![Injured Rachin Ravindra ruled out of Tri-Nation final vs Pakistan](/styles/webp/s3/article_images/2025/02/14/Rachin.jpg.webp?itok=zOX1RATt)
ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ముంగిట పాకిస్తాన్-దక్షిణాఫ్రికా-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న ట్రైసిరీస్ తుది అంకానికి చేరుకుంది. కరాచీ వేదికగా శుక్రవారం జరగనున్న ఫైనల్ పోరులో కివీస్, పాక్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి ఛాంపియన్స్ ట్రోఫీలో అడుగుపెట్టాలని ఇరు జట్లు భావిస్తున్నాయి.
అయితే ఈ మ్యాచ్‌కు ముందు కివీస్‌కు గట్టి ఎదురు దెబ్బ తగలింది. ఆ జట్టు స్టార్ ప్లేయర్ రచిన్ రవీంద్ర గాయం కారణంగా ఫైనల్ పోరుకు కూడా దూరమయ్యాడు. ఈ విషయాన్ని కివీస్ హెడ్ కోచ్ గ్యారీ స్టెడ్ ధ్రువీకరించాడు. లహోర్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో రవీంద్ర తలకు గాయమైంది.
బంతి అతడి నుదిటికి తాకడంతో రక్తస్రావమైంది. దీంతో అతడు ఆట మధ్యలోనే మైదానాన్ని వీడాడు. ఆ తర్వాత దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌కు రవీంద్ర దూరమయ్యాడు. అయితే ఛాంపియన్స్ ట్రోఫీ సమయానికి రచిన్ కోలుకుంటాడని ఆశాభావం వ్యక్తం చేశాడు.
రచిన్ వేగంగా కోలుకుంటున్నాడు. అతడికి హెడ్ ఇంజ్యూరీ అసెస్‌మెంట్(HIA) సంబంధించి అన్ని పరీక్షలు నిర్వహించాము. అతడు ప్రస్తుతం మా వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నాడు. అయితే గత మూడు నాలుగు రోజుల నుంచి కాస్త తలనొప్పితో బాధపడుతున్నాడు. గాయం తర్వాత రచిన్ తొలిసారి నెట్ ప్రాక్టీస్‌లో పాల్గోనున్నాడు.
అతడు మరి కొన్ని రోజుల్లో తన ఫిట్‌నెస్ సాధిస్తాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో మా తొలి మ్యాచ్‌కు అతడు అందుబాటులో ఉంటాడని నేను భావిస్తున్నాను అని స్టెడ్ విలేకరుల సమావేశంలో పేర్కొన్నాడు. కాగా ఈ మెగా టోర్నీలో న్యూజిలాండ్ తమ తొలి మ్యాచ్‌లో ఫిబ్రవరి 19న పాకిస్తాన్‌తో తలపడనుంది.
ఛాంపియన్స్ ట్రోఫీకి కివీస్ జట్టు
మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), మైఖేల్ బ్రేస్‌వెల్, మార్క్ చాప్‌మన్, డెవాన్ కాన్వే, లోకీ ఫెర్గూసన్, మాట్ హెన్రీ, టామ్ లాథమ్, డారిల్ మిచెల్, విల్ ఓ'రూర్కే, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, బెన్ సియర్స్, నాథన్ స్మిత్, కేన్ విలియమ్సన్, విల్ యంగ్
స్టాండ్ బై: జేకబ్ డఫీ
చదవండి: ప్లీజ్.. నన్ను కింగ్ అని పిలవకండి: బాబర్ ఆజం
Comments
Please login to add a commentAdd a comment