Chinnaswamy ground
-
IPL 2024: బెంగళూరు బల్లే బల్లే...
ఐపీఎల్ సీజన్ తొలి ఐదు మ్యాచ్‌లలో సొంతగడ్డపై ఆడిన జట్లే గెలిచాయి... ఆరో మ్యాచ్‌లో ఒకదశలో పరిస్థితి కాస్త భిన్నంగా అనిపించింది. సాధారణ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బెంగళూరు కాస్త తడబడింది. అయితే దినేశ్ కార్తీక్ దూకుడైన ఇన్నింగ్స్ చిన్నస్వామి మైదానంలో ఆర్సీబీకీ కావాల్సిన విజయాన్ని అందించింది. బ్యాటింగ్ వైఫల్యంతో పంజాబ్ వెనుకబడగా... కోహ్లి అర్ధసెంచరీతో తన జట్టుకు చుక్కానిలా నిలిచాడు. బెంగళూరు: ఐపీఎల్ సీజన్ తొలి మ్యాచ్‌లో ఓడిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) మలి పోరులో విజయాన్ని సొంతం చేసుకుంది. సోమవారం జరిగిన పోరులో ఆర్సీబీ 4 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్‌ను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ (37 బంతుల్లో 45; 5 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం బెంగళూరు 19.2 ఓవర్లలో 6 వికెట్లకు 178 పరుగులు చేసి గెలిచింది. కోహ్లి (49 బంతుల్లో 77; 11 ఫోర్లు, 2 సిక్స్‌లు) హాఫ్ సెంచరీ చేయగా... దినేశ్ కార్తీక్ (10 బంతుల్లో 28 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరుపు బ్యాటింగ్‌తో చెలరేగాడు. కీలక భాగస్వామ్యాలు... తొలి 3 ఓవర్లలో 10 పరుగులు... యశ్ దయాళ్ స్పెల్ ఇది! ఈ బౌలింగ్ వల్లే పంజాబ్‌కు సరైన ఆరంభం లభించలేదు. పవర్‌ప్లే ముగిసేసరికి స్కోరు 40 పరుగులు కాగా... బెయిర్‌స్టో (8) పెవిలియన్ చేరాడు. అనంతరం ధావన్, ప్రభ్‌సిమ్రన్ (17 బంతుల్లో 25; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) రెండో వికెట్‌కు 38 బంతుల్లో 55 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను నడిపించారు. అయితే ప్రభ్‌సిమ్రన్‌ను అవుట్ చేసి మ్యాక్స్‌వెల్ ఈ జోడీని విడదీయగా... కొద్ది సేపటికే వరుస బంతుల్లో లివింగ్‌స్టోన్ (17), ధావన్ వెనుదిరగడం జట్టును దెబ్బ తీసింది. ఈ దశలో స్యామ్ కరన్ (17 బంతుల్లో 23; 3 ఫోర్లు), జితేశ్ శర్మ (20 బంతుల్లో 27; 1 ఫోర్, 2 సిక్స్‌లు) కలిసి జట్టును ఆదుకున్నారు. అయితే ఆరు బంతుల వ్యవధిలో వీరిద్దరూ అవుటయ్యారు. జోసెఫ్ వేసిన చివరి ఓవర్లో శశాంక్ సింగ్ (21 నాటౌట్) దూకుడుగా ఆడి 2 సిక్స్‌లు, ఫోర్ బాదడంతో కింగ్స్ మెరుగ్గా ముగించగలిగింది. కోహ్లి జోరు... ఛేదనలో కరన్ వేసిన తొలి ఓవర్లోనే 4 ఫోర్లతో కోహ్లి జోరుగా ఇన్నింగ్స్ మొదలు పెట్టాడు. ఈ ఓవర్ రెండో బంతికే ‘సున్నా’ వద్ద కోహ్లి ఇచి్చన క్యాచ్‌ను స్లిప్‌లో బెయిర్‌స్టో వదిలేయడం కూడా కలిసొచి్చంది. అర్‡్షదీప్ ఓవర్లో కూడా అతను 3 ఫోర్లతో ఆధిక్యం ప్రదర్శించారు. అయితే మరో ఎండ్‌లో ఏ బ్యాటర్ కూడా ప్రభావం చూపలేకపోయారు. డుప్లెసిస్ (3), గ్రీన్ (3), మ్యాక్స్‌వెల్ (3) పూర్తిగా విఫలం కాగా... చహర్ ఓవర్లో రెండు సిక్స్‌లు కొట్టినా... రజత్ పటిదార్ (18) కూడా ఎక్కువసేపు నిలవలేదు. దాంతో భారం మొత్తం కోహ్లిపైనే పడింది. 31 బంతుల్లో అతని అర్ధ సెంచరీ పూర్తయింది. 