వాత 2017, 2018,19 సీజన్లలో దారుణంగా విఫలమైన ఆర్సీబీ.. వరుసగా 2020,21,22 సీజన్లలో ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది.

కొత్త కెప్టెన్‌ వచ్చినా అదే తీరు..
ఐపీఎల్ 2021 తర్వాత విరాట్ కోహ్లీ ఆర్సీబీ సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. ఆ తర్వాత తమ నూతన కెప్టెన్‌గా దక్షిణాఫ్రికా స్టార్‌ ఫాఫ్ డుప్లెసిస్‌ను బెంగళూరు ఫ్రాంచైజీ నియమించింది. డుప్లెసిస్‌ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తొలి సీజన్‌లోనే ఆర్సీబీనిప్లే ఆఫ్స్‌కు చేర్చాడు. కానీ టైటిల్‌నుఅందించలేకపోయాడు. ఐపీఎల్‌-2022 సీజన్ క్వాలిఫెయర్1లో రాజస్తాన్‌ రాయల్స్‌ చేతిలో ఆర్సీబీ ఓటమి పాలైంది. అనంతరం 2023 సీజన్‌లో ఆర్సీబీ పేలవ ప్రదర్శన కనబరిచి ఆరోస్ధానానికే పరిమితమైంది.

బలాలు.. 
ఆర్సీబీ బ్యాటింగ్‌ పరంగా చాలా పటిష్టంగా కన్పిస్తోంది. ప్రస్తుత జట్టులో విరాట్‌ కోహ్లి, ఫాప్‌ డుప్లెసిస్‌, మాక్స్‌వెల్‌ వంటి వరల్డ్‌క్లాస్‌ క్రికెటర్లు ఉన్నారు. వీరికి ఈ ఏడాది సీజన్‌లో ఆసీస్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ కామెరాన్ గ్రీన్ తోడవ్వడం ఆర్సీబీ బ్యాటింగ్‌ విభాగం మరింత బలంగా మారింది.  గ్రీన్‌కు బౌలింగ్‌, బ్యాటింగ్‌లో రాణించే సత్తా ఉంది.

గత సీజన్‌లో ఓపెనర్లుగా కోహ్లి, డుప్లెసిస్‌ అద్బుతమైన ఆరంభాలను అందించారు. ఈ సారి కూడా ఈ స్టార్‌ జోడీ చెలరేగితే ప్రత్యర్ధి జట్లకు కష్టాలు తప్పవు. ఇక బౌలింగ్‌ పరంగా కూడా ఆర్సీబీ బలంగా కన్పిస్తోంది.  మహ్మద్ సిరాజ్‌ పేస్‌ బౌలింగ్‌ అటాకింగ్‌కు నాయకత్వం వహిస్తాడు.

గతేడాది సీజన్‌లో సిరాజ్‌ అద్బుతంగా రాణించాడు. అతడితో పాటు ఈ ఏడాది సీజన్‌లలో కివీస్‌ స్పీడ్‌ స్టార్‌ లూకీ ఫెర్గూసన్‌, విండీస్‌ పేస్‌ బౌలర్‌ జోషఫ్‌, టామ్‌ కుర్రాన్‌ వంటి వారు కొత్తగా ఆర్సీబీలో చేరారు. దీంతో ఆర్సీబీ బ్యాటింగ్‌, బౌలింగ్‌ పరంగా సమతూకుంగా కన్పిస్తోంది.

బలహీనతలు..
అయితే ఆర్సీబీకి ప్రధాన బలహీనత.. బెంచ్‌ బలం. ఆర్సీబీ బెంచ్‌ స్ట్రెంగ్త్‌ బలంగా లేదు. బెంగళూరు ప్రతీ సీజన్‌లోనూ ఒకే ప్లేయింగ్‌ ఎలెవన్‌పై ఆధారపడుతూ వస్తోంది. పెద్దగా మార్పులు చేయరు. దానికి కారణం బెంచ్‌లో సరైన ఆటగాళ్లు లేకపోవడమే. ఈ సారి కూడా ఆర్సీబీ ఫారన్‌ ఆటగాళ్లపైనే ఎక్కువగా ఫోకస్‌ పెట్టింది.  మనోజ్ భాండాగే, సౌరవ్‌ చౌహాన్‌ వంటి స్వదేశీ ఆటగాళ్లను ఆర్సీబీ సొంతం చేసుకున్నప్పటికీ.. వీరివ్వరికీ పెద్దగా అనుభవం లేదు.

అంతేకాకుండా  గత కొన్ని సీజన్లగా జట్టులో కొనసాగుతున్న అనుజ్‌ రావత్‌ కూడా పెద్దగా అకట్టుకోలేకపోయాడు. కానీ ఆర్సీబీ ఈ సారి కూడా అతడిని రీటైన్‌ చేసుకుంది. రావత్‌ ఇప్పటివరకు 19 ఐపీఎల్‌ మ్యాచ్‌ల్లో కేవలం ఒక్కసారి మాత్రమే ఫిప్టీ ప్లస్‌ స్కోర్లను సాధించాడు. గత సీజన్‌లో మరో యువ ఆటగాడు మహిపాల్ లోమ్రోర్‌పై కూడా ఆర్సీబీ భారీగా ఆశలు పెట్టుకుంది.

కానీ మహిపాల్‌ ఆర్సీబీ అంచనాలను అందుకోలేకపోయాడు. మరోయువ ఆటగాడు  సుయాష్ ప్రభుదేశాయ్ పరిస్ధితి కూడా అంతంతమాత్రమే. మరోవైపు వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ దినేష్‌ కార్తీక్‌పైనే అందరి దృష్టి నెలకొంది. తన కెరీర్‌లో చివరి ఐపీఎల్‌ ఆడనున్న కార్తీక్‌ ఎలా రాణిస్తాడో అని అతృతగా ఎదురుచూస్తున్నారు.

గత సీజన్‌లో అయితే కార్తీక్‌ దారుణమైన ప్రదర్శన కనబరిచాడు. కార్తీక్‌కు మినహా సరైన వికెట్‌ కీపర్‌ కూడా ఆర్సీబీలో లేడు. ఇక  ఆర్సీబీ స్పిన్‌ విభాగంలో పేలవంగా కన్పిస్తోంది. అంతర్జాతీయ స్ధాయిలో అనుభవం ఉన్న ఒక్క స్పిన్నర్‌ కూడా ఆర్సీబీలో లేడు. మ్యాక్సీ ఉన్నప్పటికీ పార్ట్‌టైమ్‌ బౌలర్‌గా మాత్రమే అందుబాటులో ఉంటాడు. ఇక  ఐపీఎల్‌-2024లో ఆర్సీబీ తమ తొలి మ్యాచ్‌లో మార్చి 22న చెన్నై సూపర్‌ కింగ్స్‌తో తలపడనుంది.

ఆర్సీబీ జట్టు:
ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), గ్లెన్ మాక్స్‌వెల్, విరాట్ కోహ్లీ, కామెరాన్ గ్రీన్, రజత్ పాటిదార్, అనుజ్ రావత్, దినేష్ కార్తీక్, సుయాష్ ప్రభుదేశాయ్, విల్ జాక్స్, మహిపాల్ లోమ్రోర్, కర్ణ్ శర్మ, మనోజ్ భాండాగే, మయాంక్ దాగర్, వైషక్ విజయ్‌కుమార్, మొహమ్‌ద్, ఆకాష్ దీప్, మొహమ్‌ద్ సిరాజ్, రీస్ టాప్లీ, హిమాన్షు శర్మ, రాజన్ కుమార్, అల్జారీ జోసెఫ్, యష్ దయాల్, టామ్ కర్రాన్, లాకీ ఫెర్గూసన్ మరియు స్వప్నిల్ సింగ్.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement