ఆర్‌సీబీకి తొలి విజయం
4 వికెట్లతో పంజాబ్ ఓటమి
కోహ్లి అర్ధసెంచరీ
ఐపీఎల్ సీజన్ తొలి ఐదు మ్యాచ్‌లలో సొంతగడ్డపై ఆడిన జట్లే గెలిచాయి... ఆరో మ్యాచ్‌లో ఒకదశలో పరిస్థితి కాస్త భిన్నంగా అనిపించింది. సాధారణ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బెంగళూరు కాస్త తడబడింది. అయితే దినేశ్ కార్తీక్ దూకుడైన ఇన్నింగ్స్ చిన్నస్వామి మైదానంలో ఆర్‌సీబీకీ కావాల్సిన విజయాన్ని అందించింది. బ్యాటింగ్ వైఫల్యంతో పంజాబ్ వెనుకబడగా... కోహ్లి అర్ధసెంచరీతో తన జట్టుకు చుక్కానిలా నిలిచాడు.
బెంగళూరు: ఐపీఎల్ సీజన్ తొలి మ్యాచ్‌లో ఓడిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) మలి పోరులో విజయాన్ని సొంతం చేసుకుంది. సోమవారం జరిగిన పోరులో ఆర్‌సీబీ 4 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్‌ను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ (37 బంతుల్లో 45; 5 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం బెంగళూరు 19.2 ఓవర్లలో 6 వికెట్లకు 178 పరుగులు చేసి గెలిచింది. కోహ్లి (49 బంతుల్లో 77; 11 ఫోర్లు, 2 సిక్స్‌లు) హాఫ్ సెంచరీ చేయగా... దినేశ్ కార్తీక్ (10 బంతుల్లో 28 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరుపు బ్యాటింగ్‌తో చెలరేగాడు.
కీలక భాగస్వామ్యాలు...
తొలి 3 ఓవర్లలో 10 పరుగులు... యశ్ దయాళ్ స్పెల్ ఇది! ఈ బౌలింగ్ వల్లే పంజాబ్‌కు సరైన ఆరంభం లభించలేదు. పవర్‌ప్లే ముగిసేసరికి స్కోరు 40 పరుగులు కాగా... బెయిర్‌స్టో (8) పెవిలియన్ చేరాడు. అనంతరం ధావన్, ప్రభ్‌సిమ్రన్ (17 బంతుల్లో 25; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) రెండో వికెట్‌కు 38 బంతుల్లో 55 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను నడిపించారు.
అయితే ప్రభ్‌సిమ్రన్‌ను అవుట్ చేసి మ్యాక్స్‌వెల్ ఈ జోడీని విడదీయగా... కొద్ది సేపటికే వరుస బంతుల్లో లివింగ్‌స్టోన్ (17), ధావన్ వెనుదిరగడం జట్టును దెబ్బ తీసింది. ఈ దశలో స్యామ్ కరన్ (17 బంతుల్లో 23; 3 ఫోర్లు), జితేశ్ శర్మ (20 బంతుల్లో 27; 1 ఫోర్, 2 సిక్స్‌లు) కలిసి జట్టును ఆదుకున్నారు. అయితే ఆరు బంతుల వ్యవధిలో వీరిద్దరూ అవుటయ్యారు. జోసెఫ్ వేసిన చివరి ఓవర్లో శశాంక్ సింగ్ (21 నాటౌట్) దూకుడుగా ఆడి 2 సిక్స్‌లు, ఫోర్ బాదడంతో కింగ్స్ మెరుగ్గా ముగించగలిగింది.
కోహ్లి జోరు...
ఛేదనలో కరన్ వేసిన తొలి ఓవర్లోనే 4 ఫోర్లతో కోహ్లి జోరుగా ఇన్నింగ్స్ మొదలు పెట్టాడు. ఈ ఓవర్ రెండో బంతికే ‘సున్నా’ వద్ద కోహ్లి ఇచి్చన క్యాచ్‌ను స్లిప్‌లో బెయిర్‌స్టో వదిలేయడం కూడా కలిసొచి్చంది. అర్‡్షదీప్ ఓవర్లో కూడా అతను 3 ఫోర్లతో ఆధిక్యం ప్రదర్శించారు. అయితే మరో ఎండ్‌లో ఏ బ్యాటర్ కూడా ప్రభావం చూపలేకపోయారు. డుప్లెసిస్ (3), గ్రీన్ (3), మ్యాక్స్‌వెల్ (3) పూర్తిగా విఫలం కాగా... చహర్ ఓవర్లో రెండు సిక్స్‌లు కొట్టినా... రజత్ పటిదార్ (18) కూడా ఎక్కువసేపు నిలవలేదు. దాంతో భారం మొత్తం కోహ్లిపైనే పడింది. 31 బంతుల్లో అతని అర్ధ సెంచరీ పూర్తయింది. 25 బంతుల్లో 47 పరుగులు చేయాల్సిన స్థితిలో కోహ్లి అవుట్ కావడంతో కొంత ఉత్కంఠ నెలకొంది. అయితే కార్తీక్, లోమ్రోర్ (17 నాటౌట్) కలిసి నాలుగు బంతుల ముందే ఆర్‌సీబీని గెలిపించారు.
స్కోరు వివరాలు
పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్: ధావన్ (సి) కోహ్లి (బి) మ్యాక్స్‌వెల్ 45; బెయిర్‌స్టో (సి) కోహ్లి (బి) సిరాజ్ 8; ప్రభ్‌సిమ్రన్ (సి) రావత్ (బి) మ్యాక్స్‌వెల్ 25; లివింగ్‌స్టోన్ (సి) రావత్ (బి) జోసెఫ్ 17; కరన్ (సి) రావత్ (బి) దయాళ్ 23; జితేశ్ (సి) రావత్ (బి) సిరాజ్ 27; శశాంక్ (నాటౌట్) 21; బ్రార్ (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 176.
వికెట్ల పతనం: 1–17, 2–72, 3–98, 4–98, 5–150, 6–154.
బౌలింగ్: సిరాజ్ 4–0–26–2, యశ్ దయాళ్ 4–0–23–1, జోసెఫ్ 4–0–43–1, గ్రీన్ 2–0–19–0, డాగర్ 3–0–34–0, మ్యాక్స్‌వెల్ 3–0–29–2.
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: కోహ్లి (సి) బ్రార్ (బి) హర్షల్ 77; డుప్లెసిస్ (సి) కరన్ (బి) రబాడ 3; గ్రీన్ (సి) జితేశ్ (బి) రబాడ 3; పటిదార్ (బి) బ్రార్ 18; మ్యాక్స్‌వెల్ (బి) బ్రార్ 3; రావత్ (ఎల్బీ) (బి) కరన్ 11; కార్తీక్ (నాటౌట్) 28; లోమ్రోర్ (నాటౌట్) 17; ఎక్స్‌ట్రా లు 18; మొత్తం (19.2 ఓవర్లలో 6 వికెట్లకు) 178.
వికెట్ల పతనం: 1–26, 2–43, 3–86, 4–103, 5–130, 6–130.
బౌలింగ్: కరన్ 3–0–30–1, అర్‡్షదీప్ 3.2–0–40–0, రబాడ 4–0–23–2, బ్రార్ 4–0– 13–2, హర్షల్ 4–0–45–1, చహర్ 1–0–16–0.
Comments
Please login to add a commentAdd a comment