రచిన్‌ రవీంద్ర మరో విధ్వంసకర శతకం.. ఆసీస్‌కు ముచ్చెమటలు | CWC 2023, AUS vs NZ: Rachin Ravindra Completes Hundred In Just 77 Balls | Sakshi
Sakshi News home page

CWC 2023 AUS VS NZ: రచిన్‌ రవీంద్ర మరో విధ్వంసకర శతకం.. ఆసీస్‌కు ముచ్చెమటలు

Published Sat, Oct 28 2023 5:30 PM | Last Updated on Sat, Oct 28 2023 5:39 PM

CWC 2023 AUS VS NZ: Rachin Ravindra Completes Hundred In 77 Balls - Sakshi

ప్రస్తుత ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌ భవిష్యత్తు తార రచిన్‌ రవీంద్ర ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. ఈ టోర్నీలో ఇప్పటికే ఓ శతకం (ఇంగ్లండ్‌పై 82 బంతుల్లో శతకం) సాధించిన రచిన్‌.. ప్రస్తుతం ఆసీస్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో మరో విధ్వంసకర శతకం బాదాడు. ఈ మ్యాచ్‌లో రచిన్‌ కేవలం 77 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో శతక్కొట్టాడు. రచిన్‌ శతకాన్ని సిక్సర్‌ బాది చేరుకోవడం విశేషం.

ఆసీస్‌ నిర్ధేశించిన 389 పరుగుల లక్ష్య ఛేదనలో సహచరులంతా వెనుదిరుగుతున్నా రచిన్‌ ఒక్కడే ఒంటిపోరాటం చేస్తూ ఆసీస్‌కు ముచ్చెమటలు పట్టిస్తున్నాడు. 38 ఓవర్లు ముగిసే సమయానికి కివీస్‌ 5 వికెట్ల నష్టానికి 273 పరుగులు చేసి లక్ష్యాని​కి 116 పరుగుల దూరంలో ఉంది. రచిన్‌తో పాటు నీషమ్‌ క్రీజ్‌లో ఉన్నాడు. 

కాగా, ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా భారీ స్కోర్‌ చేసింది. ఓపెనర్లు డేవిడ్‌ వార్నర్‌ (65 బంతుల్లో 81; 5 ఫోర్లు, 6 సిక్సర్లు), ట్రవిస్‌ హెడ్‌ (67 బంతుల్లో 109; 10 ఫోర్లు, 7 సిక్సర్లు) సుడిగాలి ఇన్నింగ్స్‌లతో శివాలెత్తడంతో ఆసీస్‌ 49.2 ఓవర్లలో 388 పరుగులకు ఆలౌటైంది. ఆఖర్లో మ్యాక్స్‌వెల్‌ (24 బంతుల్లో 41; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), జోష్‌ ఇంగ్లిస్‌ (28 బంతుల్లో 38; 4 ఫోర్లు, సిక్స్‌), పాట్‌ కమిన్స్‌ (14 బంతుల్లో 37; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) కూడా మెరుపు ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడ్డారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement