IPL 2024 KKR vs RCB Match live Updates:
ఆర్సీబీని చిత్తు చేసిన కేకేఆర్..
ఐపీఎల్-2024లో కోల్‌కతా నైట్‌రైడర్స్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 7 వికెట్ల తేడాతో కేకేఆర్ చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ బౌలర్లు దారుణంగా విఫలమయ్యారు. 183 పరుగుల లక్ష్యాన్ని కేకేఆర్ కేవలం 16.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కేకేఆర్ బ్యాటర్లలో వెంకటేశ్ అయ్యర్(50) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. సునీల్ నరైన్(22 బంతుల్లో 47), కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(39 నాటౌట్) అద్బుతమైన ఇన్నింగ్స్‌లు ఆడారు.
14 ఓవర్లకు కేకేఆర్ స్కోర్: 150/2
14 ఓవర్లు ముగిసే సరికి 2 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. కేకేఆర్ విజయానికి 36 బంతుల్లో 33 పరుగులు కావాలి. క్రీజులో వెంకటేశ్ అయ్యర్(42), శ్రేయస్ అయ్యర్(18) పరుగులతో ఉన్నారు.
రెండో వికెట్ కోల్పోయిన కేకేఆర్.. సాల్ట్ ఔట్
ఫిల్ సాల్ట్ రూపంలో కేకేఆర్ రెండో వికెట్ కోల్పోయింది. 30 పరుగులు చేసిన సాల్ట్.. వైశ్యాఖ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 11 ఓవర్లకు కేకేఆర్ స్కోర్: 128/2. క్రీజులో వెంకటేశ్ అయ్యర్(32), శ్రేయస్ అయ్యర్(12) పరుగులతో ఉన్నారు.
తొలి వికెట్ కోల్పోయిన కేకేఆర్.. నరైన్ ఔట్
86 పరుగుల వద్ద కేకేఆర్ తొలి వికెట్ కోల్పోయింది. 47 పరుగులతో దూకుడుగా ఆడిన సునీల్ నరైన్.. మయాంక్ దాగర్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు.
నరైన్ విధ్వంసం..
183 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ దూకుడుగా ఆడుతోంది. 6 ఓవర్లు ముగిసే సరికి కేకేఆర్ వికెట్ నష్టపోకుండా 85 పరుగులు చేసింది. క్రీజులో సునీల్ నరైన్(20 బంతుల్లో 47), ఫిల్ సాల్ట్(29) పరుగులతో ఉన్నారు.
దూకుడుగా ఆడుతున్న కేకేఆర్..
183 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ దూకుడుగా ఆడుతోంది. 2 ఓవర్లు ముగిసే సరికి కేకేఆర్ వికెట్ నష్టపోకుండా 32 పరుగులు చేసింది.
విరాట్ కోహ్లి ఊచకోత.. కేకేఆర్ టార్గెట్ 183 పరుగులు
కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. ఆర్సీబీ బ్యాటర్లలో విరాట్ కోహ్లి మరోసారి అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.
59 బంతులు ఎదుర్కొన్న కోహ్లి 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 83 పరుగులు చేశాడు. ఆఖరిలో దినేష్ కార్తీక్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. 8 బంతుల్లో 3 సిక్స్‌లతో కార్తీక్ 20 పరుగులు చేశాడు. కేకేఆర్ బౌలర్లలో హర్షిత్ రాణా, రస్సెల్ తలా రెండు వికెట్లు సాధించారు.
ఐదో వికెట్ డౌన్.. రావత్ ఔట్
ఆర్సీబీ ఐదో వికెట్ కోల్పోయింది. 3 పరుగులు చేసిన రావత్.. హర్షిత్ రాణా బౌలింగ్‌లో ఔటయ్యాడు.
ఐదో వికెట్ డౌన్.. రావత్ ఔట్
ఆర్సీబీ ఐదో వికెట్ కోల్పోయింది. 3 పరుగులు చేసిన అనూజ్ రావత్.. హర్షిత్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 18 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్: 153/5. క్రీజులో విరాట్ కోహ్లి(62),కార్తీక్ (1) పరుగులతో ఉన్నారు.
నాలుగో వికెట్ డౌన్.. పాటిదార్ ఔట్
ఆర్సీబీ నాలుగో వికెట్ కోల్పోయింది. 3 పరుగులు చేసిన రజిత్ పాటిదార్.. రస్సెల్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 15 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్: 134/3. క్రీజులో విరాట్ కోహ్లి(62),రావత్ (1) పరుగులతో ఉన్నారు.
మూడో వికెట్ డౌన్.. మాక్స్‌వెల్ ఔట్
గ్లెన్ మాక్స్‌వెల్ రూపంలో ఆర్సీబీ మూడో వికెట్లు కోల్పోయింది. 28 పరుగులు చేసిన మాక్స్‌వెల్.. నరైన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 15 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్: 134/3. క్రీజులో విరాట్ కోహ్లి(62), రజిత్ పాటిదార్(1) పరుగులతో ఉన్నారు.
విరాట్ కోహ్లి ఫిప్టీ..
ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. 37 బంతుల్లో కోహ్లి తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. 13 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్:109/2. 52 పరుగులతో కోహ్లి బ్యాటింగ్ చేస్తున్నాడు.
ఆర్సీబీ రెండో వికెట్ డౌన్.. గ్రీన్ ఔట్
82 పరుగుల వద్ద ఆర్సీబీ రెండో వికెట్ కోల్పోయింది. 33 పరుగులు చేసిన గ్రీన్.. రస్సెల్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు.
6 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్: 61/1
6 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ వికెట్ నష్టానికి 61 పరుగులు చేసింది. క్రీజులో గ్రీన్ (24), కోహ్లి(28) పరుగులతో ఉన్నారు.
తొలి వికెట్ కోల్పోయిన ఆర్సీబీ.. డుప్లెసిస్ ఔట్
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ తొలి వికెట్ కోల్పోయింది. 8 పరుగులు చేసిన ఆర్సీబీ కెప్టెన్ ఫాప్ డుప్లెసిస్.. హర్షిత్ రాణా బౌలింగ్‌లో ఔటయ్యాడు. 3 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్: 30/1. క్రీజులో విరాట్ కోహ్లి(21), గ్రీన్(4) పరుగులతో ఉన్నారు.
ఐపీఎల్-2024లో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కేకేఆర్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది.
తుది జట్లు
ఆర్సీబీ
విరాట్ కోహ్లి, ఫాఫ్ డు ప్లెసిస్(కెప్టెన్), కామెరూన్ గ్రీన్, రజత్ పాటిదార్, గ్లెన్ మాక్స్‌వెల్, అనుజ్ రావత్(వికెట్ కీపర్), దినేష్ కార్తీక్, అల్జారీ జోసెఫ్, మయాంక్ దాగర్, మహ్మద్ సిరాజ్, యశ్ దయాల్
కేకేఆర్
ఫిలిప్ సాల్ట్ (వికెట్ కీపర్), వెంకటేష్ అయ్యర్, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), రింకు సింగ్, సునీల్ నరైన్, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, మిచెల్ స్టార్క్, అనుకూల్ రాయ్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి
Comments
Please login to add a commentAdd a comment