రచిన్ రవీంద్ర సూపర్ క్యాచ్‌.. బిత్తరపోయిన ఆర్సీబీ కెప్టెన్! వీడియో వైర‌ల్‌ | Rachin Ravindra Grabs A Stunner As Mustafizur Gets Faf Du Plessis | Sakshi
Sakshi News home page

IPL 2024: రచిన్ రవీంద్ర సూపర్ క్యాచ్‌.. బిత్తరపోయిన ఆర్సీబీ కెప్టెన్! వీడియో వైర‌ల్‌

Published Fri, Mar 22 2024 9:21 PM | Last Updated on Fri, Mar 22 2024 9:26 PM

Rachin Ravindra Grabs A Stunner As Mustafizur Gets Faf Du Plessis - Sakshi

ఐపీఎల్‌-2024లో భాగంగా చెపాక్  వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్‌లో సీఎస్‌కే ఆటగాడు రచిన్ రవీంద్ర సంచలన క్యాచ్‌తో మెరిశాడు. అద్భుతమైన క్యాచ్‌తో దూకుడుగా ఆడుతున్న ఆర్సీబీ కెప్టెన్ ఫాప్ డుప్లెసిస్‌ను రవీంద్ర పెవిలియన్‌కు పంపాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆర్సీబీ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో ఓపెనర్‌గా వచ్చిన డుప్లెసిస్ ఆది నుంచే సీఎస్‌కే బౌలర్లపై బౌండరీలతో విరుచుకుపడ్డాడు.

తొలి నాలుగు ఓవర్లలో ఫాప్ బౌండరీల వర్షం కురిపించాడు. ఈ క్రమంలో సీఎస్‌కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మన్ ఎటాక్‌లోకి తీసుకువచ్చాడు. ఆర్సీబీ ఇన్నింగ్స్ 5 ఓవర్ వేసిన ముస్తాఫిజుర్ రెహ్మన్  నాలుగో బంతిని డుప్లెసిస్‌కు ఫుల్ లెంగ్త్ డెలివరీగా సంధించాడు.  డుప్లెసిస్‌ లాఫ్టెడ్ షాట్ ఆడటానికి ప్రయత్నించాడు.

అయితే షాట్ సరిగ్గా కనక్ట్‌కాకపోవడంతో బంతి గాల్లోకి లేచింది. ఈ క్రమంలో డీప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న రవీంద్ర పరిగెత్తుకుంటూ వచ్చి డైవ్ చేస్తూ అద్బుతమైన క్యాచ్‌ను అందుకున్నాడు. ఇది చూసిన డుప్లెసిస్ బిత్తర పోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఈ మ్యాచ్‌లో డుప్లెసిస్‌(35) పరుగులు చేశాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement