IND vs NZ 2nd Test: Virat Kohli Stunned Reaction After Rachin Ravindra Bowl Him Out - Sakshi
Sakshi News home page

IND vs NZ 2nd Test- Virat Kohli అయ్యో కోహ్లి.. ఏడ్వలేక నవ్వటం అంటే ఇదేనేమో!

Published Sun, Dec 5 2021 6:40 PM | Last Updated on Mon, Dec 6 2021 9:55 AM

IND vs NZ 2nd Test: Virat Kohli Stunned Reaction After Rachin Ravindra Bowl Him Out - Sakshi

(Photo Source: Disney + Hotstar)

IND vs NZ 2nd Test: Virat Kohli Stunned Reaction After Rachin Ravindra Bowl Him Out: న్యూజిలాండ్‌తో రెండో టెస్టులో భాగంగా జట్టుతో చేరాడు రెగ్యులర్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి. దీంతో కోహ్లి స్టైల్‌ ఇన్నింగ్స్‌... పరుగుల వరద  ఖాయమని అభిమానులు భావించారు. అయితే... తొలి ఇన్నింగ్స్‌లో కోహ్లి డకౌట్‌ అయి పూర్తిగా నిరాశపరిచాడు. అజాజ్‌ పటేల్‌ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగి ఫ్యాన్స్‌ ఆశలపై నీళ్లు చల్లాడు. 

ఇక రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం కాస్త చెప్పుకోదగ్గ స్కోరే చేసినప్పటికీ అవుటైన విధానం నిరాశపరిచింది. ముంబై టెస్టు మూడో రోజు ఆటలో భాగంగా 84 బంతులు ఎదుర్కొన్న కోహ్లి... 36 పరుగులు చేసి బౌల్డ్‌ అయ్యాడు. రచిన్‌ రవీంద్ర అద్భుత బంతితో బోల్తా కొట్టించడంతో.. ఏడ్వలేక అన్నట్లు ఓ నవ్వు నవ్వి నిరాశగా పెవిలియన్‌ చేరాడు. 

కివీస్‌ మాత్రం సంబరాల్లో మునిగిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ క్రమంలో ..‘‘సెంచరీ కొడతావు అనుకున్నాం. కానీ అవుట్‌ అయ్యావు కదా భయ్యా! ఏడ్వలేక నవ్వడం అంటే ఇదేనేమో’’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇక మూడో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా ఐదు వికెట్లు పడగొట్టి మరింత పట్టు బిగించింది. మరో ఐదు వికెట్లు తీస్తే చాలు సిరీస్‌ భారత్‌ కైవసమవుతుంది.

స్కోర్లు: టీమిండియా
తొలి ఇన్నింగ్స్‌: 325-10 (109.5 ఓవర్లలో)
రెండో ఇన్నింగ్స్‌: 276-7 d (70 ఓవర్లలో).

న్యూజిలాండ్‌
తొలి ఇన్నింగ్స్‌: 62-10 (28.1 ఓవర్లలో)
రెండో ఇన్నింగ్స్‌: 140-5 (45 ఓవర్లలో- మూడో రోజు ఆట ముగిసే సమయానికి). 

చదవండి: Ravichandran Ashwin: అశ్విన్‌ సరికొత్త రికార్డు.. కుంబ్లేను అధిగమించి..

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement