IPL 2024 RCB vs LSG Live Updates:
ఆర్సీబీని చిత్తు చేసిన లక్నో సూపర్ జెయింట్స్.
ఐపీఎల్-2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరో ఓటమి చవిచూసింది. చిన్నస్వామి స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో 28 పరుగుల తేడాతో ఆర్సీబీ ఓటమి పాలైంది. 182 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ.. 19.4 ఓవర్లలో 153 పరుగులకే ఆలౌటైంది. లక్నో యువ పేసర్ మయాంక్ యాదవ్ 3 వికెట్లతో ఆర్సీబీని దెబ్బతీశాడు.
అతడితో పాటు నవీన్ ఉల్ హక్ రెండు,యశ్ ఠాకూర్, స్టోయినిష్, సిద్దార్డ్ తలా వికెట్ పడగొట్టారు. ఆర్సీబీ బ్యాటర్లలో ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన మహిపాల్ లామ్రోర్(33) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కాగా ఆర్సీబీకి ఇది మూడో ఓటమి.
ఆరో వికెట్ డౌన్.. రజిత్ పాటిదార్ ఔట్
104 పరుగుల ఆర్సీబీ ఆరో వికెట్ కోల్పోయింది. 29 పరుగులు చేసిన రజిత్ పాటిదార్(29).. మయాంక్ యాదవ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.
ఐదో వికెట్ డౌన్.. అనుజ్ రావత్ ఔట్
94 పరుగుల వద్ద ఆర్సీబీ ఐదో వికెట్ కోల్పోయింది. 11 పరుగులు చేసిన అనుజ్ రావత్.. స్టోయినిష్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి ఇంపాక్ట్ ప్లేయర్‌గా మహిపాల్ లామ్రోర్ వచ్చాడు.
12 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్ : 85/4
12 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ 4 వికెట్ల నష్టానికి 85 పరుగులు చేసింది. క్రీజులో రజిత్ పాటిదార్(25), అనుజ్ రావత్(8) పరుగులతో ఉన్నారు. .
మయాంక్ యాదవ్ ఆన్ ఫైర్.. కష్టాల్లో ఆర్సీబీ
182 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ 59 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. గ్రీన్ రూపంలో ఆర్సీబీ నాలుగో వికెట్ కోల్పోయింది. మయాంక్ యాదవ్ గ్రీన్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు.
ఆర్సీబీకి బిగ్ షాక్.. ఒకే ఓవర్‌లో డుప్లెసిస్, మాక్సీ ఔట్
182 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ పీకల్లోతు కష్టాల్లో పడింది. కేవలం 48 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఆర్సీబీ ఇన్నింగ్స్ 6 ఓవర్ వేసిన మయాంక్ యాదవ్ బౌలింగ్‌లో ఫాప్ డుప్లెసిస్ తొలుత రనౌట్ కాగా.. ఆ తర్వాత మాక్స్‌వెల్ క్యాచ్ ఔటయ్యాడు
తొలి వికెట్ కోల్పోయిన ఆర్సీబీ.. కోహ్లి ఔట్
40 పరుగుల వద్ద ఆర్సీబీ తొలి వికెట్ కోల్పోయింది. 22 పరుగులు చేసిన విరాట్ కోహ్లి.. ఎం సిద్ధార్థ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి పాటిదార్ వచ్చాడు.
3 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్: 25/0
182 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ 4 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 31 పరుగులు చేసింది. క్రీజులో విరాట్ కోహ్లి(11), ఫాప్ డుప్లెసిస్(14) ఉన్నారు.
లక్నో భారీ స్కోర్.. ఆర్సీబీ లక్ష్యం ఎంతంటే..
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. లక్నో బ్యాటర్లలో ఓపెనర్ క్వింటన్ డికాక్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. 56 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్స్‌లతో డికాక్ 81 పరుగులు చేశాడు. అతడితో పాటు నికోలస్ పూరన్ ఆఖరిలో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.
కేవలం 21 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్సర్‌తో 40 పరుగులు చేశాడు. ఆర్సీబీ బౌలర్లలో మాక్స్‌వెల్ రెండు వికెట్లు పడగొట్టగా.. సిరాజ్, టోప్లీ, యశ్‌దయాల్ తలా వికెట్ సాధించారు.
ఐదో వికెట్ డౌన్
ఎల్‌ఎస్‌జీ ఐదో వికెట్ కోల్పోయింది. 148 పరుగుల వద్ద ఆయుష్ బదోని డకౌట్‌గా వెనుదిరిగారు.
నాలుగో వికెట్ కోల్పోయిన లక్నో సూపర్ జైయింట్స్..
143 పరుగుల వద్ద ఎల్‌ఎస్‌జీ నాలుగో వికెట్ కోల్పోయింది. స్టార్ ఒపెనర్ క్వింటన్ డికాక్ (81) పరుగుల వద్ద అవుటయ్యారు. ప్రస్తుతం 17.4 ఓవర్లలో లక్నో స్కోర్..147/4.. ప్రస్తుతం క్రీజ్‌లో నికోలస్ పూరన్(7), ఆయుష్ బదోని (0)ఉన్నారు.
మూడో వికెట్ డౌన్.. స్టోయినిష్ ఔట్
129 పరుగుల వద్ద ఎల్‌ఎస్‌జీ మూడో వికెట్ కోల్పోయింది. 24 పరుగులు చేసిన మార్కస్ స్టోయినిష్.. మాక్స్‌వెల్ ఔటయ్యాడు. 15 ఓవర్లకు లక్నో స్కోర్: 131/3. క్రీజులో డికాక్(71), పూరన్(1) పరుగులతో ఉన్నారు.
13 ఓవర్లకు లక్నో స్కోర్: 121/2
13 ఓవర్లు ముగిసే సరికి లక్నో సూపర్ జెయింట్స్ 2 వికెట్ల నష్టానికి 121 పరుగులు చేసింది. క్రీజులో క్వింటన్ డికాక్(70), స్టోయినిష్(17) పరుగులతో ఉన్నారు.
రెండో వికెట్ కోల్పోయిన లక్నో.. పడిక్కల్ ఔట్
73 పరుగుల వద్ద లక్నో సూపర్ జెయింట్స్ రెండో వికెట్ కోల్పోయింది. 6 పరుగులు చేసిన దేవ్‌దత్త్ పడిక్కల్.. సిరాజ్ బౌలింగ్ ఔటయ్యాడు.
తొలి వికెట్ కోల్పోయిన లక్నో.. రాహుల్ ఔట్
53 పరుగుల వద్ద లక్నో సూపర్ జెయింట్స్ తొలి వికెట్ కోల్పోయింది. 20 పరుగులు చేసిన కెప్టెన్ కేఎల్ రాహుల్.. మాక్స్‌వెల్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 6 ఓవర్లకు లక్నో స్కోర్: 54/1. క్రీజులో డికాక్(32), పడిక్కల్(1) పరుగులతో ఉన్నారు.
2 ఓవర్లకు లక్నో స్కోర్: 19/0
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లక్నో సూపర్ జెయింట్స్ రెండు ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 19 పరుగులు చేసింది. క్రీజులో డికాక్(17), కేఎల్ రాహుల్(2) ఉన్నారు.
ఐపీఎల్-2024లో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, లక్నో సూపర్ జెయింట్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆర్సీబీ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో రెండు జట్లు చెరో మార్పుతో బరిలోకి దిగాయి. పేసర్ అల్జారీ జోషఫ్ స్ధానంలో టోప్లే ఆర్సీబీ జట్టులోకి రాగా.. మోహ్సిన్ ఖాన్ స్ధానంలో యశ్ ఠాకూర్ లక్నో జట్టులోకి వచ్చాడు.
తుది జట్లు
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లి, ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), కామెరాన్ గ్రీన్, గ్లెన్ మాక్స్‌వెల్, రజత్ పాటిదార్, దినేష్ కార్తీక్, అనుజ్ రావత్ (వికెట్ కీపర్), రీస్ టాప్లీ, మయాంక్ దాగర్, మహ్మద్ సిరాజ్, యశ్ దయాల్
లక్నో సూపర్ జెయింట్స్ : క్వింటన్ డి కాక్(వికెట్ కీపర్), కేఎల్ రాహుల్(కెప్టెన్), దేవదత్ పడిక్కల్, మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్, ఆయుష్ బడోని, కృనాల్ పాండ్యా, రవి బిష్ణోయ్, యశ్ ఠాకూర్, నవీన్-ఉల్-హక్, మయాంక్ యాదవ్
Comments
Please login to add a commentAdd a comment