#Kohli: అస్సలు ఊహించలేదు.. నీకిది తగునా కోహ్లి? | IPL 2024, CSK vs RCB: Kohli Explosive Send Off To Rachin Ravindra, Fans Fires | Sakshi
Sakshi News home page

#Kohli: ఇలాంటి ప్రవర్తన అస్సలు ఊహించలేదు.. నీకిది తగునా కోహ్లి?

Published Sat, Mar 23 2024 9:47 AM | Last Updated on Sat, Mar 23 2024 1:45 PM

IPL 2024 CSK vs RCB: Kohli Explosive Send Off to Rachin Ravindra Fans Fires - Sakshi

నీ స్థాయికి ఇది తగునా కోహ్లి? (PC: Screengrab/BCCI/X)

Virat Kohli Reaction To Rachin Ravindra Dismissal: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ అరంగేట్రంలోనే అదరగొట్టాడు చెన్నై సూపర్‌ కింగ్స్‌ క్రికెటర్‌ రచిన్‌ రవీంద్ర. న్యూజిలాండ్‌కు చెందిన ఈ ఆల్‌రౌండర్‌ ఐపీఎల్‌-2024 ఆరంభ మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగాడు.

రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో శుక్రవారం నాటి మ్యాచ్‌లో ఈ భారత సంతతి ఆటగాడు ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించాడు. మొత్తంగా 15 బంతులు ఎదుర్కొన్న రచిన్‌ ఏకంగా 37(3 ఫోర్లు, 3 సిక్సర్లు) పరుగులు రాబట్టి చెన్నై ఇన్నింగ్స్‌లో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.

తద్వారా విజయంలో తానూ భాగమై సత్తా చాటాడు రచిన్‌ రవీంద్ర. కాగా ఆర్సీబీతో మ్యాచ్‌లో జోరు మీదున్న సమయంలో రచిన్‌ను కర్ణ్‌ శర్మ అవుట్‌ చేశాడు. కర్ణ్‌ బౌలింగ్‌లో స్లాగ్‌ స్వీప్‌ షాట్‌ ఆడేందుకు ప్రయత్నించిన రచిన్‌ డీప్‌ బ్యాక్‌వర్డ్‌ స్క్వేర్‌ లెగ్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న రజత్‌ పాటిదార్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు.

ఫలితంగా ఆర్సీబీ శిబిరంలో సంబరాలు షురూ కాగా.. స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి వ్యవహరించిన తీరు అభిమానులను ఆశ్చర్యపరిచింది. రచిన్‌ను ఉద్దేశించి అభ్యంతకర వ్యాఖ్యలు చేస్తూ.. వెళ్లిపో అన్నట్లు కోహ్లి ఎక్స్‌ప్రెషన్స్‌ ఇచ్చాడన్నట్లుగా ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. 

దీంతో.. ‘‘అస్సలు ఊహించలేదు.. నీ స్థాయికి, వయసుకు ఇది తగదు చీకూ’’ అంటూ కోహ్లి అభిమానులు సైతం అతడి తీరును విమర్శిస్తున్నారు. కాగా ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ చెన్నై చేతిలో ఓడి పరాజయంతో సీజన్‌ను ఆరంభించింది.

ఇక ఆర్సీబీ ఓపెనర్‌ కోహ్లి చెపాక్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో 20 బంతులు ఎదుర్కొని కేవలం 21 పరుగులు మాత్రమే చేశాడు. ముస్తాఫిజుర్‌ బౌలింగ్‌లో రచిన్‌ రవీంద్రకు క్యాచ్‌ ఇచ్చి అవుటయ్యాడు. అదీ సంగతి!! అందుకే ఆ వైల్డ్‌ సెలబ్రేషన్‌!

చెన్నై సూపర్‌ కింగ్స్‌ వర్సెస్‌ రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు స్కోర్లు:
వేదిక: ఎంఏ చిదంబరం స్టేడియం(చెపాక్‌), చెన్నై
టాస్‌: రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు.. బ్యాటింగ్‌
రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు స్కోరు:  173/6 (20)
చెన్నై సూపర్‌ కింగ్స్‌ స్కోరు:  176/4 (18.4)
విజేత: ఆరు వికెట్ల తేడాతో చెన్నై సూపర్‌ కింగ్స్‌ గెలుపు
ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌: ముస్తాఫిజుర్‌ రహ్మాన్‌ (4/29).

చదవండి: IPL 2024: ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చాడు.. ఆర్సీబీ కొంపముంచాడు! ఎవరంటే?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement