
కోహ్లిని బెదిరించిన జడ్డూ (PC: BCCI.X)
ఐపీఎల్-2024 ఆరంభ మ్యాచ్ సందర్భంగా ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. చెన్నై సూపర్ కింగ్స్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్ విరాట్ కోహ్లి పరస్పరం టీజ్ చేసుకోవడం హైలైట్‌గా నిలిచింది.
చెన్నైలోని చెపాక్ వేదికగా సీఎస్‌కే- ఆర్సీబీ మధ్య మ్యాచ్‌తో ఐపీఎల్ పదిహేడో ఎడిషన్‌కు తెరలేచిన విషయం తెలిసిందే. సొంతమైదానంలో బెంగళూరుపై ఆధిపత్యం చాటుకుంటూ డిఫెండింగ్ చాంపియన్ చెన్నై ఆరు వికెట్ల తేడాతో గెలుపొందింది. విజయంతో సీజన్‌ను ఆరంభించింది.
ఇదిలా ఉంటే.. ఆర్సీబీతో మ్యాచ్ సందర్భంగా బౌలింగ్ చేసే క్రమంలో రవీంద్ర జడేజా కోహ్లిని ఆటపట్టించాడు. ఆర్సీబీ ఇన్నింగ్స్‌లో పదకొండో ఓవర్‌లో జడ్డూ.. కామెరాన్ గ్రీన్‌ను తన బౌలింగ్‌తో బెంబేలెత్తించాడు. అదే సమయంలో నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న కోహ్లి వద్దకు వెళ్లి.. బాల్ అతడి ముఖానికి దగ్గరగా తీసుకువెళ్లి రనౌట్ చేస్తానంటూ సరదాగా బెదిరించాడు.
వెంటనే పొజిషన్‌లోకి వచ్చిన కోహ్లి.. ‘‘పాపం.. అతడిని కాస్త ఊపిరి పీల్చుకోనివ్వు’’ అంటూ కామెరాన్ గ్రీన్‌ను మరీ ఎక్కువ ఇబ్బంది పెట్టకు అంటూ జడ్డూకు బదులిచ్చాడు. వీరిద్దరి మధ్య జరిగిన ఈ సరదా సంఘటన అభిమానులను ఆకర్షిస్తోంది. కాగా అండర్-19 స్థాయి నుంచే కోహ్లి- జడ్డూ మధ్య స్నేహం ఉంది.
ఇదిలా ఉంటే ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ స్టార్ కోహ్లి 21 పరుగులకే పరిమితం కాగా.. సీఎస్‌కే కీలక ఆల్‌రౌండర్ జడేజా పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు 25 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచి జట్టును గెలిపించాడు.
చదవండి: #Kohli: ఇలాంటి ప్రవర్తన అస్సలు ఊహించలేదు.. నీకిది తగునా కోహ్లి?
Shining on #CSK Debut ✨
— IndianPremierLeague (@IPL) March 23, 2024
Home Support 💛
Finishing touch 💪
Summing up @ChennaiIPL's opening win of the season with Shivam Dube & Debutant Rachin Ravindra 👌👌 - By @RajalArora #TATAIPL | #CSKvRCB pic.twitter.com/r65i4T0zb9