25 బంతుల్లో 47 పరుగులు చేయాల్సిన స్థితిలో కోహ్లి అవుట్ కావడంతో కొంత ఉత్కంఠ నెలకొంది. అయితే కార్తీక్, లోమ్రోర్ (17 నాటౌట్) కలిసి నాలుగు బంతుల ముందే ఆర్సీబీని గెలిపించారు. స్కోరు వివరాలు పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్: ధావన్ (సి) కోహ్లి (బి) మ్యాక్స్‌వెల్ 45; బెయిర్‌స్టో (సి) కోహ్లి (బి) సిరాజ్ 8; ప్రభ్‌సిమ్రన్ (సి) రావత్ (బి) మ్యాక్స్‌వెల్ 25; లివింగ్‌స్టోన్ (సి) రావత్ (బి) జోసెఫ్ 17; కరన్ (సి) రావత్ (బి) దయాళ్ 23; జితేశ్ (సి) రావత్ (బి) సిరాజ్ 27; శశాంక్ (నాటౌట్) 21; బ్రార్ (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 176. వికెట్ల పతనం: 1–17, 2–72, 3–98, 4–98, 5–150, 6–154. బౌలింగ్: సిరాజ్ 4–0–26–2, యశ్ దయాళ్ 4–0–23–1, జోసెఫ్ 4–0–43–1, గ్రీన్ 2–0–19–0, డాగర్ 3–0–34–0, మ్యాక్స్‌వెల్ 3–0–29–2. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: కోహ్లి (సి) బ్రార్ (బి) హర్షల్ 77; డుప్లెసిస్ (సి) కరన్ (బి) రబాడ 3; గ్రీన్ (సి) జితేశ్ (బి) రబాడ 3; పటిదార్ (బి) బ్రార్ 18; మ్యాక్స్‌వెల్ (బి) బ్రార్ 3; రావత్ (ఎల్బీ) (బి) కరన్ 11; కార్తీక్ (నాటౌట్) 28; లోమ్రోర్ (నాటౌట్) 17; ఎక్స్ట్రా లు 18; మొత్తం (19.2 ఓవర్లలో 6 వికెట్లకు) 178. వికెట్ల పతనం: 1–26, 2–43, 3–86, 4–103, 5–130, 6–130. బౌలింగ్: కరన్ 3–0–30–1, అర్‡్షదీప్ 3.2–0–40–0, రబాడ 4–0–23–2, బ్రార్ 4–0– 13–2, హర్షల్ 4–0–45–1, చహర్ 1–0–16–0. -
బెంగళూరు చిన్నబోయింది! పరుగుల వరద పారిన పోరులో ఓడిన ఆర్సీబీ
బెంగళూరు: పరుగుల వరద పారిన పోరు... ఏకంగా 33 సిక్సర్లు నమోదు... చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) భారీ స్కోరు సాధిస్తే మేమేం తక్కువ అన్నట్లుగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) కూడా విరుచుకుపడింది. అయితే తుది ఫలితంలో మాత్రం సూపర్ కింగ్స్‌దే పైచేయి అయింది. ఒకదశలో గెలుపు ఖాయమనిపించిన ఆర్సీబీ ఓటమి బాట పట్టడంతో చిన్నస్వామి మైదానంలో అభిమానులకు తీవ్ర నిరాశ ఎదురైంది. సోమవారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో చెన్నై 8 పరుగుల తేడాతో బెంగళూరును ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన చెన్నై 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 226 పరుగులు చేసింది. డెవాన్ కాన్వే (45 బంతుల్లో 83; 6 ఫోర్లు, 6 సిక్స్‌లు), శివమ్ దూబే (27 బంతుల్లో 52; 2 ఫోర్లు, 5 సిక్స్‌లు) మెరుపు అర్ధ సెంచరీలు సాధించగా, అజింక్య రహానే (20 బంతుల్లో 37; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. అనంతరం బెంగళూరు 20 ఓవర్లలో 8 వికెట్లకు 218 పరుగులు చేసి ఓడిపోయింది. గ్లెన్ మ్యాక్స్‌వెల్ (36 బంతుల్లో 76; 3 ఫోర్లు, 8 సిక్స్‌లు), డుప్లెసిస్ (33 బంతుల్లో 62; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు) మూడో వికెట్‌కు 61 బంతుల్లోనే 126 పరుగులు జోడించారు. సమష్టి ప్రదర్శన... సిరాజ్ తొలి ఓవర్లోనే రుతురాజ్ (3) అవుట్ కావడంతో చెన్నైకి సరైన ఆరంభం లభించలేదు. అయితే రహానే, కాన్వే భాగస్వామ్యంలో స్కోరు జోరందుకుంది. వీరిద్దరు పోటీ పడి పరుగులు సాధించడంతో పవర్‌ప్లేలో స్కోరు 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 53 పరుగులకు చేరింది. హసరంగ తన తొలి ఓవర్లో చక్కటి బంతితో రహానేను బౌల్డ్ చేయడంతో 74 పరుగుల (43 బంతుల్లో) భాగస్వామ్యం ముగిసింది. అయితే ఆ తర్వాత కాన్వే, దూబే మరింత ధాటిగా పరుగులు సాధించారు. వైశాక్ ఓవర్లో కాన్వే 2 ఫోర్లు, సిక్స్ కొట్టగా, సిరాజ్ ఓవర్లో దూబే ఫోర్, సిక్స్ బాదాడు. వైశాక్ తర్వాతి ఓవర్లో వీరిద్దరు 19 పరుగులు రాబట్టారు. కాన్వే 32 బంతుల్లో, దూబే 25 బంతుల్లో అర్ధ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. మూడో వికెట్‌కు 80 పరుగులు (37 బంతుల్లో) జోడించిన వీరిద్దరు ఎనిమిది బంతుల వ్యవధిలో వెనుదిరిగినా... చివర్లో అంబటి రాయుడు (6 బంతుల్లో 14; 1 ఫోర్, 1 సిక్స్), మొయిన్ అలీ (9 బంతుల్లో 19 నాటౌట్; 2 సిక్స్‌లు) వేగంగా ఆడి కీలక పరుగులు జోడించారు. దాంతో ఐపీఎల్ చరిత్రలో చెన్నై జట్టు 25వసారి 200 అంతకంటే ఎక్కువ స్కోరు చేసింది. శతక భాగస్వామ్యం... భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆర్సీబీకి షాక్ తగిలింది. ఆకాశ్ సింగ్ తొలి ఓవర్లోనే కోహ్లి (6) షాట్‌ను వికెట్లపైకి ఆడుకోగా, ఆ వెంటనే లోమ్రోర్ (0) వెనుదిరిగాడు. అయితే డుప్లెసిస్, మ్యాక్స్‌వెల్ అద్భుత భాగస్వామ్యం జట్టును నడిపించింది. వీరిద్దరు చెన్నై బౌలర్లందరిపై విరుచుకుపడి పరుగుల వర్షం కురిపించారు. ‘సున్నా’ వద్ద డుప్లెసిస్ క్యాచ్‌ను ధోని వదిలేయడం కూడా కలిసొచ్చింది. ఆకాశ్ ఓవర్లో మ్యాక్స్‌వెల్ 2 సిక్స్‌లు బాదగా, అతని తర్వాతి ఓవర్లో డుప్లెసిస్ 2 ఫోర్లు, సిక్స్ కొట్టాడు. తుషార్ ఓవర్లో డుప్లెసిస్ వరుస బంతుల్లో 4, 4, 6... తీక్షణ ఓవర్లో మ్యాక్సీ 2 సిక్స్‌లు కొట్టడంతో ఆరు ఓవర్లలోనే స్కోరు 75 పరుగులకు చేరింది. ఈ క్రమంలో డుప్లెసిస్ 23 బంతుల్లో, మ్యాక్స్‌వెల్ 24 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్క్‌ను చేరుకున్నారు. 12వ ఓవర్ వరకు వీరి ధాటి కొనసాగింది. అయితే వరుస ఓవర్లలో వీరిద్దరిని అవుట్ చేయడంతో చెన్నైకి మళ్లీ పట్టు చిక్కింది. ఆఖర్లో దినేశ్ కార్తీక్ (14 బంతుల్లో 28; 3 ఫోర్లు, 1 సిక్స్) గెలిపించేందుకు ప్రయత్నించినా చెన్నై కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ఉత్కంఠ క్షణాలను దాటి మ్యాచ్‌ను కాపాడుకుంది. స్కోరు వివరాలు చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్: రుతురాజ్ (సి) పార్నెల్ (బి) సిరాజ్ 3; కాన్వే (బి) హర్షల్ 83; రహానే (బి) హసరంగ 37; దూబే (సి) సిరాజ్ (బి) పార్నెల్ 52; రాయుడు (సి) కార్తీక్ (బి) వైశాక్ 14; అలీ (నాటౌట్) 19; జడేజా (సి) (సబ్) ప్రభుదేశాయ్ (బి) మ్యాక్స్‌వెల్ 10; ధోని (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 226. వికెట్ల పతనం: 1–16, 2–90, 3–170, 4–178, 5–198, 6–224. బౌలింగ్: సిరాజ్ 4–0–30–1, పార్నెల్ 4–0–48–1, వైశాక్ 4–0–62–1, మ్యాక్స్‌వెల్ 2.4–0–28–1, హసరంగ 2–0–21–1, హర్షల్ పటేల్ 3.2–0–36–1. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: కోహ్లి (బి) ఆకాశ్ 6; డుప్లెసిస్ (సి) ధోని (బి) అలీ 62; లోమ్రోర్ (సి) రుతురాజ్ (బి) తుషార్ 0; మ్యాక్స్‌వెల్ (సి) ధోని (బి) తీక్షణ 76; షహబాజ్ (సి) రుతురాజ్ (బి) పతిరణ 12; కార్తీక్ (సి) తీక్షణ (బి) తుషార్ 28; ప్రభుదేశాయ్ (సి) జడేజా (బి) పతిరణ 19; పార్నెల్ (సి) దూబే (బి) తుషార్ 2; హసరంగ (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 218. వికెట్ల పతనం: 1–6, 2–15, 3–141, 4–159, 5–191, 6–192, 7–197, 8–218. బౌలింగ్: ఆకాశ్ సింగ్ 3–0–35–1, తుషార్ దేశ్‌పాండే 4–0–45–3, తీక్షణ 4–0–41–1, జడేజా 4–0–37–0, పతిరణ 4–0–42–2, మొయిన్ అలీ 1–0–13–1. -
సలామ్... జెస్సీ
దేశంలో ఏకైక మహిళా క్యురేటర్ బెంగళూరు నుంచి సాక్షి క్రీడాప్రతినిధి: ఒక వైపు వర్షం వస్తే ఏం చేయాలో గ్రౌండ్స్‌మెన్‌కు సూచనలు... మరో వైపు హైడ్రాలిక్ రోలర్ల పనితీరును పర్యవేక్షిస్తూ... ఇంకో వైపు స్వయంగా సూపర్ సాపర్లను నడిపిస్తూ బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో ఒక మహిళ బాగా సీరియస్‌గా పని చేస్తోంది. ఆ మహిళ పేరు జసింతా కళ్యాణ్. బెంగళూరులో స్థిరపడిన తెలుగు కుటుంబానికి చెందిన ఆమె వయసు 42 ఏళ్లు. మగవారికే పరిమితం అనిపించే క్రికెట్ గ్రౌండ్ క్యురేటర్‌గా పని చేస్తోంది. దేశంలోని ఏకైక మహిళా క్యురేటర్ జసింతా కావడం విశేషం. 22 ఏళ్ళ క్రితం ఇక్కడే రిసెప్షనిస్ట్‌గా ఉద్యోగం ప్రారంభించిన జసింతా అలియాస్ జెస్సీ వేర్వేరు బాధ్యతలు నిర్వర్తిస్తూ ఏడాదిన్నర క్రితం క్యురేటర్‌గా మారింది. ఆమెలో కష్టపడే స్వభావం, నాయకత్వ లక్షణాలు చూసిన కేఎస్‌సీఏ కార్యదర్శి బ్రిజేష్ పటేల్ ముందుగా గ్రౌండ్స్ నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. ఈ రంగంలో ఎలాంటి శిక్షణా లేకపోయినా, ఆ తర్వాత ఆమె ఆసక్తితో ఒక్కో విషయం నేర్చుకుంటూ పిచ్‌లు రూపొందించే స్థాయికి ఎదిగింది. గత ఏడాది పలు ఐపీఎల్ మ్యాచ్‌లతో పాటు భారత అండర్-19 మ్యాచ్‌లకు జెస్సీ పిచ్‌లు సిద్ధం చేసింది. ప్రస్తుతం చిన్నస్వామి మైదానంలో ముగ్గురు క్యురేటర్లలో ఒకరైన జసింతా, కేఎస్‌సీఏ ఇతర గ్రౌండ్స్‌కు ఇన్చార్జ్గా వ్యవహరిస్తోంది. పేదరికం కారణంగా పదో తరగతితోనే చదువును ముగించినా... మగవారితో సమానంగా పోటీ పడుతూ భిన్నమైన రంగంలో రాణిస్తుం డటం ఎంతో మంది మహిళలకు స్ఫూర్తిదాయకం. ఇది మగాళ్లకు సంబంధించిన పని మాత్రమే అంటే నేను ఒప్పుకోను. ఏ మ్యాచ్ జరిగినా అందరి దృష్టి పిచ్‌పై ఉంటుంది. తెల్లవారుజామున, అర్ధరాత్రి వరకు కూడా పని చేయాల్సి ఉండటంతో ఆరంభంలో నా భర్త ఉద్యోగం వదిలేయమన్నారు. చివరకు వారిని ఒప్పించగలిగాను. ఇప్పుడు అనుభవం తర్వాతే నాకు పిచ్‌ల తయారీపై మంచి పట్టు వచ్చింది. భవిష్యత్తులో అవసరమైన టెక్నికల్ కోర్సులు కూడా చదవాలని ఉంది.- జసింతా