బోణీ కొట్టిన చెన్నై..
ఐపీఎల్-2024లో చెన్నై సూపర్ కింగ్స్ బోణీ కొట్టింది. చెపాక్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో సీఎస్‌కే విజయం సాధించింది. 174 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్‌కే కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 18. 4 ఓవర్లలో ఛేదించింది. సీఎస్‌కే బ్యాటర్లలో రచిన్ రవీంద్ర(37) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. శివమ్ దూబే(34), రవీంద్ర జడేజా(25) ఆజేయంగా నిలిచి మ్యాచ్‌ను ఫినిష్ చేశారు.
ఆర్సీబీ బౌలర్లలో గ్రీన్ రెండు వికెట్లు పడగొట్టగా.. కరణ్ శర్మ, దయాల్ తలా ఒక్క వికెట్ పడగొట్టారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ ర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. 71 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన ఆర్సీబీని అనుజ్ రావత్(48), దినేష్ కార్తీక్(38 నాటౌట్) తమ అద్బుత ఇన్నింగ్స్‌లతో అదుకున్నారు.
నాలుగో వికెట్ కోల్పోయిన సీఎస్‌కే..
డార్లీ మిచెల్ రూపంలో సీఎస్‌కే నాలుగో వికెట్ కోల్పోయింది. 22 పరుగులు చేసిన రహానే.. గ్రీన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 13 ఓవర్లకు సీఎస్‌కే స్కోర్: 114/4. సీఎస్‌కే విజయానికి ఇంకా 42 బంతుల్లో 60 పరుగులు కావాలి.
సీఎస్‌కే మూడో వికెట్ డౌన్..
అజింక్యా రహానే రూపంలో సీఎస్‌కే మూడో వికెట్ కోల్పోయింది. 27 పరుగులు చేసిన రహానే.. గ్రీన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 12 ఓవర్లకు సీఎస్‌కే స్కోర్: 109/3
రెండో వికెట్ డౌన్..
సీఎస్‌కే రెండో వికెట్ కోల్పోయింది. 37 పరుగులు చేసిన కెప్టెన్ రచిన్ రవీంద్ర.. కరణ్ శర్మ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. క్రీజులోకి డార్లీ మిచెల్ వచ్చాడు. 7 ఓవర్లకు సీఎస్‌కే స్కోర్: 71/2
తొలి వికెట్ కోల్పోయిన సీఎస్‌కే..
174 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్‌కే తొలి వికెట్ కోల్పోయింది. 15 పరుగులు చేసిన కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్.. యశ్‌దయాల్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. క్రీజులోకి రహానే వచ్చాడు. 4 ఓవర్లకు సీఎస్‌కే స్కోర్: 38/1
చెలరేగిన రావత్, కార్తీక్.. సీఎస్‌కే టార్గెట్ 174 పరుగులు
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. 71 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన ఆర్సీబీని అనుజ్ రావత్(48), దినేష్ కార్తీక్(38 నాటౌట్) తమ అద్బుత ఇన్నింగ్స్‌లతో అదుకున్నారు. వీరితో పాటు కెప్టెన్ డుప్లెసిస్(35) పరుగులతో రాణించాడు. సీఎస్‌కే బౌలర్లలో ముస్తుఫిజర్ రెహ్మాన్ నాలుగు వికెట్లు పడగొట్టాడు.
18 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్: 148/5
71 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన ఆర్సీబీని అనుజ్ రావత్(26 ), దినేష్ కార్తీక్(41) అదుకున్నారు. వీరిద్దరూ ఆరో వికెట్‌కు 70 పరుగుల ఆజేయ భాగస్వామ్యం నెలకొల్పారు. 18 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్: 148/5
16 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్: 116/5
కష్టాల్లో పడిన ఆర్సీబీ ఇన్నింగ్స్‌ను దినేష్ కార్తీక్(20), రావత్(18) చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. వీరిద్దరూ ఆరో వికెట్‌కు 38 పరుగుల ఆజేయ భాగస్వామ్యం నెలకొల్పారు. 16 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్: 116/5
71 పరుగులకే 5 వికెట్లు..
సీఎస్‌కే పేసర్ ముస్తఫిజర్ రెహ్మాన్ ఆర్సీబీని కోలుకోలేని దెబ్బ కొట్టాడు. అతడి దెబ్బకు ఆర్సీబీ 71 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఒకే ఓవర్‌లో ముస్తఫిజర్.. విరాట్ కోహ్లి,గ్రీన్‌లను ఔట్ చేశాడు. క్రీజులోకి దినేష్ కార్తీక్ వచ్చాడు.
నాలుగో వికెట్ డౌన్.. కోహ్లి ఔట్
విరాట్ కోహ్లి రూపంలో ఆర్సీబీ నాలుగో వికెట్ కోల్పోయింది. 21 పరుగులు చేసిన కోహ్లి.. ముస్తఫిజర్ రెహ్మాన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. బౌండరీ లైన్ వద్ద అద్బుత క్యాచ్‌తో రహానే, రవీంద్ర కలిసి కోహ్లిని పెవిలియన్‌కు పంపారు. క్రీజులోకి అనుజ్ రావత్ వచ్చాడు.
ఆర్సీబీకి బిగ్ షాక్.. వరుసగా 3 వికెట్లు
ఆర్సీబీ వరుసగా మూడు వికెట్లు కోల్పోయింది. ఆర్సీబీ ఇన్నింగ్స్ ఐదో ఓవర్ వేసిన ముస్తఫిజర్ రెహ్మాన్ బౌలింగ్‌లో డుప్లెసిస్, పాటిదార్ పెవిలియన్‌కు చేరగా.. ఆరో ఓవర్ వేసిన దీపక్ చాహర్ బౌలింగ్‌లో గ్లెన్ మాక్స్‌వెల్ ఔటయ్యాడు. 7 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్: 48/3, క్రీజులో విరాట్ కోహ్లి(6), గ్రీన్(4) ఉన్నారు.
రెండో వికెట్ డౌన్..
ఆర్సీబీ రెండో వికెట్ కోల్పోయింది. మిడిలార్డర్ బ్యాటర్ రజిత్ పాటిదార్ తీవ్రంగా నిరాశపరిచాడు. ఖాతా తెరవకుండానే పాటిదార్.. రెహ్మన్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. క్రీజులోకి మాక్స్‌వెల్ వచ్చాడు.
తొలి వికెట్ కోల్పోయిన ఆర్సీబీ.. డుప్లెసిస్ ఔట్
41 పరుగుల వద్ద ఆర్సీబీ తొలి వికెట్ కోల్పోయింది. దూకుడుగా ఆడుతున్న కెప్టెన్ డుప్లెసిస్(8 ఫోర్లు) తొలి వికెట్‌గా వెనుదిరిగాడు. ముస్తఫిజర్ రెహ్మాన్ బౌలింగ్‌లో రవీంద్రకు క్యాచ్ ఇచ్చి ఫాప్ ఔటయ్యాడు. క్రీజులోకి రజిత్ పాటిదార్ వచ్చాడు
2 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్: 15/0
2 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ వికెట్ నష్టపోకుండా 15 పరుగులు చేసింది. క్రీజులో కెప్టెన్ ఫాప్ డుప్లెసిస్(14), విరాట్ కోహ్లి(1) ఉన్నారు.
తొలుత బ్యాటింగ్ చేయనున్న ఆర్సీబీ..
ఐపీఎల్-2024 సీజన్‌కు తెరలేచింది. తొలి మ్యాచ్‌లో చెపాక్ స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆర్సీబీ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. కాగా ఈ ఏడాది సీజన్‌లో సీఎస్‌కే సరికొత్త కెప్టెన్‌తో బరిలోకి దిగింది. ఎంస్ ధోని స్ధానంలో రుత్‌రాజ్ గైక్వాడ్ చెన్నై సారథిగా వ్యవహరిస్తున్నాడు.
అదే విధంగా కివీస్ స్టార్ ఆటగాళ్లు రచిన్ రవీంద్ర, డార్లీ మిచిల్ సీఎస్‌కే తరపున ఐపీఎల్ అరంగ్రేటం చేయనున్నారు. వీరిద్దరికి తుది జట్టులో చోటు దక్కింది. వారితో పాటు భారత యువ ఆటగాడు సమీర్ రిజ్వీ సైతం ఐపీఎల్ అరంగేట్రం చేయనున్నాడు. ఇక ఆర్సీబీ తరపున గ్రీన్, జోషఫ్ తొలిసారి ఐపీఎల్‌లో ఆడనున్నారు.
అంతకముందు ఐపీఎల్ 17వ సీజన్ ఆరంభ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ సహా కార్యదర్శి జై షా, ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా తదితరులు హాజరయ్యారు.
అదే విధంగా బాలీవుడ్ స్టార్స్ అక్షయ్‌కుమార్, టైగర్ ష్రాఫ్ డ్యాన్స్‌లు చేస్తే అభిమానులను అలరించారు. ఆ తర్వాత ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్, సింగర్ సోనూ నిగమ్ దేశభక్తిపాటలు పాడుతూ ఫ్యాన్స్‌లో ఉత్సాహాన్ని నింపారు.
తుది జట్లు
చెన్నై సూపర్ కింగ్స్: రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), రచిన్ రవీంద్ర, అజింక్యా రహానే, డారిల్ మిచెల్, రవీంద్ర జడేజా, సమీర్ రిజ్వీ, ఎంఎస్ ధోని (వికెట్ కీపర్), దీపక్ చాహర్, మహేశ్ తీక్షణ, ముస్తాఫిజుర్ రెహమాన్, తుషార్ దేశ్‌పాండే
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: ఫాఫ్ డు ప్లెసిస్(కెప్టెన్), విరాట్ కోహ్లి, రజత్ పటీదార్, గ్లెన్ మాక్స్‌వెల్, కామెరాన్ గ్రీన్, దినేష్ కార్తీక్, అనుజ్ రావత్(వికెట్ కీపర్), కర్ణ్ శర్మ, అల్జారీ జోసెఫ్, మయాంక్ డాగర్, మహ్మద్ సిరాజ్
Comments
Please login to add a commentAdd a comment