Interesting Unknown Facts About New Zealand Player Rachin Ravindra And His Name - Sakshi
Sakshi News home page

Rachin Ravindra Facts: ఎవరీ రచిన్‌ రవీంద్ర.. సచిన్‌, ద్రవిడ్‌తో ఏంటి సంబంధం?

Published Thu, Nov 18 2021 4:18 PM | Last Updated on Thu, Nov 18 2021 4:55 PM

Facts About New Zeland Player Rachin Ravindra Name After Sachin And Dravid - Sakshi

Interesting Facts About New Zeland Cricketer Rachin Ravindra.. క్రికెట్‌కు పుట్టినిల్లు ఇంగ్లండ్‌ అని చాలామంది అంటుంటారు. అది సహజమే.. కానీ ఇంగ్లండ్‌ కంటే భారత్‌లోనే క్రికెట్‌కు ఆదరణ ఎక్కువ. ముఖ్యంగా 90వ దశకం నుంచి ఈ అభిమానం తారాస్థాయికి చేరుకుంది. ఎంతలా అంటే వారింట్లో చిన్నపిల్లలకు తమ అభిమాన క్రికెటర్ల పేర్లు కలిసేలా నామకరణం చేసేవారు. ఇక  సచిన్‌ టెండూల్కర్‌, ఎంఎస్‌ ధోని, విరాట్‌ కోహ్లి, రాహుల్‌ ద్రవిడ్‌, సౌరవ్‌ గంగూలీ, వీరేంద్ర సెహ్వాగ్‌, యువరాజ్‌ సింగ్‌ లాంటి క్రికెటర్లకు ఉండే ఫ్యాన్‌ బేస్‌ వేరుగా ఉండేది. ఇప్పుడిదంతా ఎందుకు చెబుతున్నారనేగా మీ డౌటు.. అక్కడికే వస్తున్నాం.
- సాక్షి, వెబ్‌డెస్క్‌

న్యూజిలాండ్‌తో బుధవారం జరిగిన తొలి టి20లో రచిన్‌ రవీంద్ర అనే పేరు ఆసక్తికరంగా కనిపించింది. నవంబర్‌ 18న పుట్టినరోజు జరుపుకుంటున్న రచిన్‌ 22వ పడిలోకి అడుగుపెట్టాడు. ఇక న్యూజిలాండ్‌ తరపున 6 టి20 మ్యాచ్‌లు ఆడిన రచిన్‌ రవీంద్ర 54 పరుగులు చేశాడు. ఇప్పుడిప్పుడే క్రికెట్‌లో ఎదుగుతున్న అతను భారత మూలాలున్న కుటుంబానికి చెందినవాడు.1990ల కాలంలోనే రచిన్‌ రవీంద్ర కుటుంబం న్యూజిలాండ్‌లో స్థిరపడింది. తండ్రి రవి కృష్ణమూర్తి సాఫ్ట్‌వేర్‌ ఆర్కిటెక్‌గా పనిచేసేవాడు.

చదవండి: IND vs NZ: కివీస్‌తో మ్యాచ్‌లో విజయం.. రోహిత్‌ 9 ఏళ్ల క్రితం ట్వీట్‌ వైరల్‌

సచిన్‌, ద్రవిడ్‌ పేర్లు కలిసివచ్చేలా..

రచిన్‌ రవీంద్ర పుట్టకముందు బెంగళూరులో ఉన్న కృష్ణమూర్తి కుటుంబం తర్వాత న్యూజిలాండ్‌కు వెళ్లి స్థిరపడింది. అక్కడ హట్‌ హాక్స్‌ పేరుతో క్రికెట్‌ క్లబ్‌ను ఆరంభించాడు. ఆ తర్వాత కూడా రవి కృష్ణమూర్తి చాలాసార్లు బెంగళూరుకు వచ్చి క్రికెట్‌ ఆడడం చేసేవాడు. ఇక తండ్రి నుంచి వారసత్వంగా క్రికెట్‌ లక్షణాలను పుచ్చుకున్న రచిన్‌ రవీంద్ర నవంబర్‌ 18, 1999న జన్మించాడు. తండ్రి కృష్ణమూర్తికి సచిన్‌ టెండూల్కర్‌, రాహుల్‌ ద్రవిడ్‌లంటే విపరీతమైన అభిమానం ఉండడంతో వారిపేర్లు కలిసి వచ్చేలా రచిన్‌ రవీంద్ర అనే పేరు పెట్టాడు.

చదవండి: Rohit Sharma: నా వీక్‌నెస్‌ బౌల్ట్‌కు బాగా తెలుసు.. ట్రాప్‌లో పడిపోయా

బ్యాటింగ్‌ ఐడల్‌గా సచిన్‌ టెండూల్కర్‌ను అభిమానిస్తూ..

New Zealand Player Rachin Ravindra
కాగా రచిన్‌ రవీంద్ర తొలిసారి న్యూజిలాండ్‌ తరపున 2016 అండర్‌-19 ప్రపంచకప్‌లో పాల్గొన్నాడు. ఆ తర్వాత 2018 అండర్‌-19 ప్రపంచకప్‌లో ఆడిన రచిన్‌.. 2021 సెప్టెంబర్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన టి20 మ్యాచ్‌ ద్వారా కివీస్‌ తరపున అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. అంతేకాదు ఐసీసీ తొలిసారి ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన వరల్డ్‌టెస్టు చాంపియన్‌షిప్‌కు న్యూజిలాండ్‌ జట్టులోకి ఎంపికయ్యాడు. కానీ తుది జట్టులో ఆడే అవకాశం రాలేదు. ఇక బ్యాటింగ్‌ ఐడల్‌గా సచిన్‌ టెండూల్కర్‌ను పేర్కొన్న రచిన్‌ రవీంద్ర అతని ఆటను చూస్తూ పెరిగానని.. నా పెరుగుదలతో పాటు అతనిపై ఉ‍న్న అభిమానం కూడా ఎక్కువ స్థాయిలో పెరిగిపోయిందంటూ ఒక ఇంటర్య్వూలో చెప్పుకొచ్చాడు.

Rachin Ravindra Facts In Telugu

ఇక అంతర్జాతీయంగా ఆరు మ్యాచ్‌లాడిన రచిన్‌ 54 పరుగులు చేయడంతో పాటు బౌలింగ్‌లో 6 వికెట్లు తీశాడు. ఇక ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌ కెరీర్‌లో 26 మ్యాచ్‌ల్లో 1470 పరుగులతో పాటు 22 వికెట్లు తీశాడు. ఇక రచిన్‌ రవీంద్ర కంటే ముందు న్యూజిలాండ్‌కు ఇష్‌ సోథీ, జీతన్‌ పటేల్‌, జీత్‌ రావల్‌ లాంటి భారతీయ మూలాలున్న ఆటగాళ్లు ప్రాతినిధ్యం వహించారు. 

Rachin Ravindra Interesting Facts

NZ Player Rachin Ravindra

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement