CSK Vs GT: ర‌చిన్ ర‌వీంద్ర విధ్వంసం.. కేవ‌లం 20 బంతుల్లోనే! వీడియో వైర‌ల్‌ | IPL 2024 CSK Vs GT: No Problem For CSK As Rachin Ravindra Fires In Top Order Vs GT, Video Goes Viral - Sakshi
Sakshi News home page

IPL 2024 CSK Vs GT: ర‌చిన్ ర‌వీంద్ర విధ్వంసం.. కేవ‌లం 20 బంతుల్లోనే! వీడియో వైర‌ల్‌

Published Tue, Mar 26 2024 9:20 PM | Last Updated on Wed, Mar 27 2024 10:14 AM

CSK as Rachin Ravindra fires in top order vs GT - Sakshi

కివీస్‌ యవ సంచ‌ల‌నం, చెన్నై సూప‌ర్ కింగ్స్ ఓపెన‌ర్ రచిన్ రవీంద్ర‌ త‌న ఐపీఎల్ అరంగేట్ర సీజ‌న్‌లో అద‌ర‌గొడుతున్నాడు. ఐపీఎల్‌-2024లో భాగంగా ఆర్సీబీతో జ‌రిగిన తొలి మ్యాచ్‌లో అద‌ర‌గొట్టిన ర‌వీంద్ర‌.. ఇప్పుడు గుజ‌రాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లోనూ స‌త్తాచాటాడు. ఈ మ్యాచ్‌లో గుజ‌రాత్ బౌల‌ర్ల‌ను ర‌వీంద్ర ఊచ‌కోత కోశాడు.

ఇన్నింగ్స్ ఆరంభం నుంచే ర‌వీంద్ర బౌండ‌రీల వ‌ర్షం కురిపించాడు. ఈ మ్యాచ్‌లో 20 బంతులు ఎదుర్కొన్న ర‌వీంద్ర.. 6 ఫోర్లు, 3 సిక్స్‌ల‌తో 46 ప‌రుగులు చేసి ఔట‌య్యాడు. అత‌డి ఇన్నింగ్స్‌కు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

ఇది చూసిన నెటిజ‌న్లు సీఎస్‌కేకు మ‌రో సూప‌ర్ స్టార్ దొరికేశాడంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా ఐపీఎల్‌-2024 మినీ వేలంలో రచిన్‌ రవీంద్రను రూ. 1.80 కోట్లకు చెన్నై సూపర్‌ కింగ్స్ కొనుగోలు చేసిన సంగ‌తి తెలిసిందే. గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సీఎస్‌కే నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 6 వికెట్ల న‌ష్టానికి 206 ప‌రుగుల భారీ స్కోర్ సాధించింది.

ఈ మ్యాచ్‌లో చెన్నై బ్యాట‌ర్లు విధ్వంసం స‌ష్టించారు. ర‌చిన్ ర‌వీంద్ర‌(20 బంతుల్లో 46, 6 ఫోర్లు, 3 సిక్స్‌లు), రుతురాజ్ గైక్వాడ్ (20 బంతుల్లో 46, 5 ఫోర్లు, 1సిక్స్‌లు), శివ‌మ్ దూబే(23 బంతుల్లో 51, 2 ఫోర్లు, 5 సిక్స్‌లు) చెల‌రేగారు. గుజ‌రాత్ బౌల‌ర్ల‌లో ర‌షీద్ ఖాన్ రెండు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. సాయి కిషోర్‌, జాన్స‌న్‌, మొహిత్ శ‌ర్మ త‌లా వికెట్ ప‌డ‌గొట్టారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement