బెంగళూరు వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డ రీస్ టాప్లే స్థానాన్ని మరో ఆటగాడితో భర్తీ చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు యాజమాన్యం. టాప్లే స్థానంలో మరో పేసర్‌నే ఎంచుకుంది ఆర్సీబీ మేనేజ్‌మెంట్. టాప్లే ప్లేస్‌లో సఫారీ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ వేన్ పార్నెల్ జట్టులోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు. టాప్లే సీజన్ మొత్తానికే దూరం కావడంతో పార్నెల్ ఎంపిక అనివార్యమైంది.
ఈ ఏడాది జరిగిన వేలంలో అన్‌సోల్డ్‌గా మిగిలిపోయిన పార్నెల్‌ను ఆర్సీబీ 75 లక్షలకు దక్కించుకున్నట్లు సమాచారం. పార్నెల్ మరో వారంలో జట్టుతో చేరతాడని ఆర్సీబీ బౌలింగ్ కోచ్ సంజయ్ బాంగర్ తెలిపాడు.
కాగా, ఈ సీజన్‌లో ఇప్పటికే గాయాల కారణంగా ముగ్గురు ఆర్సీబీ ఆటగాళ్లు (జోష్ హేజిల్‌వుడ్, రజత్ పాటిదార్, విల్ జాక్స్) సీజన్ మొత్తానికే దూరం కాగా.. తాజాగా టాప్లే వారి సరసన చేరాడు. తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, ఆతర్వాతి మ్యాచ్‌లో కేకేఆర్ చేతిలో 81 పరుగుల తేడాతో పరాజయంపాలైన ఆర్సీబీకి గాయాల బెడద పెద్ద తలనొప్పిగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment