Update: భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్ తమ మొదటి ఇన్నింగ్స్‌లో 402 పరుగులకు ఆలౌటైంది. దీంతో కివీస్‌కు మొదటి ఇన్నింగ్స్‌లో 356 పరుగుల భారీ ఆధిక్యం లభించింది.
బెంగళూరు వేదికగా టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్ ఆధిపత్యం కొనసాగుతోంది. తొలుత బౌలింగ్‌లో భారత్‌ను కట్టడి చేసిన కివీస్.. ఇప్పుడు బ్యాటింగ్‌లో కూడా అదరగొడుతోంది.
తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ దిశగా బ్యాక్ క్యాప్స్ జట్టు అడుగులు వేస్తోంది. మూడో రోజు లంచ్ సమయానికి న్యూజిలాండ్ 7 వికెట్ల నష్టానికి 345 పరుగులు చేసింది. కివీస్ మొదటి ఇన్నింగ్స్‌లో 299 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.
క్రీజులో రచిన్ రవీంద్ర(104), టిమ్ సౌథీ(49) పరుగులతో ఉన్నారు. అయితే 180/3 ఓవర్ నైట్ స్కోర్‌తో మూడో రోజు ఆటను ప్రారంభించిన కివీస్‌కు ఆదిలోనే గట్టి ఎదురు దెబ్బ తగిలింది. స్టార్ బ్యాటర్ డార్లీ మిచెల్‌ను సిరాజ్ పెవిలియన్‌కు పంపాడు. ఆ తర్వాత వికెట్ కీపర్ బ్లాండెల్‌ను బుమ్రా ఔట్ చేయగా, గ్లెన్ ఫిలిప్స్ జడేజా బోల్తా కొట్టించాడు.
కేవలం 40 పరుగుల వ్యవధిలోనే న్యూజిలాండ్ 3 కీలక వికెట్లు కోల్పోయింది. దీంతో భారత్ తిరిగి గేమ్‌లోకి వచ్చిందని అంతా భావించారు. కానీ క్రీజులో ఉన్న రచిన్ రవీంద్ర మాత్రం అందరి అంచనాలను తారుమారు చేశాడు.
రవీంద్ర సూపర్ సెంచరీ..
వరుస క్రమంలో వికెట్లు కోల్పోయినప్పటకి రవీంద్ర మాత్రం భారత బౌలర్లపై ఎదురు దాడికి దిగాడు. వెటరన్ ప్లేయర్ టిమ్ సౌథీతో కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. ఈ క్రమంలో 124 బంతుల్లో తన రెండో టెస్టు సెంచరీ మార్క్‌ను రవీంద్ర అందుకున్నాడు.
అతడి ఇన్నింగ్స్‌లో ఇప్పటివరకు 11 ఫోర్లు, 6 సిక్స్‌లు ఉన్నాయి. మరోవైపు టిమ్ సౌథీ కూడా భారత బౌలర్లను ఓ ఆట ఆడేసికుంటున్నాడు. హాఫ్ సెంచరీకి ఒక్క పరుగు దూరంలో సౌథీ ఉన్నాడు. వీరిద్దరూ ఎనిమిదో వికెట్‌కు 112 పరుగుల ఆజేయ భాగస్వామ్యం నెలకొల్పారు.
Comments
Please login to add a commentAdd a comment