
ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ముంగిట పాకిస్తాన్‌కు స్టార్ ప్లేయర్ బాబర్ ఆజం ఫామ్ ఆందోళన కలిగిస్తోంది. ఈ టోర్నీ సన్నహాకాల్లో భాగంగా స్వదేశంలో న్యూజిలాండ్, దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ముక్కోణపు వన్డే సిరీస్‌లో బాబర్ తీవ్ర నిరాశపరుస్తున్నాడు.
లహోర్ వేదికగా కివీస్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో కేవలం 10 పరుగులు చేసి ఔటైన బాబర్.. కరాచీ వేదికగా ప్రోటీస్‌తో జరిగిన వర్చువల్ నాకౌట్‌లో 23 పరుగులు చేసి ఔటయ్యాడు. మిగితా బ్యాటర్లంతా మంచి టచ్‌లో కన్పిస్తున్నప్పటికి ఆజం మాత్రం తన బ్యాట్‌కు పనిచెప్పలేకపోతున్నాడు.
కనీసం శుక్రవారం కరాచీ వేదికగా న్యూజిలాండ్‌తో జరగనున్న ఫైనల్ మ్యాచ్‌లోనైనా బాబర్ తన ఫామ్‌ను అందుకోవాలని అతడి అభిమానులు ఆశిస్తున్నారు. కాగా దక్షిణాఫ్రికాతో విజయం అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడిన బాబర్ తన గురుంచి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
తనను"కింగ్" అని పిలవడం మానేయాలని ఫ్యాన్స్‌ను ఆజం కోరాడు. కాగా బాబర్ గతంలో అద్భుతమైన ప్రదర్శన చేయడంతో అతడిని అభిమానులు ముద్దుగా కింగ్ అని పిలవడం మొదలు పెట్టారు. మరికొంతమంది అయితే టీమిండియా స్టార్ విరాట్ కోహ్లితో కూడా పోల్చారు. కానీ ఇటీవల కాలంలో బాబర్ ఫామ్ బాగా దిగజారిపోయింది. ఫామ్ లేమితో సతమతం కావడంతో కెప్టెన్సీ నుంచి కూడా ఆజం తప్పుకున్నాడు.
"దయచేసి నన్ను కింగ్ అని పిలవద్దు. నేను ఏమి రాజును కాను. ప్రస్తుతం నేను ఆ స్థితిలో లేను. నాపై ఇప్పుడు చాలా కొత్త బాధ్యతలు ఉన్నాయి. గతంలో నేను చేసిన పరుగులు, రికార్డులు కోసం ఆలోచించడం లేదు. ఇప్పుడు నాకు ప్రతీ మ్యాచ్ కూడా ఒక కొత్త సవాలు వంటిదే. నేను ప్రజెంట్‌తో భవిష్యత్తుపై దృష్టిపెట్టాలనకుంటున్నానని" ఆజం పేర్కొన్నాడు. కాగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి 19నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో కరాచీ వేదికగా పాకిస్తాన్-న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి.
ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్థాన్ జట్టు: మహ్మద్ రిజ్వాన్ (కెప్టెన్), బాబర్ అజం, ఫఖర్ జమాన్, కమ్రాన్ గులామ్, సౌద్ షకీల్, తయ్యబ్ తాహిర్, ఫహీమ్ అష్రఫ్, ఖుష్దిల్ షా, సల్మాన్ అలీ అఘా, ఉస్మాన్ ఖాన్, అబ్రర్ షాహమ్, హరీస్ నహ్మద్, హరీస్ నహ్మద్, హరీస్ షాహమ్ రౌఫ్ అఫ్రిది.
చదవండి: Champions Trophy 2025: సెమీస్‌కు చేరే జట్లు ఇవే.. పప్పులో కాలేసిన ఇంగ్లండ్ దిగ్గజం
Comments
Please login to add a commentAdd a comment