Ind Vs Nz: Axar Azaz Rachin Ravindra Jadeja BCCI Shared Pic Viral India Won - Sakshi
Sakshi News home page

Ind Vs Nz: అక్షర్‌.. పటేల్‌.. రవీంద్ర.. జడేజా.. ఫొటో అదిరింది! ఇదేదో సర్ఫ్‌ యాడ్‌లా ఉందే!

Published Mon, Dec 6 2021 2:14 PM | Last Updated on Mon, Dec 6 2021 3:29 PM

Ind Vs Nz: Axar Azaz Rachin Ravindra Jadeja BCCI Shared Pic Viral India Won - Sakshi

PC: BCCI

Ind Vs Nz: Axar Azaz Rachin Ravindra Jadeja BCCI Shared Pic Viral India Won: అజాజ్‌ పటేల్‌.. రచిన్‌ రవీంద్ర... టీమిండియా- న్యూజిలాండ్‌ టెస్టు సిరీస్‌ సందర్భంగా ఈ రెండు పేర్లు భారత అభిమానుల దృష్టిని ఆకర్షించాయి. ఇద్దరూ భారత మూలాలున్న క్రికెటర్లే.. ఇద్దరి కుటుంబాలు న్యూజిలాండ్‌కు వలస వెళ్లగా.. అక్కడి అంతర్జాతీయ క్రికెట్‌ జట్టులో ఈ ఆటగాళ్లు స్థానం దక్కించుకున్నారు. ఇక తొలి టెస్టులో భారత్‌తో దోబూచూలాడిన విజయాన్ని దక్కకుండా అడ్డుకున్నదీ వీరిద్దరేనన్న సంగతి గుర్తుండే ఉంటుంది. అజాజ్‌, రచిన్‌ అడ్డుగోడగా నిలబడటంతో టీమిండియా ఆఖరి వికెట్‌ తీయలేకపోవడంతో మ్యాచ్‌ డ్రా అయ్యింది.

ఇక ముంబై వేదికగా జరిగిన రెండో టెస్టులో... పుట్టిన గడ్డ మీద అజాజ్‌ పటేల్‌ చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఏకంగా పది వికెట్లు పడగొట్టి ఈ ఘనత సాధించిన మూడో బౌలర్‌గా చరిత్రకెక్కాడు. మరోవైపు.. టీమిండియా ఆటగాళ్లు అక్షర్‌ పటేల్‌, రవీంద్ర జడేజా కూడా టెస్టు సిరీస్‌లో తమదైన ముద్ర వేశారు. ఈ క్రమంలో.. రెండో టెస్టులో భారత్‌ ఘన విజయం సాధించి సిరీస్‌ను కైవసం చేసుకున్న తర్వాత ఈ నలుగురు స్పిన్నర్లు కలిసి దిగిన ఫొటో నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తోంది. 


PC: BCCI

నలుగురూ తమ జెర్సీ నంబర్లు, పేర్లు కనబడేలా వెనుకకు నిల్చుని ఫొటోలు దిగారు. అక్షర్‌(అక్షర్‌ పటేల్‌).. పటేల్‌(అజాజ్‌ పటేల్‌)... రవీంద్ర(రచిన్‌ రవీంద్ర)... జడేజా(రవీంద్ర జడేజా) వరుసగా నిలబడి... అక్షర్‌ పటేల్‌ రవీంద్ర జడేజా పూర్తి పేర్లు వచ్చేలా పోజులిచ్చారు. ఇక రచిన్‌, జడేజా జెర్సీ నెంబర్లు కూడా ఒకటే(నంబర్‌ 8) కావడం విశేషం. ఈ ఫొటోను షేర్‌ చేసిన బీసీసీఐ.. ‘‘ఆ నలుగురు ఎలా ఉన్నారు’’ అంటూ క్యాప్షన్‌ జతచేసింది. ఈ క్రమంలో.. ‘‘వావ్‌ ఈ సీన్‌ అదిరింది. నలుగురు స్పిన్నర్లు.. సూపర్‌’’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు... ‘‘తెలుపు.. పూర్తి తెలుపు.. ఇదేదో సర్ఫ్‌ యాడ్‌లా ఉందే’’ అని సరదా వ్యాఖ్యలు చేస్తున్నారు. 

చదవండి: ముత్తయ్య మురళీధరన్ రికార్డును బద్దలు కొట్టేది అతడే..
Rachin Ravindra Facts: ఎవరీ రచిన్‌ రవీంద్ర.. సచిన్‌, ద్రవిడ్‌తో ఏంటి సంబంధం?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement