IPL 2023: RCB And DC Share The Unwanted Record Of Getting All-Out For Less Than 125 Runs In IPL - Sakshi
Sakshi News home page

RCB VS KKR: చెత్త రికార్డు మూటగట్టుకున్న ఆర్సీబీ

Published Fri, Apr 7 2023 8:41 AM | Last Updated on Fri, Apr 7 2023 12:19 PM

RCB And DC Share Unwanted Record Of Getting All Out For Less Than 125 Runs In IPL - Sakshi

Photo Credit: IPL Twitter

ఐపీఎల్‌-2023లో భాగంగా నిన్న (ఏప్రిల్‌ 7) కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు 81 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆర్సీబీ.. ఢిల్లీ క్యాపిటల్స్‌తో కలిసి ఓ చెత్త రికార్డును సమం చేసింది. ఐపీఎల్‌ చరిత్రలో అత్యధిక సార్లు 125 పరుగుల లోపే ఆలౌటైన జట్టుగా నిలిచింది. ఐపీఎల్‌లో ఆర్సీబీ, ఢిల్లీ ఇప్పటివరకు చెరి 15 సార్లు 125 పరుగుల లోపు ఆలౌటయ్యాయి. ఈ రెండు జట్ల తర్వాత రాజస్థాన్‌ రాయల్స్‌ అత్యధికంగా 11 సార్లు, కేకేఆర్‌, ముంబై ఇండియన్స్‌ 9 సార్లు, పంజాబ్‌ 8 సార్లు 125 పరుగుల లోపు ఆలౌటయ్యాయి. 

ఇదిలా ఉంటే, చారిత్రక ఈడెన్‌ గార్డెన్స్‌లో నిన్న జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్‌ జూలు విదిల్చింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆ జట్టు 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేయగా.. ఛేదనలో చేతులెత్తేసిన ఆర్సీబీ 17.4 ఓవర్లలో 123 పరుగులకు ఆలౌటై ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. కేకేఆర్‌ ఇన్నింగ్స్‌లో శార్దుల్‌ ఠాకూర్‌ (29 బంతుల్లో 68; 9 ఫోర్లు, 3 సిక్స్‌లు) శివాలెత్తగా.. గుర్బాజ్‌ (44 బంతుల్లో 57; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు), రింకూ సింగ్‌ (33 బంతుల్లో 46; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) అదరగొట్టారు. ఆర్సీబీ బౌలర్లలో డేవిడ్‌ విల్లీ, కరణ్‌ శర్మ తలో 2 వికెట్లు పడగొట్టారు.

అనంతరం 205 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆర్సీబీని.. వరుణ్‌ చక్రవర్తి (4/15), సునీల్‌ నరైన్‌ (2/16), ఇంపాక్ట్‌ ప్లేయర్‌ సుయశ్‌ శర్మ (3/30) దారుణంగా దెబ్బకొట్టారు. ఆర్సీబీ ఇన్నింగ్స్‌లో డెప్లెసిస్‌ (23) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. 
   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement