ఐపీఎల్-2024లో చెన్నై సూపర్ కింగ్స్ బోణీ కొట్టింది. చెపాక్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో సీఎస్‌కే విజయం సాధించింది. 174 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్‌కే కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 18.4 ఓవర్లలో ఛేదించింది. కాగా ఈ మ్యాచ్‌లో సీఎస్‌కే స్టార్ ఎంఎస్ ధోనికి బ్యాటింగ్ చేసే అవకాశం రానప్పటికీ.. వికెట్ కీపింగ్‌లో మాత్రం తన క్లాస్‌ను చూపించాడు.
మిస్టర్ కూల్ రెండు క్యాచ్‌లతో పాటు ఓ రనౌట్‌లో భాగమయ్యాడు. ధోని వికెట్ కీపింగ్ స్కిల్స్‌కు ఫ్యాన్స్ మరోసారి ఫిదా అయిపోయారు. మ్యాచ్‌లో చాలా వరకు ఎక్స్‌ట్రాస్ వెళ్లకుండా తన గ్లౌవ్ వర్క్‌తో అడ్డుకున్న ఎంఎస్.. ఆర్సీబీ ఇన్నింగ్స్ ఆఖరి బంతికి అద్భుతమైన రనౌట్ చేశాడు. ఆర్సీబీ ఇన్నింగ్స్ 20వ ఓవర్ వేసిన తుషార్ దేశ్‌పాండే బౌలింగ్‌లో ఆఖరిబంతికి దినేష్ కార్తీక్ షాట్ ఆడటానికి ప్రయత్నించాడు.
అయితే బంతి మిస్స్ అయ్యి వికెట్ కీపర్ ధోని చేతికి వెళ్లింది. ఈ క్రమంలో కార్తీక్ బై రన్ కోసం పరిగెత్తమని నాన్ స్ట్రైక్‌లో ఉన్న అనుజ్ రావత్‌కు సిగ్నల్ ఇచ్చాడు. అనుజ్ రావత్ స్ట్రైకర్ ఎండ్‌వైపు వచ్చేలోపే ధోని స్టంప్స్‌ను గిరాటేశాడు. దీంతో రావత్ రనౌటయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు అక్కడ ఉన్నది ధోని.. కొంచెం చూసి వెళ్లాలిగా అంటూ కామెంట్లు చేస్తున్నారు.
THE DHONI MAGIC AT THE AGE OF 42. 🔥🤯pic.twitter.com/yRRzcqzMmi
— Johns. (@CricCrazyJohns) March 22, 2024
Comments
Please login to add a commentAdd a comment