క్రికెట్ అభిమానులు ఏంతో ఆతృతగా ఎదురుచూస్తున్న ఐపీఎల్-2024 సమరానికి సమయం అసన్నమైంది. మరో 24 గంటల్లో క్రికెట్ మహాసంగ్రామానికి తెరలేవనుది. తొలి మ్యాచే అభిమానులకు అసలు సిసలైన క్రికెట్ మజా అందనించనుంది.
మార్చి 22న చెపాక్ వేదికగా జరగనున్న తొలి పోరులో చెన్నై సూపర్ కింగ్స్, ఆర్సీబీ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి శుభారంభం చేయాలని ఇరు జట్లు ఊవ్విళ్లరూతున్నాయి. ఈ క్రమంలో ఇరు జట్ల బలబలాలపై ఓ లుక్కేద్దం
చెన్నై సూపర్ కింగ్స్..
ఐపీఎల్‌లో తిరిగులేని జట్టుగా పేరొందిన చెన్నై సూపర్ కింగ్స్.. ఇప్పుడు మరోసారి తమ సత్తాచాటేందుకు సిద్దమైంది. ఈ ఏడాది సీజన్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్‌గా బరిలోకి దిగనున్న సీఎస్‌కే.. ప్రత్యర్ధి జట్లను చిత్తు చేసేందుకు వ్యూహాలు రచిస్తోంది.
కాగా సీఎస్‌కే ప్రధాన బలం ఆ జట్టు కెప్టెన్ ఎంఎస్ ధోని. ఎటువంటి క్లిష్ట పరిస్థితులోనైనా ప్రత్యర్ధి జట్టును తన వ్యూహాలతో చిత్తు చేయడం ధోని స్పెషల్. ఇప్పటికే రికార్డు స్ధాయిలో ఐదు సార్లు సీఎస్‌కేను విజేతగా నిలిపాడు. ఇప్పుడు ఆరోసారి తన జట్టుకు టైటిల్‌ను అందించాలని మిస్టర్ కూల్ భావిస్తున్నాడు. ఇక సీఎస్‌కే బ్యాటింగ్ పరంగా పటిష్టంగా కన్పిస్తోంది.
అయితే స్టార్ ఓపెనర్ డెవాన్ కాన్వే దూరం కావడం సీఎస్‌కేను కాస్త కలవరపెట్టే విషయం అనే చెప్పుకోవాలి. గతేడాది సీఎస్‌కే ఛాంపియన్స్‌గా నిలవడంలో కాన్వేది కీలక పాత్ర. కాగా కాన్వే స్ధానాన్ని మరో కివీ స్టార్ రచిన్ రవీంద్ర భర్తీ చేసే ఛాన్స్ ఉంది. వేలంలో రవీంద్రతో పాటు డార్లీ మిచెల్‌ను సీఎస్‌కే కొనుగోలు చేసింది. కాబట్టి కాన్వే లేని లోటు వీరిద్దరిలో ఎవరో ఒకరు భర్తీ చేసే అవకాశముంది.
రవీంద్ర, రుత్‌రాజ్ గైక్వాడ్ కలిసి చెన్నై ఇన్నింగ్స్‌ను ప్రారంభించే సూచనలు కన్పిస్తున్నాయి. అదే విధంగా మిడిలార్డర్‌లో రహానే, దుబే వంటి కీలక ఆటగాళ్లు ఉన్నారు. గత సీజన్‌లో వీరిద్దరూ అద్బుతమైన ప్రదర్శనలు కనబరిచారు. ఆఖరిలో ధోని, జడేజా వంటి హిట్టర్లు జట్టులో ఉన్నారు. అంతేకాకుండా శార్ధూల్ ఠాకూర్ మళ్లీ సీఎస్‌కేలో రావడం ఆ జట్టుకు కలిసిచ్చే ఆంశం. శార్ధూల్‌కు బ్యాట్‌తో పాటు బంతితో కూడా రాణించే సత్తా ఉంది.
కాగా ఈ ఏడాది సీజన్‌లో బౌలింగ్ పరంగా సీఎస్‌కే కాస్త వీక్‌గా కన్పిస్తోంది. గతేడాది సీజన్‌లో అదరగొట్టిన యువ పేసర్ మతీషా పతిరాన గాయం కారణంగా ఐపీఎల్-2024కు దూరమయ్యాడు. అతడు దూరం కావడం సీఎస్‌కే నిజంగా గట్టి ఎదురుదెబ్బే. ప్రస్తుత సీఎస్‌కే జట్టులో పెద్దగా అనుభవమున్న బౌలర్ ఒక్కడు కూడా కన్పించడం లేదు. ముస్తిఫిజర్ రెహ్మన్, థీక్షణ వంటి బౌలర్లు ఉన్నప్పటికీ.. ఇటీవల కాలంలో వారి ప్రదర్శన అంతంతమాత్రమే. కాబట్టి మరోసారి భారత యువ బౌలర్లు ముఖేష్ చౌదరి, సిమ్రాజత్ సింగ్‌పై సీఎస్‌కే ఆధారపడే ఛాన్స్ ఉంది.
ఆర్సీబీ..
గత 16 ఏళ్ల టైటిల్ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న జట్లలో ఆర్సీబీ ఒకటి. ప్రతీ సీజన్‌లోనూ జట్టు నిండా స్టార్ క్రికెటర్లు ఉన్నప్పటికీ ఒక్కసారి కూడా ట్రోఫీని ఆర్సీబీ ముద్దాడలేకపోయింది. ఈ సారి ఎలాగైనా గెలిచి తమ 16 ఏళ్ల నిరీక్షణకు తెరదించాలని బెంగళూరు పట్టుదలతో ఉంది.
ప్రతీసీజన్‌లానే ఈ సారి కూడా ఆర్సీబీ స్టార్ ఆటగాళ్లతో కూడా కలకలడుతోంది. బ్యాటింగ్ బౌలింగ్ పరంగా పటిష్టంగా కన్పిస్తోంది. బ్యాటింగ్ విభాగంలో ఫాప్ డుప్లెసిస్,విరాట్ కోహ్లి, మ్యాక్స్‌వెల్, గ్రీన్, విల్ జాక్స్ వంటి విధ్వంసకర ఆటగాళ్లు ఉన్నారు. బౌలింగ్‌లో సిరాజ్, టోప్లీ జోషఫ్, ఫెర్గూసన్, టామ్ కుర్రాన్ వంటి వరల్డ్‌క్లాస్ ఫాస్ట్ బౌలర్లు ఉన్నారు. అయితే ఆర్సీబీలో మాత్రం చెప్పుకోదగ్గ స్పిన్నర్ మాత్రం లేడు.
హెడ్ టూ హెడ్ రికార్డులు..
ఈ క్యాష్‌రిచ్ లీగ్‌లో ఆర్సీబీపై సీఎస్‌కే అద్భుతమైన ట్రాక్ రికార్డు ఉంది. ఇరు జట్లు ఐపీఎల్‌లో 31 సార్లు ఎదురెదురుపడగా.. సీఎస్‌కే 20, ఆర్సీబీ 10 సందర్భాల్లో విజయం సాధించాయి. ఓ మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. కాగా మ్యాచ్ జరిగే చెపాక్‌లో మాత్రం ఆర్సీబీకి చెత్త రికార్డు ఉంది. చెపాక్ లో చెన్నై జట్టుపై ఇప్పటివరకు 8 మ్యాచ్‌లు ఆడితే ఆర్సీబీ కేవలం ఒక్క మ్యాచ్ లోనే గెలిచి.. 7 మ్యాచ్ ల్లో ఓడిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment