రచిన్‌ రవీంద్ర విధ్వంసం.. ఏకంగా డబుల్‌ సెంచరీతో | Rachin Ravindra brilliant double hundred against South Africa | Sakshi
Sakshi News home page

NZ vs SA: రచిన్‌ రవీంద్ర విధ్వంసం.. ఏకంగా డబుల్‌ సెంచరీతో

Published Mon, Feb 5 2024 7:30 AM | Last Updated on Mon, Feb 5 2024 10:42 AM

Rachin Ravindra brilliant double hundred against South Africa - Sakshi

మౌంట్‌ మాంగనుయ్‌ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్‌ యువ సంచలనం రచిన్‌ రవీంద్ర దుమ్మురేపుతున్నాడు. ఈ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో రవీంద్ర అద్భుతమైన డబుల్‌ సెంచరీతో చెలరేగాడు. 340 బంతుల్లో 21 ఫోర్లు, 1 సిక్స్‌తో డబుల్‌ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. కాగా రవీంద్ర తన తొలి సెంచరీనే ద్విశతకం‍గా మార్చాడు.

ప్రస్తుతం రవీంద్ర 222 పరుగులతో బ్యాటింగ్‌ చేస్తున్నాడు. 135 ఓవర్లు ముగిసే సరికి తొలి ఇన్నింగ్స్‌లో కివీస్‌ 5 వికెట్ల నష్టానికి 437 పరుగలు చేసింది. క్రీజులో రవీంద్రతో పాటు గ్లెన్‌ ఫిలిప్స్‌ ఉన్నాడు.

అదే విధంగా మాజీ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ కూడా సెంచరీతో మెరిశాడు. ఈ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో కేన్‌ మామ(118) పరుగులు చేశాడు. కాగా గతేడాది భారత్‌ వేదికగా జరిగిన వన్డే వరల్డ్‌కప్‌లోనూ రచిన్‌ అద్బుతమైన ప్రదర్శన కనబరిచిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement