
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025కు ముగింట న్యూజిలాండ్‌ను గాయాల బెడద వెంటాడుతోంది. ఇప్పటికే స్టార్ ప్లేయర్లు లాకీ ఫెర్గూసన్, రచిన్ రవీంద్ర గాయాల బారిన పడగా.. తాజాగా యువ పేసర్ బెన్ సియర్స్ ఈ జాబితాలోకి చేరాడు. సియర్స్ తొడ కండరాల గాయం కారణంగా ఈ మెగా టోర్నీకి దూరమయ్యాడు.
ఈ విషయాన్ని న్యూజిలాండ్ క్రికెట్ ధ్రువీకరించింది. అతడి స్ధానాన్ని మరో పేసర్ జాకబ్ డఫీతో న్యూజిలాండ్ క్రికెట్ భర్తీ చేసింది. సియర్స్ ప్రస్తుతం పాకిస్తాన్ వేదికగా జరుగుతున్న ట్రైసిరీస్‌లో కివీస్ జట్టులో భాగంగా ఉన్నాడు. అయితే పాకిస్తాన్‌తో ఫైనల్ మ్యాచ్‌కు ముందు ప్రాక్టీస్ సెషన్‌లో సియర్స్ తొడ కండరాలు పట్టేశాయి.
అనంతరం అతడిని స్కానింగ్‌కు తరలించగా.. గ్రేడ్-3 గాయంగా తేలినట్లు తెలుస్తోంది. దీంతో ఈ యువ ఆటగాడు రెండు నుంచి మూడు వారాల పాటు ఆటకు దూరం కానున్నాడు. ఈ క్రమంలోనే కివీస్ సెలక్టర్లు అతడి స్ధానాన్ని జాకబ్ డఫీతో భర్తీ చేశారు. కాగా ఈ ఐసీసీ ఈవెంట్‌కు ముందు న్యూజిలాండ్ అద్బుతమైన ఫామ్‌లో ఉంది.
ప్రస్తుతం జరుగుతున్న ముక్కోణపు సిరీస్‌లో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో గెలిచి ఫైనల్‌కు ఆర్హత సాధించింది. శుక్రవారం కరాచీ వేదికగా పాక్‌తో జరగనున్న ఫైనల్లోనూ ఇదే జోరును కొనసాగించాలని కివీస్ భావిస్తోంది. అయితే ఈ ఫైనల్ మ్యాచ్‌కు కివీ స్టార్ ఆల్‌రౌండర్ రచిన్ రవీంద్ర సైతం దూరమయ్యాడు.
పాక్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో రవీంద్ర తలకు గాయమైంది. అయితే ఛాంపియన్స్ ట్రోఫీ ఆరంభానికి అతడు పూర్తి ఫిట్‌నెస్ సాధిస్తాడని బ్లాక్‌క్యాప్స్ హెడ్‌కోచ్ గ్యారీ స్టెడ్ స్పష్టం చేశాడు. ఇక ఈ మెగా టోర్నీలో న్యూజిలాండ్ తమ మొదటి మ్యాచ్‌లో ఫిబ్రవరి 19న పాక్‌తో తలపడనుంది.
ఛాంపియన్స్ ట్రోఫీకి కివీస్ జట్టు
మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), మైఖేల్ బ్రేస్‌వెల్, మార్క్ చాప్‌మన్, డెవాన్ కాన్వే, లోకీ ఫెర్గూసన్, మాట్ హెన్రీ, టామ్ లాథమ్, డారిల్ మిచెల్, విల్ ఓ'రూర్కే, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర,జేకబ్ డఫీ, నాథన్ స్మిత్, కేన్ విలియమ్సన్, విల్ యంగ్
చదవండి: Champions Trophy: ప్రైజ్ మనీ ప్రకటించిన ఐసీసీ.. వామ్మో ఇన్ని కోట్లా?
Comments
Please login to add a commentAdd a comment